నానికి మంచు లక్ష్మీ బెదిరింపులు.. మా నాన్నకు చెప్పే వచ్చానని వార్నింగ్!

By Rajababu

వైఫ్ ఆఫ్ రామ్ ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లిన మంచు లక్ష్మి రచ్చ రచ్చ చేసింది. ఇంటి సభ్యులతో ఆనందంగా గడిపింది. అంతేకాకుండా అవసరమైనప్పుడల్లా కొందరికి చురకలు అంటించింది. కొందరిని ప్రశంసలతో ముంచెత్తింది. అయితే బిగ్‌బాస్ రెగ్యులర్‌గా చూస్తానని చెప్పిన మంచు లక్ష్మీకి ఓ పరీక్ష పెట్టాడు నాని. ఇంతకీ ఆ పరీక్ష ఏమిటంటే..

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Tejaswi Madivada Got Eliminated
మంచు లక్ష్మీకి వార్నింగ్

మంచు లక్ష్మీకి వార్నింగ్

బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లిన మంచు లక్ష్మీ గలగలా ఇంగ్లీష్‌లో మాట్లాడేసింది. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుంటే లక్ష్మీ మీరు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి అంటూ బిగ్‌బాస్ వాయిస్ హెచ్చరించింది. దాంతో ఆమె తెలుగులో ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించారు.

 నీ సంగతి చూస్తాను

నీ సంగతి చూస్తాను

నాకు ఒక కోరిక ఉండేది. బయట ఎప్పుడైన మీరు ఇంగ్లీష్ మాట్లాడితే బిగ్‌బాస్ వాయిస్ వచ్చి లక్ష్మీ మీరు తెలుగులోనే మాట్లాడాలి అని అంటే బాగుండేదని అనిపించేది. అది బిగ్‌బాస్ ఇంట్లో తీరింది అని నాని అన్నాడు. దాంతో నాని వైపు వేలు చూపిస్తూ నీ సంగతి చూస్తానని అన్నట్టుగా సైగల్ చేసింది.

మంచు లక్ష్మీకి పరీక్ష పెట్టిన నాని

మంచు లక్ష్మీకి పరీక్ష పెట్టిన నాని

మంచు లక్ష్మీ రెగ్యులర్‌గా బిగ్‌బాస్ చూస్తానని నాకు చెప్పింది. కానీ నాకు కొంత అనుమానం ఉంది. ఎందుకంటే ఆమె ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. అందువల్ల నేను బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన సంఘటనలు సైగల, మాటల ద్వారా చెబుతాను. వాటిని గుర్తుపడితే నీవు బిగ్‌బాస్ చూసినట్టే అని నాని వెల్లడించారు.

మంచు లక్ష్మీకి నాని ఝలక్

మంచు లక్ష్మీకి నాని ఝలక్

ఇంటి సభ్యులు ప్రవర్తించే విధానాన్ని, మాటలను నాని చెబుతుండగా మంచు లక్ష్మీ గుర్తించి కరెక్ట్‌గా సమాధానాలు ఇచ్చారు. అయితే అందరి గురించి చెప్పాల్సిందే నాని అంటే.. కుదరదు అని అన్నాడు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లే వరకే నీకు చాయిస్.. ఇంట్లోకి వెళ్లాకా మా ఇష్టం అని నాని ఝలక్ ఇచ్చారు.

నాన్నకు చెప్పే వచ్చాను

నాన్నకు చెప్పే వచ్చాను

బిగ్‌బాస్ హౌస్‌లో అదేమి నడువదు. ఇలాంటి తిరకాసు పెడుతారని.. వచ్చేటప్పుడు మా నాన్నకు ఇక్కడి వస్తున్నట్టు చెప్పే వచ్చాను. కాస్త లేటయితే చూసుకో అన్నాను. ఆయన బిగ్గర్ బాస్ అని నానికి షాకిచ్చింది. దాంతో ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

 మోహన్‌బాబును అనుకరించిన నాని

మోహన్‌బాబును అనుకరించిన నాని

మంచు లక్ష్మీ అలా కౌంటర్ ఇవ్వడంతో.. మోహన్‌బాబును అనుకరిస్తూ నాకు ఏమీ తెలియదు. బిగ్‌బాస్ ఇష్టం. నేను బిగ్‌బాస్ చెప్పినట్టే చేస్తాను అని నాని చేతులెత్తేశారు. దాంతో ఇలాంటి తిరకాస్ పెడుతారు.. ఏదో ఒకటి చేసేయ్ అని నాన్నకు చెప్పి వచ్చాను అని మంచు లక్ష్మీ అన్నారు.

గణేష్ యాక్టర్ అవుతావు

గణేష్ యాక్టర్ అవుతావు

గణేష్ గురించి ప్రస్తావన రాగా, అంతలా రియాక్ట్ అయ్యావు ఎందుకు. గుడ్డే కదా.. బాంబు వేసినట్టు భయపడిపోయావు. నీవు మంచి యాక్టర్ అవుతావు అని మంచు లక్ష్మీ అన్నారు. అయితే గణేష్ అలా కావడానికి కారణం దీప్తి నల్లమోతు ప్రోత్సహించడమే అని నాని చెప్పడంతో ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X