twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నైట్ డ్రస్‌లో రమ్మన్నాను.. అక్కడ అలాంటివి కామన్.. హాట్ హాట్‌గా మంచు లక్ష్మీ

    |

    మంచు లక్ష్మీ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. యాక్టర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా, నిర్మాతగా, ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో బుల్లి చిత్రాల యాక్టర్‌గా ప్రేక్షకులను దశాబ్దకాలంగా ఆలరిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలతో ఆకట్టుకొంటున్న మంచు లక్ష్మీ తాజాగా సరికొత్త అవతారం ఎత్త బోతున్నారు. సంప్రదాయ షోలకు భిన్నంగా ఓ అడుగు ముందుకు వేసి హాట్‌ హాట్ ముచ్చట్లతో ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ఆమె కొత్త అవతారం ఏమిటంటే..

    బెడ్ టైమ్ స్టోరీస్‌తో

    బెడ్ టైమ్ స్టోరీస్‌తో

    పలు రంగాల్లో ప్రతిభను చాటుకొంటున్న మంచు లక్ష్మి హోస్ట్‌గా బెడ్ టైమ్ స్టోరీస్ త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్‌గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్'అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. వయాకామ్ 18వాళ్లు నిర్వహిస్తోన్నఈ షోకు హోస్ట్ గా చేసే అవకాశం మంచు లక్ష్మి దక్కింది.

    సరికొత్త విప్లవం దిశగా డిజిటల్

    బెడ్ టైమ్ స్టోరీస్ సెప్టెంబర్ 23 తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా సరికొత్త విప్లవానికి దారి తీస్తున్నది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిసింది. ఎంటర్ టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదలను పరిచయం చేస్తుంది. అలాంటి వూట్ అప్ ప్రెజెంట్స్ చేస్తున్న 'ఫీట్ అప్ విత్ ద స్టార్' మంచు లక్ష్మీ హోస్ట్ గా రాబోతున్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో ఆకట్టుకోవడం గ్యారెంటీ అని అన్నారు.

    నైట్ డ్రస్‌లో రమ్మన్నా

    నైట్ డ్రస్‌లో రమ్మన్నా

    ఇప్పటి వరకూ నేను చేసిన షోస్ లో ఈ 'ఫీట్ అప్ విత్ ద స్టార్స్' భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్ ని కలిసి నప్పుడు నైట్ డ్రెస్‌లో రమ్మంటే వారి లో కొందరు ఆశ్చర్య పోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్‌లో ఈ తరహా షోలు సాధారణమే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షో తో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీ లకు తావులేదు అని మంచు లక్ష్మీ అన్నారు.

    భరోసాను చెరుగనివ్వను

    భరోసాను చెరుగనివ్వను

    హీరో, హీరోయిన్లు నా మీద పెట్టుకున్న భరోసా‌ను చెదరనివ్వలేదు. ఈ షో‌కి వచ్చే హీరో, హీరోయిన్లు చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్‌లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారిలో ప్రతీ రోజు ఎదో ఛేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

    సమంత గురించి చాలా తెలుసని

    సమంత గురించి చాలా తెలుసని

    ఉదాహరణకు సమంత గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు మీ కు సర్ప్రైజ్ గా ఉంటాయి. వరుణ్ తేజ్ ఈ షో లో కొత్త గా కనబడతాడు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ షో ని బాగా ఎంజాయ్ చేసాను. వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్ వే లో వెళుతుంది. ఈ షో తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఈ ఎపిసోడ్స్ ఈ నెల 23 నుండి వూట్ ఆప్ లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది" అన్నారు.

    English summary
    Manchu Lakshmi is balancing both movies and television perfectly. Now, She is coming with bed time stories by inspiring Feet up with stars. This show will transmitted from 23rd September.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X