Manchu Lakshmi Vs Anasuya: మోత మోగిపోద్ది.. మంచు లక్ష్మికి అనసూయ మాస్ వార్నింగ్
Manchu Lakshmi Vs Anasuya: పండగలు, స్పెషల్ డే లు వచ్చిందంటే చాలు ఈటీవీ (Etv telugu)లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు. ప్రతి పండగకు ప్రత్యేక ప్రోగ్రామ్స్ చేస్తూ.. ఇంటిల్లిపాదికి ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. జబర్దస్త్ కామెడియన్లతో పాటు స్టార్ హీరోహీరోయిన్లను బుల్లితెరపైకి తీసుకొచ్చి పండగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ దీపావళికి యాంకర్ అనసూయ (Anasuya), నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi) లతో సూపర్ ప్రోగ్రాం ప్రసారం చేయబోతున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ లో ఈ లేడీ సార్ట్ మాస్ వార్నింగ్ తో రచ్చ చేశారు. అసలేం జరిగిందంటే..
ప్రతి పండుగకి పలు టీవీ ఛానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాయని అందరికీ తెలిసిందే. ఈ దీపావళిని కుటుంబమంతా ఆనందోత్సావంతో జరుపుకోవాలని ఈటీవీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ 'దీపావళికి మోత మోగిపోద్ది' అనే పేరుతో దీపావళి స్పెషల్ ఈవెంట్ చేసింది. అనసూయని అణు బాంబ్ , మంచు లక్ష్మి ని లక్ష్మీ బాంబ్ అంటూ సరదాగా చెప్పి, వీరిద్దరి మధ్య ఫైట్ అన్నట్టుగా ప్రోమోని కూడా డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఈ దీపావళి ప్రోగ్రాం కోసం ఫైర్ బ్రాండ్ నటి మంచు లక్ష్మి, యాంకర్ అనసూయని ప్రత్యేక అతిథులుగా పిలిచినట్టు తెలుస్తోంది. అతిథులుగా వచ్చిన వారి మధ్య పోటీ అన్నట్లు.. అనసూయ వర్సెస్ మంచు లక్ష్మి అన్నట్టు స్క్రిప్ట్ చేశారు. స్క్రిప్ట్ లో డైలాగ్స్ మాత్రం ఊర మాస్ గా ఉన్నాయి. ఈ 'దీపావళికి మోత మోగిపోద్ది' అంటూ యాంకర్ అనసూయ తనదైన స్టైల్ లో ఏంట్రీ ఇవ్వగానే.. 'ఇక్కడ లక్ష్మి బాంబు పేలిందంటే సెట్ దద్దరిల్లిపోద్ది..' అంటూ నటి మంచు లక్ష్మి మాస్ ఎంట్రీ ఇవ్వడం అదుర్స్ అని చెప్పాలి. మంచు లక్ష్మిపై అనసూయ సెటైర్ వేస్తూ..'ఇక్కడ 'అను'బాంబు.. పేలితే సెట్టే ఉండదు' అంటూ ఊర మాస్ వార్నింగ్ ఇచ్చింది.
ఈ ప్రోగ్రామ్ లో మంచు లక్ష్మీ, అనసూయలతో పాటు.. ప్రముఖ యాంకర్, శ్రీముఖి ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే.. యూట్యూబర్ షణ్ముఖ్, మానస్ , పండు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ వీరితో పాటు బుల్లితెర సీరియల్స్ టాప్ సెలబ్రిటీలందరూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో స్కిట్స్, సాంగ్స్, డ్యాన్సులు ఊర మాస్ లెవల్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రోమో చూస్తేంటే.. ఈ స్పెషల్ ప్రోగ్రాం ఇంకా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెయిన్ గా మంచు లక్ష్మీ వర్సెస్ అనసూయ డైలాగ్ ఎలా ఉండబోతుందనీ, వారు ఈ ప్రోగ్రాం చేసే రచ్చ ఎలా ఉండబోతుందో.. ఈ దీపావళికి నిజంగానే మోత మోగిపోద్దుందో తెలుసుకోవాలంటే.. దీపావళి రోజు వరకు ఎదురు చూడాల్సిందే.
ఇదిలాఉంటే.. మంచు లక్ష్మి తాజాగా ఆదిపర్వం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. గతంలో యక్షిణి అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. మరొక వైపు యాంకర్ అనసూయ యాక్టింగ్ లో బిజీగా మారింది. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అల్లు అర్జున్ - సుక్కు కాంబో మూవీ పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











