టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్య.. ప్రేమే శాపమై మృత్యువు వెంటాడిదంటూ.

సినిమా ఇండస్ట్రీలో ఊహించని విధంగా కొన్ని మరణ వార్తలు షాక్ కి గురి చేస్తున్నాయి. గడిచిన నాలుగు నెలల్లోనే గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా మంది నటీనటులు తుది శ్వాస విడిచారు. ఇక రీసెంట్ గా ఒక సీరియల్ నటి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోవడం బుల్లితెర ప్రేక్షకులను బాధకు గురి చేసింది. టిక్ టాక్ ద్వారా ఏర్పడిన పరిచయమే ఆమె మృతికి కారణమైనట్లు తెలుస్తోంది.

Recommended Video

సీరియల్ నటి శ్రావణి సూసైడ్.. Tik Tok పరిచయమే కారణం! || Oneindia Telugu
గత 8 ఏళ్లుగా టీవీ సీరియల్స్ లలో..

గత 8 ఏళ్లుగా టీవీ సీరియల్స్ లలో..

వివరాల్లోకి వెళితే.. గత 8 ఏళ్లుగా టీవీ సీరియల్స్ లో నటిగా కొనసాగుతున్న కొండపల్లి శ్రావణి చిన్న స్థాయిలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మౌనరాగం, మనసు మమత అనే సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే రీసెంట్ గా ఆమె హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

అర్ధరాత్రి ఆత్మహత్య

అర్ధరాత్రి ఆత్మహత్య


అర్ధరాత్రి బాత్రూమ్ లోకి వెళ్లిన శ్రావణి ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో డోర్ పగలగొట్టి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆమె మరణించినట్లు తెలియడంతో సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలను కనుగొన్నారు. అయితే ఒక టిక్ టాక్ పరిచయమే ఆమె ప్రాణాలు తీసినట్లు తెలిసింది.

టిక్ టాక్ పరిచయము ప్రాణాలు తీసింది

టిక్ టాక్ పరిచయము ప్రాణాలు తీసింది

శ్రావణికి కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్ టాక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తరువాత వారు స్నేహితులుగా మారారు. మొదట్లో బాగానే ఉన్నా ఆ తరువాత దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరికి ఆమె బాధ తట్టుకోలేక మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వేధింపులే వల్లే మృతి..

వేధింపులే వల్లే మృతి..

బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్న శ్రావణిని వెంటనే యశోద హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక దేవరాజు రెడ్డి వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X