‘నువ్వో బార్ డ్యాన్సర్.. అలాంటి పనులతో పైకి వచ్చావు.. బాత్రూంకి వెళ్లి ఆ పని చేయి’ హీరోయిన్ల ఫైట్

బిగ్‌బాస్ హిందీ 17 సీజన్ ముగింపు దశకు చేరుకొన్నది. టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్లు తాజాగా ఒకరిపై మరొకరు దుమ్మొత్తి పోసుకోవడం, నిందారోపణలు చేయడం భారీ చర్చకు దారి తీసింది. టాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా, టెలివిజన్ యాక్టర్, బాలీవుడ్ నటి అంకితా లోఖండే మధ్య జరిగిన వాగ్వాదం అందర్నీ ముక్కున వేలేసుకొనేలా చేసింది. దాంతో మన్నారా ఫాలోవర్స్ ఆమెకు సపోర్ట్ చేస్తూ ట్రెండింగ్‌లో తెచ్చారు. మన్నారాను ఎలా టార్గెట్ చేశారనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ హిందీ 17 షో గత 10 వారాలకుపైగా రంజుగా సాగుతున్నది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తుది దశకు చేరుకొన్నది. ఈ షోకు సంబంధించిన ఫినాలే జనవరి 28, 2024 తేదీన జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్లందరూ స్ట్రాంగ్‌గా ఉండటంతో విజేత ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది.

Mannara Chopra Insutled by Ankitha Lokhande, ISha Malvia at Bigg Boss 17 House

బిగ్‌బాస్ 17 షోలో టాప్ కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. మునవార్ ఫరూఖీ, అభిషేక్ కుమార్,
మన్నారా చోప్రా, అంకితా లోఖండే, ఇషా మాలవియా టైటిల్ రేసులో ఉన్నారు. అయితే ఫైనల్‌కు చేరువ అవుతున్న కొద్ది కంటెస్టెంట్ల మధ్య పోరు, వారి మధ్య గొడవలు భారీగా ముదురుతున్నాయి. ఓ దశలో సంయమనం కోల్పోయి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు.

Mannara Chopra Insutled by Ankitha Lokhande, ISha Malvia at Bigg Boss 17 House

మన్నారా చోప్రా, అంకిత లోఖండే మధ్య జరిగిన ఘాట ఘాటు సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇటీవల అంకిత నోరు పారేసుకొని మన్నారాను టార్గెట్ చేసిన విధానం చాలా ఇాబ్బందికరంగా మారింది. నువ్వు బార్ డ్యాన్సర్ లాంటిదానివి. గెలువడానికి మునవార్ ఫరూఖీ ఒడిలో కూర్చొంటావు. బాత్రూమ్‌లోకి అతడి డ్రాయర్లు, అండర్ వేర్స్ కూడా ఉతుకు అంటూ కామెంట్ చేశారు.

మన్నారా చోప్రాను అంకితాతోపాటు ఇషా కూడా మాటలతో రెచ్చగొట్టేలా, మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. మన్నారా నువ్వు లుంగీలు పట్టుకొని పైకి వచ్చావు. నీవు చమ్చా దానివి. 50 ఏళ్ల దానిలా కనిపిస్తావు. ఆ విషయం వేరేలే అంటూ ఇషా చాలా చీప్‌గా టార్గెట్ చేసింది.

Mannara Chopra Insutled by Ankitha Lokhande, ISha Malvia at Bigg Boss 17 House

బిగ్‌బాస్ ఇంటిలో ఓ సందర్భంలో అంకితా లోఖండే భర్త వికీజైన్ వేసుకొన్న సాక్స్ గురించి మన్నారా మాట్లాడుతూ.. విక్కీ అన్నా సాక్స్ బాగున్నాయి అంటే.. వచ్చి వాటి వాసన చూడు. వెళ్లి అతడి చడ్డీ, బనియన్ ఉతుకు అని అంకితా అంటే.. నువ్వు వెళ్లి బ్రాతూంలు కడుక్కోపో అంటూ ఇషా విరుచుకుపడింది. ఇలా మన్నారాను వారిద్దరూ టార్గెట్ చేయడంతో ఆమెకు సపోర్టుగా నెటిజన్ల నిలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X