బ్రహ్మముడి సెట్‌లోనే హీరో, హీరోయిన్ల ఫైట్.. అసలేం జరిగిందంటే?
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ చాలా మంచి ఆదరణ లభిస్తుందనే సంగతి మనకు తెలిసిందే .ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ్రహ్మ ముడి సీరియల్ ఎంతో అద్భుతమైనటువంటి రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్లో రాజ్ అలాగే కావ్య పాత్రలు ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి.
రాజ్ పాత్రలో నటించినటువంటి మానస్ ఈ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇలా ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సీరియల్ షూటింగ్ లొకేషన్లో ఈ సీరియల్ హీరో హీరోయిన్స్ అయినటువంటి రాజ్ అలాగే కావ్య పెద్ద ఎత్తున గొడవపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో భాగంగా ప్రస్తుతం బుల్లితెరపై నీతోనే డాన్స్ సీజన్ 2 కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కంటెస్టెంట్గా మానస్ పర్ఫామెన్స్ చేస్తున్నారు. అయితే ఈయనకు జోడిగా బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ మానస్ తో కలిసి డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి కావ్య అలాగే రాజ్ సరదాగా గొడవపడ్డారు వీరు ఎలాంటి మాటలు మాట్లాడకుండా కేవలం యాక్షన్ తోనే గొడవపడ్డారని తెలుస్తోంది.
నీతోనే డాన్స్ 2.0 కోసం నన్ను ఎందుకు తీసుకోలేదు అంటూ కావ్య రాజు పై ఫైట్ చేయడానికి దిగుతుంది దీంతో రాజ్ ముందు డాన్స్ వేయడం నేర్చుకో అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తారు. తనని జోడిగా తీసుకున్నందుకు క్షమాపణలు చెప్పాలని కోరుతుంది అయితే రాజ్ మాత్రం తాను క్షమాపణలు చెప్పనని చెబుతాడు. దాంతో కావ్య సీరియల్ లో చూసుకుందాం అంటూ వీరిద్దరూ ఫైట్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసినటువంటి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మీరు ఇద్దరు స్క్రీన్ పై కనిపిస్తే చాలా బాగుంటుంది అంటూ కామెంట్లో చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











