Manchu Manoj: మంచు మనోజ్, శ్రీముఖిల ఫొటోకు లవ్ సింబల్.. ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడిపోతాయంటున్న హీరో!
Manchu Manoj Fun With Sreemukhi: ఏవైనా పండుగల అప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ టీఆర్పీని పెంచుకోవడం, బుల్లితెర ప్రేక్షకులను అలరించడం చాలా కామన్ విషయం. అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఓ అద్భుతైమన షోకు ప్లాన్ చేశారు ఓ ప్రముఖ ఛానెల్ వాళ్లు. ఇందులో భాగంగానే మంచు మనోజ్ తో పాటు సుమ కనకాల, రోషన్ కనకాలను స్పెషల్ గెస్టులుగా తీసుకు వచ్చారు. అయితే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పేరుతో రాబోతున్న ఈ షోకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో సుమ, రోషన్, మంచు మనోజ్, శ్రీముఖి, హైపర్ ఆదిలు చేసిన కామెడీ అందినీ అలరిస్తోంది.
ముందుగా డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సుమ.. దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది యాంకర్లు, నటులు ఈషోకు రాబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఎవరెవరు రాబోతున్నారో వారిని చూపించారు. ఈక్రమంలోనే సీరియల్ నటి శిల్పా చక్రవర్తి.. దీపావళి సందర్భంగా మీకోసం దీపాలు తీసుకు వచ్చానంటూ సుమకు చెబుతుంది. వెంటనే సుమ.. ఇంకా నయం ఈమె నాగుల పంచమికి రాలేదు.. వస్తే పాములు తీసుకొచ్చేదేమో అంటూ పంచ్ వేసింది. దీనికి శిల్పా చక్రవర్తి మొహం మాడ్చుకోగా.. అక్కడున్న వారంతా ఫుల్లుగా నవ్వారు.

ఇక ఆ తర్వాత రోషన్ కనకాల స్టేజీపైకి ఎంట్రీ ఇవ్వడం చూపించారు. ఈక్రమంలోనే రోషన్.. తన తల్లి సుమ కనకాలను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించాడు. ముందుగా ఆయన హీరోగా చేసిన తాజా చిత్రం బబుల్ గమ్ టీజర్ చూస్తే మీకేమనిపించింది అని అడిగాడు. అందుకు సుమ.. శంకరాభారణం సినిమాను బాగా ఇష్టపడ్డాను, అలాగే అర్జున్ రెడ్డి సినిమాను కూడా చాలా లైక్ చేశాను అంచూ చెప్పుకొచ్చింది. వెంటనే హైపర్ ఆది... మరి మీ కొడుడు శంకరాభారణమా, అర్జున్ రెడ్డియా అని అడగ్గా... నా కొడుకు అర్జున్ రెడ్డియే అంటూ నవ్వేసింది.
ఇది కాగానే రఘు కుంచె ఎంట్రీ ఇచ్చి నాదీ నక్కిలేసు గొలుసు పాట పాడారు. దానికి షోకు వచ్చిన వారంతా స్టెప్పులు వేయగా.. ఫుల్ సందడి చేశారు. ఇది కాగానే శ్రీసత్య, మానస్ లు కలిసి మన్మధ రాజా మన్మధ రాజా పాటకు డ్యాన్స్ చేశారు. వీరి పర్ఫార్మెన్స్ కాగానే హీరో మంచు మనోజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయనను చూసిన శ్రీముఖి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి.. ఐ వాంట్ టు నో, అండ్ నేషన్ వాంట్స్ టు నో.. షోర్ ఇస్ మంచు మనోజ్ కమింగ్ అంటూ అరిసింది. ఇందుకు మంచు మనోజ్.. యువర్ ప్రనౌన్సేషన్ ఇస్ నాట్ రైట్ యార్ అన్నాడు. విచ్ వన్ అని శ్రీముఖి అడగ్గా.. ఆ ఈకి, టీకీ మధ్యలో వచ్చింది అంటూ నవ్వించాడు.

ఆ తర్వాత ఎలా అడిగితే చెప్తారు మీరు అని శ్రీముఖి అడగ్గా.. మంచు మనోజ్ దగ్గరకు వచ్చి అడిగితే చెప్తాను అంటాడు. దీంతో శ్రీముఖి వెళ్లి మంచు మనోజ్ చేయి పట్టుకుంటుంది. దీంతో మంచు మనోజ్ ఓ చేయిని నోట్లో పెట్టేసుకోగా.. వీరిద్దరి మొహాలకు లవ్ సింబల్ వేశారు. అలాగే నిర్వాహకులు నా మనసునే దాచావే.. అంటూ పాట వేయబోతుండగా... శ్రీముఖి, మంచు మనోజ్ లు ఒకేసారి వద్దు అని చెప్పారు. వెంటనే మనోజ్.. ఆళ్లగడ్డ నుంచి బాంబుల్ పడిపోతాయ్ అంటూ చమత్కరించాడు. దీనికి అంతా ఘొల్లుమన్నారు. మీరు ఇల్లు బానే చూసుకుంటారా అని శ్రీముఖి అడగ్గా.. ఫ్రిజ్ ఎక్కడంటూ చెమటలు తుడుచుకొని మరోసారి నవ్వించాడు. మనోజ్. ఈ ప్రోగ్రాం దీపావళి రోజు రాబోతుండి. ఎంజాయ్ చేయాలంటే ఈ షోను చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











