‘ఆ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్... షూటింగ్‌లో నా భార్య అలాంటి టార్చర్’
బిగ్‌బాస్ ద్వారా పాపులరైన వారిలో మానస్ నాగులపల్లి ఒకరు. బాలనటుడిగా ఇంటస్ట్రీలో అడుగుపెట్టి సీరియల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, యాంకరింగ్‌లో దూసుకెళ్తున్నారు మానస్. బిగ్‌బాస్‌లో అద్భుతంగా ఆడియన ఈ కుర్రాడు.. ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్‌తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడిలో స్వరాజ్ పాత్రతో మానస్‌కి మంచి గుర్తింపు వచ్చింది. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్స్ షోకి గెస్ట్‌గా వచ్చిన మానస్.. తన కెరీర్, తన భార్య శ్రీజ, సీరియల్స్, జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
స్క్రీన్ మీద మీ వైఫ్‌ని కానీ, మీ భార్యని కానీ ఎక్కువగా ఎందుకు చూపించరని యాంకర్ అడగ్గా.. నా భార్యది ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఇస్మార్ట్ జోడీకి అడిగారు, ఆడిషన్స్ కూడా అయ్యాయి, స్కైప్ ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. అయితే షూటింగ్స్, స్క్రీన్ అంటే తను అంత కంఫర్ట్‌గా ఉండదు. పది మంది ఉండేసరికి తనను తాను తగ్గించుకుంటుంది. టీవీలో అది వర్కవుట్ కాదు. నేను చాలాసార్లు ట్రై చేశా.. అయితే అప్పుడప్పుడు వాళ్లు పిలిచినప్పుడు మాత్రం దానికి తీసుకురావాలని అనిపిస్తుంది. ఈ ఛానెల్.. ఆ ఛానెల్ అని కాదు. ప్రతి ఒక్కరూ కూడా నీ భార్యను కూడా తీసుకురావొచ్చు కదా అని అడిగేవారు. శ్రీజ వాయిస్‌కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీముఖితో మాట్లాడిన వాయిస్ క్లిప్పే చాలామంది ఇప్పటికీ పంపిస్తూనే ఉంటారు. మీరు మీ వైఫ్‌ని తీసుకురండి అని అడిగితే ఆమెకు అక్కడ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి తప్పించుకునేవాడిని అని మానస్ తెలిపారు.

రొమాంటిక్ సీన్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటారు. అవి చూసినప్పుడు మీ వైఫ్ రియాక్షన్ ఏంటీ? అని యాంకర్ అడగ్గా.. రొమాంటిక్ సీన్స్‌లో నేను బ్యాడ్. ఫస్ట్ తను మెసేజ్ చేస్తుంది. ఇలాంటి దరిద్య్రాలు నేను రోజూ చూడాల్సి వస్తోందని మెసేజ్ పంపిస్తుంది. నేను దానికి అహా.. హిహి అని రిప్లయ్ ఇస్తా. కాసేపు తిట్టేస్తుంది.. గొడవ పడుతుంది, ఆగిపోతుంది. ఆ తర్వాత అన్నీ మరిచిపోతుంది. మొత్తానికి నా వర్క్ గురించి తెలుసు కాబట్టి చివరికి రియలైజ్ అవుతుంది. ఆడవారికి కోపం కొంత వరకే ఎక్కువసేపు ఉండదని మానస్ అన్నారు.
కోపం వచ్చింది కదా అని నాకు నా భార్యను బుజ్జగించడం రాదు. బుజ్జగించడంలో నేను బ్యాడ్.. అబ్బాయిలందరూ కూడా బ్యాడే. కానీ కూల్ చేయగలుగుతా. ఇంట్లో నాదే పైచేయి. నేను అసలు ఇంట్లోనే ఉండను కదా? అప్పుడు పైచేయి ఎలా ఉంటుంది. నువ్వు గెస్ట్‌గా ఇంటికి వచ్చి పోతున్నావని మా అమ్మ కూడా కోప్పడుతుంది. బిజీ షెడ్యూల్ వల్ల నేను శ్రీజను ఎక్కువగా ఎక్కడికీ తీసుకెళ్లలేకపోతున్నాను. ఇప్పటికీ అది ఫీల్ అవుతూనే ఉంటా. నేను ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే డైరెక్టర్ల నుంచి ఫోన్ వస్తుంది. ఈ డేట్ ఖాళీగా ఉందా అని అడుగుతారు. మనం ఒకే కదా అని ఏదైనా ప్లాన్ చేసుకుంటాం. దాంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ దర్శకులు, మేనేజర్ల వల్లే మనం ఈ పొజిషన్‌లో ఉన్నాం... కానీ ఏదో ఒక రోజు శ్రీజకి సర్‌ప్రైజ్ ఇస్తానని మానస్ నాగులపల్లి తెలిపారు.
ఫోన్ కాల్స్‌కి ఆన్సర్ చేయకపోతే నా భార్యకి బాగా కోపం వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడైనా ఉండు.. ఎంత లేట్ అయినా పర్లేదు. కానీ నా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయమని చెబుతుంది. ఈ విషయంలో మాత్రం నేను చాలా బ్యాడ్. వర్క్‌లో ఉన్నప్పుడు, డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయను. నేను పనిలో ఉంటానని ఇంట్లో చెప్పి వెళ్లినప్పుడు నాకెందుకు కాల్ చేస్తారు అని నేను అనుకుంటా.. వాళ్లు ఏదైనా విషయం చెప్పాలనో? లేకపోతే ఇంటికి ఎప్పుడొస్తావనో కాల్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం నేను శ్రీజకి సారీ చెబుతున్నానని మానస్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications