రష్మీ ముందు నువ్వు పనికిరావు.. బ్రహ్మముడి మానస్‌ పరువు తీసేసిన తండ్రి

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అలరిస్తున్నారు. ప్రతివారం సరికొత్త థీమ్‌తో ఆకట్టుకుంటున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం కూడా సిద్ధమైంది. ఫాదర్స్ డేను పురస్కరించుకుని బుల్లితెర సెలబ్రిటీలతో ప్రత్యేకంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తొలుత బిగ్‌బాస్ ఫేమ్, బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి మాట్లాడుతూ.. నాలో నచ్చని విషయం ఏంటీ? నచ్చిన విషయం ఏంటీ? అని తన తండ్రిని అడుగుతాడు. నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు కానీ రష్మీ పక్కన చేయడం మాత్రం నచ్చదు. ఎందుకంటే రష్మీకి ఉన్నంత టాలెంట్ ఎవరికీ లేదని అంటాడు. ఫస్ట్ టైం మన ర్యాష్‌ మీ అదిరిపోయిందని రాంప్రసాద్ పంచ్ విసురుతాడు. చూడటానికి పిచ్చోడిలా ఉంటాడు కానీ మీ వాడు మామూలోడు కాదు అమ్మాయి కనిపిస్తే వదలడని ఓ నటుడి గురించి చెబుతాడు రాంప్రసాద్. అన్నీ నా పోలికలే కదా అని నటుడి తండ్రి కౌంటర్ వేయడంతో అంతా నవ్వేస్తారు.

Manas Nagulapalli Father praises rashmi gautam in Sridevi Drama Company Father s Day Special

జబర్దస్త్ నటుడు.. నేను జబర్దస్త్‌లో కనిపిస్తాను కదా నీకు ఏమనిస్తోందని తన తండ్రిని అడుగుతాడు. టీవీలో వచ్చే యాడ్సే బాగుంటున్నాయి.. అవి కనీసం 10 సెకన్లు అయినా ఉంటున్నాయి, నువ్వు మాత్రం 2 సెకన్ల కంటే ఎక్కువ ఉండటం లేదని తండ్రి పంచ్ విసరడంతో అతను షాక్ అవుతాడు. అనంతరం ఒక మైసూర్ పాక్ గాల్లో వేలాడదీసి.. ఊయల మీద నిలబడి దానిని తినాలని టాస్క్ ఇస్తుంది రష్మీ. అయితే అంతా మధ్యలోనే పడిపోతారు. తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని యోగా గురువులతో సెలబ్రిటీలంతా యోగాసనాలు చేయడానికి పోటీపడుతూ అష్టకష్టాలు పడతారు.

అనంతరం తండ్రులతో మందు తాగినట్లుగా, కొడుకులపై కోప్పడినట్లుగా స్కిట్ చేయించాడు రాంప్రసాద్. తర్వాత నాన్న గొప్పతనంపై పాటలు వినిపించడంతో అంతా ఏడ్చేశారు. రాజీవ్ కనకాల, ఏవీఎస్ కుమార్తె, శాంతి, రాజీవ్ కనకాల, పటాస్ ప్రవీణ్ అంతా ఎమోషనల్ అయ్యారు. మా నాన్న మళ్లీ తిరిగొస్తే బాగుండు.. ఆయనను ప్రతిరోజూ మిస్ అవుతున్నానని ఏవీఎస్ కుమార్తె కంటతడి పెట్టడంతో రష్మీ వచ్చి ఓదార్చింది. పటాస్ ప్రవీణ్ కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టాడు. ఒకప్పుడు మాకు బాధలు ఎక్కువగా.. ఆనందాలు చాలా తక్కువగా ఉండేవి. నేను పెళ్లి చేసుకున్నా.. మీ కోడలు నన్ను బాగా చూసుకుంటుంది, మీరు నన్ను ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటుందని చెప్పాడు.

ఆ వెంటనే పటాస్ ప్రవీణ్ భార్య వంశితను స్టేజ్ మీదకి తీసుకొచ్చి వారిద్దరికీ తలంబ్రాలు పోసుకోవడం, బిందెలో ఉంగరం వేయించే ఆటను ఆడించింది రష్మి. ఈరోజుకు నా కల నెరవేరింది. నన్ను నాన్నలా చూసుకునే భర్త దొరికాడని ప్రవీణ్‌ని హత్తుకుంది వంశిత. అనంతరం రాజీవ్ కనకాల చేతుల మీదుగా వారిద్దరికీ బట్టలు పెట్టగా.. ప్రవీణ్- వంశితలు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత స్టేజ్‌పై ఒక్కొక్కరు తమ నాన్న గురించి, నాన్నతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫుల్ ఎపిసోడ్ కోసం జూన్ 21 వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X