హాట్‌హాట్‌గా మంచు లక్ష్మీ.. పడక గది కథలతో మరింత స్పైసీగా!
సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టెలివిజన్‌లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు. చాలా మంది సినీ తారల జీవితాల్లో ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తమకు నచ్చిన స్టార్ హీరో, హీరోయిన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని మంచు లక్ష్మీ స్పైసీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ స్పూర్తితో
బాలీవుడ్‌లో ఫీట్ అప్ విత్ స్టార్స్ అంటూ ఓ క్రేజీ షో ప్రసారం అవుతున్నది. కొంచెం ఫన్, మరికొంచెం క్రేజీ, ఇంకాస్త హాట్‌గా ఉండే ఎన్నో విషయాలను వాళ్లు ఈ ఫూట్ అప్ విత్ స్టార్స్‌లో షేర్ చేసుకుంటుంటారు.. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షోకు మంచు లక్ష్మీ డిజైన్ చేసింది. పలు రంగాల్లో ప్రతిభను చాటుకొంటున్న మంచు లక్ష్మి హోస్ట్‌గా ఈ షో త్వరలోనే తెలుగులో
ప్రసారం కాబోతోంది. సింపుల్‌గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్'అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు అంటున్నాయి సినీ వర్గాుల.

క్రేజీగా మంచు లక్ష్మీ షో
టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలో వారి ఫీలింగ్స్ ను ఆడియన్స్‌కు తెలిసేలా మంచు లక్ష్మి ఈ షోను మరింత క్రేజీగా హోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ తెలుగులో ఎన్నడూ రానటు వంటి షోగా ఇది మారుతుందని బాలీవుడ్ షోస్ చూసిన ఎవరికైనా అర్థమౌతుంది. వయాకామ్ 18వాళ్లు నిర్వహిస్తోన్నఈ షోకు హోస్ట్ గా చేసే అవకాశం మంచు లక్ష్మి దక్కింది.

చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని
బెడ్ టైమ్ స్టోరీస్ హోస్ట్‌గా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ‘ఫూట్ అప్ విత్ స్టార్స్' తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నాను. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ ఫీలింగ్స్ ను, సీక్రెట్స్‌ను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. తమ అభిమాన తారలను అభిమానులకు చాలా దగ్గరగా చేస్తూ చాలా ఫన్‌గా ఈ షో ఉండేలా ప్రయత్నిస్తాను అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

కొత్త అనుభూతిని కలిగిస్తుంది
టాలీవుడ్, ఇతర భాషల్లో చాలా మంది సెలబ్రిటీస్ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం నేనూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను. నాకే కాదు.. సెలబ్రిటీస్ కు కూడా ఇదో కొత్త అనుభూతిని పంచబోతున్నది. నేనూ ఈ షోకోసం చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను అని అన్నారు.

23 తేదీ నుంచి ప్రసారం
బెడ్ టైమ్ స్టోరీస్ సెప్టెంబర్ 23 తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్నది ఈ షో కోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్యూస్ సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం మీకూ
బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం అని వయాకామ్ 18 ప్రతినిధులు చెప్పారు. ఈ షో తప్పకుండా నచ్చుతుందని వారు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











