Ustaad Promo: ఏంటీ.. కిస్ సీన్ లేకుండా సిద్ధు జొన్నలగడ్డ సినిమా చేయడా.. సీక్రెట్ రివీల్ చేసిన మంచు మనోజ్!

టాలీవుడ్ కింగ్ కలెక్షన్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించు ఈ హీరో.. ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. 2004లో దొంగ దొంగది సినిమా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన బిందాస్ సినిమాతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. ఇటీవలే భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకుని.. తండ్రి కూడా కాబోతున్నాడు. అయితే తాజాగా ఈయన ఉస్తాద్ అనే ఓ షో ప్రారంభించారు. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని మొదటి ఎపిసోడ్ లో రాగా.. తాజాగా రెండో ఎపిసోడ్ కోసం హీరో సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది.

ఉస్తాద్ షోకు రెండో గెస్టుగా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డతో.. మంచు మనోజ్ చాలా కామెడీ చేశారు. ముఖ్యంగా తాజాగా విడదుల అయిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. డీజే టిల్లు పాటతో మంచు మనజో ఎంట్రీ ఇవ్వగానే సిద్ధు జొన్నలగడ్డ కూడా స్టేజీపైకి వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. అనంతరం వీరిద్దరూ కలిసి ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు కూడా వేశారు. ఆ తర్వాత సిద్ధు మాట్లాడుతూ.. బాబాయ్ ఇక్కడేవో రెండు మూడు బొక్కలు కనిపించాయి.. కింద పడిపోతానేమో అని భయం వేసిందని అంటాడు. దానికి వెంటనే మనోజ్... అవును బాబాయ్.. నీకు బొక్కలు అంటే ఇష్టమని అలా పెట్టానంటూ కామెడీ చేస్తాడు. దీనికి ఇద్దరూ ఫుల్ గా నవ్వుకుంటారు.

 Manchu Manoj Ustaad Show Second Episode With Siddhu jonnalagadda Promo Released

ఆ తర్వాత జాకెట్ విప్పి మరీ సోఫాలో కూర్చున్న మనోజ్.. నువ్వు స్క్రిప్టు రాయడం మొదలు పెట్టగానే... K I S S అని రాస్తావట కదా అని అడగ్గా.. టిల్లు నవ్వాడు. ఆ తర్వాత స్క్రీన్ మానిటర్ పై సిద్ధు జొన్నలగొడ్డకు సంబంధించిన కిస్సింగ్ సీన్ ఫొటోలు వచ్చాయి. దాన్ని చూసి ఆడియన్స్ అంతా ఈలలు వేస్తూ గోల చేయగా.. టిల్లు సిగ్గుపడిపోయాడు. ఈక్రమంలోనే ఆ లాంగ్ ఐరన్ రాడ్ డైలాగ్ ఏంటి అనగానే... టిల్లు చెప్పాడు. వెంటనే అందుకున్న మనోజ్.. నిజ జీవితంలో ఎన్ని రాడ్లు పడ్డాయంటూ అడిగాడు. దానికి మళ్లీ టిల్లు బాబు మళ్లీ స్టైల్ గా నవ్వేసి మీరు జాకెట్ తీసేస్తే.. ఇదని అనుకోలేదు నేను అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

మీకు మీ లైఫ్ లో వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి టిల్లు అంటూ ఓ అభిమాని అడగ్గా.. నా లైఫ్ లో ఇప్పటి వరకూ నాకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదని సిద్ధు చెప్పాడు. వెంటనే మనోజ్.. అంత టైమ్ ఇవ్వలేదు వాళ్లకు.. ప్రపోజ్ చేయడానికి రాగానే దాదా అంటూ హత్తుకోవడమే అంటూ మరోసారి కామెడీ చేశాడు మనోజ్. ఇక ర్యాంప్ ఆడిద్దామా అంటూ ఓ అభిమానిని స్టేజీపైకి తీసుకొచ్చి అసలు గేమ్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్ లో చాలానే ప్రశ్నలు ఇవ్వగా.. సమాధానం చెప్పలేక టిల్లు చాలా ఆలోచించాడు. ఈక్రమంలోనే మనోజ్ సోఫా ఇంట్లో పడుకున్నట్లుగా పడుకోవడం.. వాళ్లు చేసిన కామెడీ అదిరిపోయింది. అయితే పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప ఏం ప్రశ్నలు అడిగారు... సిద్ధు ఫ్యాన్ ఈ గేమ్ లో గెలిచి 50 లక్షలు గెలుచుకున్నాడా లేదా అనేది తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X