మణికంఠ ఎలిమినేషన్‌లో ట్విస్ట్..ఆడియెన్స్ ఓట్లతో సేఫ్..ఆయినా షో నుంచి అవుట్..ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌ ఏడో వారంలోకి ప్రవేశించింది. అయితే ఆరో వారం ఎలిమినేషన్‌లో చోటు చేసుకొన్న ట్విస్టు ఈ సీజన్‌కు హైలెట్‌గా మారింది. ఈ వారం నామినేషన్‌లో నిలిచిన మణికంఠ ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఇంటి సభ్యులనే కాకుండా షో ఫాలోవర్స్‌ కూడా చర్చించుకొనే విధంగా చేసింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ షోలోకి వచ్చే వరకు మణికంఠ అంటే ఎవరో కూడా తెలియదు. షోలోకి వచ్చిన తర్వాత తొలి రోజే వింత ఆటతీరుతో ఆయన అందర్నీ ఆకర్షించాడు. స్థిరమైన మనస్త్వత్వం లేకపోవడం, ప్రతీ చిన్న విషయానికి భావోద్వేగానికి లోనవ్వడం, అనవసరంగా కంటతడి పెట్టడం లాంటి అంశాలు ఆయనపై దృష్టిపెట్టేలా చేసింది.

Manikanta walked out from Bigg Boss Telugu 8 Show Here is the Reason

టెలివిజన్ రంగంలో కస్తూరి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఆయన ఇంటిలో ఢిఫరెంట్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నాడు. దాదాపు ఇంటి సభ్యులందరూ కూడా అతడినే టార్గెట్ చేయడంతో భారీగా ఫోకస్ అయ్యాడు. ఇక ప్రతీ వారం కూడా ఇంటిలో నామినేట్ కావడం.. ప్రతీ వారం ఎమినేషన్ నుంచి బయటపడటంతో హౌస్‌లో బలమైన కంటెస్టెంట్ అనే భావన కల్పించాడు.

అయితే ఆరోవారంలో మణికంఠ మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. నాకు బయటకు వెళ్లాలని ఉంది అంటూ పలుమార్లు కెమెరాల ముందుకు వచ్చి చెప్పడమే కాకుండా ఇంటి సభ్యులతో చెప్పడం కనిపించింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలతో చివరి వరకు ఉన్న ఆయనను హోస్ట్ నాగార్జున పిలిచి మాట్లాడటమే కాకుండా నచ్చ చెప్పడం కనిపించింది.

Manikanta walked out from Bigg Boss Telugu 8 Show Here is the Reason

అయితే ఎలిమినేషన్‌కు ముందు మణికంఠ ఇంట్లో ఉండాలా? లేదా అనే అంశంపై ఇంటి సభ్యులతో ఓటింగ్ నిర్వహించారు. ఆ ఓటింగ్‌లో మెజారిటీ సభ్యులు మణికంఠకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనంతరం మణికంఠతో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. నీ హెల్త్ రిపోర్టు అన్నీ చూశాం. నీ ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. అయితే నీవు ఇంటి నుంచి వెళ్లాలని అనుకొంటున్నావు. మాకు నీవు ఆడగలవనే నమ్మకం ఉంది అని చెప్పారు.

అయితే తనకు ఇంట్లో ఉండే ఓపిక లేదు. నేను ఫిజికల్ టాస్క్‌లు ఆడలేకపోతున్నాను. దాని వల్ల నాపై ఒత్తిడి బాగా పెరిగింది. కాబట్టి ఎలిమినేషన్‌తో సంబంధం లేకుండా నేను తప్పుకొంటున్నాను. ఇదే నా చివరి నిర్ణయం అంటూ షో నుంచి వైదొలుగుతున్నాను అని ప్రకటించారు. ఆ తర్వాత ఆయనతోపాటు గౌతమ్‌తో ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. అయితే ఆడియెన్స్ ఓటింగ్‌లో మణికంఠ సేఫ్ అయ్యాడు. గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఫలితాన్ని పక్కన పెట్టి ఇష్టపూర్వకంగా మణికంఠ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇలా ఆయన బిగ్‌బాస్ ప్రయాణం ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X