మౌనికతో లవ్‌పై పెదవి విప్పిన మనోజ్: ఉప్పెన సినిమాలోలా పెళ్లికి ముందే.. ఎన్ని మూస్తారో చూస్తా అంటూ!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. కష్టపడేతత్వంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.
పర్సనల్ లైఫ్‌లోనూ పెళ్లి బ్రేకప్ అవడంతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో ఇటీవలే భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో ఆమెతో ప్రేమ, దానివల్ల ఎదురైన సమస్యల గురించి మాట్లాడాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

విడాకులు ఇచ్చి... మౌనికతో: మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. దీంతో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు.
ఫ్యామిలీలో గొడవ.. ట్విస్ట్‌లు: భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడని ఈ మధ్యనే లీకైంది. ఆ సమయంలోనే వీళ్ల వివాహానికి మోహన్ బాబు ఫ్యామిలీ అడ్డు చెప్పిందని, ఈ విషయమై మనోజ్ ఇంటికి కూడా దూరం అయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ, వీళ్ల వివాహానికి అందరూ హాజరయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని గొడవలు అంటూ ఎన్నో ట్విస్టులు కనిపించిన విషయం తెలిసిందే.

భార్యతో మనోజ్ తొలిసారిగా: వివాహం తర్వాత మంచు మనోజ్ వైవాహిక జీవితాన్ని చక్కగా నడుపుకుంటోన్నాడు. అలాగే, సినిమా కెరీర్‌ను కూడా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'అలా మొదలైంది' అనే టాక్ షోకు హాజరయ్యాడు. తాజాగా ఈ ప్రోమోను విడుదల చేశారు.
అమ్మ చనిపోయిన రోజునే: వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న 'అలా మొదలైంది' అనే షోకు హాజరైన మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఎన్నో విషయాలు చెప్పారు. ఇందులో భాగంగానే మౌనిక 'అమ్మ జయంతి రోజున అలా ఆకాశం చూస్తూ ఎక్కడున్నావు? నాకేం కావాలో నీకు తెలుసు.. అంతా నీకే వదిలేస్తున్నాను అన్నా. అప్పుడే మనోజ్ వచ్చారు. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు' అని చెప్పింది.

ఉప్పెనలోలా తిరిగామంటూ: ఆ తర్వాత మంచు మనోజ్.. మౌనికతో పెళ్లికి ముందు గడిపిన క్షణాలు, ఎదురైన సమస్యల గురించి మాట్లాడాడు. 'ఉప్పెన సినిమాలోలా మేమూ పెళ్లికి ముందు చాలా ఇబ్బందులు పడుతూ బాగానే తిరిగాం. అందులో ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా లైఫ్‌లో సంవత్సరాలుంది. మేము దేశ దేశాలు, ఊర్లు తిరుగుతూ ఉన్నాం' అంటూ తొలిసారి సీక్రెట్‌ను రివీల్ చేసేశాడు.
లైఫ్ కావాలా? సినిమానా అని: ఇదే షోలో మంచు మనోజ్ 'నేను మౌనిక కోసం వెళ్లాలి. అక్కడే ఉండాలి అని ఊహించేసుకుని.. హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడ్డాను. మనం అనుకున్నట్లే ప్రేమించాం. ప్రేమ అనేది రెండు పక్కలా ఉండాలి. ఎటు పక్క నిలబడుతున్నానో, ఎక్కడున్నారో ఏం అర్థం కాలేదు. సరే నీకు లవ్ లైఫ్ కావాలా, సినిమా కావాలా సెలక్ట్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది' అన్నాడు.
ఎన్ని డోర్లు మూస్తారో అంటూ: ఈ షోలో చివర్లో మంచు మనోజ్ 'మనల్ని నమ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడింది. నేను తనకోసం నిలబడకపోతే బ్రతికి కూడా వేస్ట్ ఈ జన్మకి అనుకున్నా. అప్పుడే ఎన్ని డోర్లు మూస్తారో మూయండి అని డేర్ చేసేశాను' అని చెప్పాడు. అంతేకాదు, మనోజ్ కోపం గురించి మౌనిక.. మౌనిక డేరింగ్ గురించి వెన్నెల కిశోర్ ఎన్నో సరదా కబుర్లు కూడా మాట్లాడుకున్నారు.


Click it and Unblock the Notifications











