అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య

సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నవ్య రావు. దాదాపు 12 ఏళ్ల నుంచి టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న నవ్య అందులో 8 ఏళ్లు తెలుగు సీరియల్స్ లోనే నటించింది. బుల్లితెరపై ఆమె విలనిజం చూసి తిట్టుకున్న వాళ్లే ఆ తర్వాత తనతో సెల్ఫీలు తీసుకునే స్థితికి ఎదిగింది ఈ కన్నడ బ్యూటీ.

తాజాగా మనోహరి సీరియల్ ఫేమ్ నవ్య తాజాగా తన లవ్ స్టోరీని బయట పెట్టింది. ఆన్లైన్లో తన భర్తతో జరిగిన పరిచయం పెళ్లికి ఎలా దారి తీసింది అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇంతకీ వీళ్ళ ప్రేమాయణం ఎలా సాగింది అనే ఇంట్రెస్టింగ్ విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

Manohari Serial Actress Navya Rao reveals her love story and dating

ప్రస్తుతం మనోహరి అనే సీరియల్లో కీలక పాత్ర పోషిస్తున్న నవ్య తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తను సీరియల్స్ లో మాత్రమే విలన్ అంటూనే తన లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది అనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.

ఓసారి ఫ్రెండ్ పెళ్లికి వెళ్లగా అక్కడ తన భర్తను మొట్టమొదటిసారిగా మీట్ అయ్యిందట. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అలా పెళ్లిలో ఫస్ట్ టైం తమ ఇద్దరి మధ్య పరిచయం జరిగిందని, రెండు మూడు రోజుల తర్వాత ఇన్స్టాలో అతను మెసేజ్ చేశాడని గుర్తు చేసుకుంది నవ్య. అయితే సాధారణంగా తాను మెసేజ్ లకు రిప్లై ఇవ్వనని, కానీ డెస్టినీ కారణంగా అతనికి మెసేజ్ చేయడంతో నెమ్మదిగా తమ మధ్య స్నేహబంధం పెరిగిందని చెప్పుకొచ్చింది.

దాదాపు 9 నెలలు ఇలాగే మెసేజులు చేసుకుంటూ గడిపామని, 8 నెలల డేటింగ్ తర్వాత 9 నెలలకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని వివరించింది. ఇక తన భర్త పేరు వరుణ్ అని, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఈ సందర్భంగా వెల్లడించింది నవ్య.

Manohari Serial Actress Navya Rao reveals her love story and dating

ఆ తర్వాత తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, ఖాళీగా ఉన్న సమయంలో వంట చేస్తానని చెప్పుకొచ్చింది నవ్య. సీరియల్స్ షూటింగ్ లో ఉన్నప్పుడు తన భర్తతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటానని, గ్యాప్ వచ్చిందంటే బెంగళూరుకు వెళ్లిపోతానని చెప్పుకొచ్చింది ఈ టెలివిజన్ విలన్.

ఒకవేళ వారం గ్యాప్ వస్తే నాలుగు రోజులు అత్తగారింట్లో, మరో నాలుగు రోజులు తల్లి గారి ఇంట్లో ఉంటామని తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూలో బయట పెట్టింది నవ్య. ఇక తాను పుట్టి పెరిగింది బెంగళూరులోనే అయినప్పటికీ తెలుగు, కన్నడ భాషలను మాట్లాడగలదట.

తెలుగు వాళ్ళ ఫుడ్ లో ముద్దపప్పు ఆవకాయ, పచ్చి పులుసు లాంటివి బాగా ఇష్టమని పేర్కొంది నవ్య. తన హోమ్ టౌన్ ఫుడ్ కి, ఇక్కడ ఫుడ్ కి చాలా తేడా ఉంటుందని అయినప్పటికీ తాను హ్యాపీగా తినేస్తానని, రోటి పచ్చళ్ళు, చికెన్ పచ్చడి వంటివి కూడా చాలా ఇష్టమని వెల్లడించింది ఈ మనోహరి సీరియల్ నటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X