Guppedantha Manasu April 12th: రిషిని మర్చిపోయిన వసు.. మీటింగ్‌లో పరువు తీసిన విలన్ బ్యాచ్!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో శైలేంద్రను చూపిస్తారు. అతను దేవయానికి, రాజీవ్ కు ఫోన్ చేసి మాట్లాడతాడు. మను కాలేజీకి వచ్చాడని చెప్పగా.. నువ్వు పిలిస్తే రానన్నాడని చెప్పావు కదా అంటూ అడుగుతారు. ఏమో నాకేం తెలుసు వచ్చాడు కదా అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత దేవయాని వాడి బలహీనత ఏంటో తెలిసింది కాబట్టి సులువుగా పగ తీర్చుకోవచ్చని దేవయాని చెబుతుంది. ముఖ్యంగా నెక్స్ట్ పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఉందని.. అందులో మను పరువు తీసి వాడిని కాలేజీకి దూరం చేస్తానని అంటాడు. అది జరగ్గానే వసును నువ్వు తీసుకెళ్లిపో అంటాడు శైలేంద్ర.

అలాగే దేవయాని కూడా నేను కాలేజీకి వస్తానని చెప్పగా వద్దని శైలేంద్ర అంటాడు. అక్కడ ఏం జరిగిందో అంతా చెబుతానని అంటాడు. ఆ తర్వాత మను, వసులు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మీరు కాలేజీకి రారనుకున్నాను అనగా.. ఎందకు రాను అంటాడు మను. శైలేంద్ర మిమ్మల్ని గత మీటింగ్ లో ఇబ్బంది పెట్టారుగా అందుకే అనగా.. రోడ్డుపై వస్తుంటే బోలెడన్ని కుక్కలు మొరుగుతుంటాయి దానికే భయపడి రాకుండా ఉంటానా అంటాడు. నేను రానని చెప్పిన కారణమే వేరంటాడు. అలాగే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ చక్కగా జరగాలని.. మనం ఏదైతే జరగాలని కోరుకున్నామో అదే పూర్తిగా జరగాలని అంటాడు. ఇక ఆ తర్వాత బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది.

Manu And Vasudhara Fires on Shailendra on Guppedantha Manasu April 12th 2024 Episode 1048

అక్కడకు దేవయాని కూడా రాగా ఫణీంద్ర ఎందుకు వచ్చావని అడుగుతాడు. ఇంట్లో బోర్ కొట్టి వచ్చానని అంటుంది. ఆ తర్వాత కామర్స్ అటెండెన్స్ తగ్గిందని.. ఇప్పుడు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పెడుతున్నామని వసు వివరిస్తుంది. అప్పుడే దేవయాని.. వసు ఎండీ అయినప్పటి నుంచి ఇక్కడ అన్నీ విడ్డూరాలే జరిగుతున్నాయని చెబుతుంది. రిషి ఉన్నప్పుడు అటెండెన్స్ తగ్గలేదని, చాలా బాగుండేదని కానీ ఇప్పుడే పరిస్థితి బాలేదని అంటుంది. అప్పుడే ఫణీంద్ర ఇవన్నీ ఎందుకు అని అడగ్గా.. శైలేంద్ర మధ్యలో కల్గజేసుకుని వసుయే రిషిని పట్టించుకోవట్లేదని అంటాడు. దీనికి వెంటనే మను.. వసు మేడమ్ పట్టించుకోకపోవడం ఏంటి, ఆమె ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందని అంటారు.

ఆ తర్వాత దేవయాని నువ్వు వసు విషయంలో మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని మను నోరు మూయిస్తుంది. ఆ తర్వాత వసు రిషిని మర్చిపోయిందని, మూడు నెలల్లో రిషిని తీసుకు వస్తానని చెప్పి ఇప్పటికీ పట్టించుకోవట్లేదని అంటుంది. అంతలోనే వసు బాధ పడుతూ.. మీకు చెప్పే అన్ని పనులు చేయట్లేదని అంటుంది. ఆ తర్వాత కూడా శైలేంద్ర, దేవయానిలు ఏవేవో మాట్లాడుతుండగా.. ఫణీంద్ర వారిని అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు. అలా వాళ్లు వెళ్లిపోగా.. మీటింగ్ పూర్తి చేస్తుంది వసుధార. ఆ తర్వాత ఫణీంద్ర సారీ చెప్పి.. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని వివరిస్తాడు. మీకు తోడుగా నేను ఉంటానని అంటాడు.

Manu And Vasudhara Fires on Shailendra on Guppedantha Manasu April 12th 2024 Episode 1048

ఇక ఆ తర్వాత మహేంద్ర, మనులు ఇంట్లోకి వస్తారు. అప్పుడే అనుపమను చూసి సైలెంట్ గా ఉండగా.. తను నీకోసం ఇక్కడకు రాలేదని, నాకోసం మాత్రమే ఇక్కడకు వచ్చాడని మహేంద్ర చెబుతాడు. అలాగే కాలేజీకి కూడా వచ్చానని వివరిస్తాడు. మను నీతో ఏదో మాట్లాడాలనుకున్నాడని అనగా గాయం తగ్గిందా మేడమ్ అని తగ్గిందంటుంది. ఇక ఆ తర్వాత వసు, మహేంద్రలు లోపలికి వెళ్తారు. నీవు మనుతో మాట్లాడాని చెప్పి మరీ వెళ్తారు. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి రాకపోవడమే అందరికీ మంచిదని చెబుతాడు. ఆ తర్వాత అంతా కలిసి భోజనం చేస్తారు. ఏమైంది అంతా సైలెంట్ గా తినేస్తున్నారు, అంత బాగుందా అని మహేంద్ర అంటాడు.

అప్పుడే అనుపమ గ్లాసులో నీళ్లు పోయగా.. ఎవరికైనా పోలమారితే తాగించాలని పోస్తున్నావా అంటూ అడుగుతాడు మహేంద్ర. ఆ తర్వాత పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు అంతా వస్తున్నారా అని అడగ్గా.. మరి అనుపమ అంటాడు. మను కూడా వస్తున్నాడని చెప్పగా.. నేను రానని, నాకు ఇబ్బందిగా ఉంటుందని అనుపమ చెబుతుంది.. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X