Guppedantha Manasu April 9th: బోర్డ్ మీటింగ్‌కు హాజరు కాని మను.. ఆ భయమే కారణమా!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మహేంద్ర అనుపమతో మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా జగతి, రిషిల మధ్య కోపం, అధికారం, ప్రేమ.. ఇలా ఒకరిపై ఒకరికి చాలా ఎక్కువగా ఉండేవని.. కానీ చివరకు కలిసిపోయారని మహేంద్ర చెప్పుకొస్తాడు. మీరు కూడా అలాగే త్వరలోనే కలిసిపోతారని అనుపమకు వివరిస్తాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతూ ఉండడాన్న చూపిస్తారు. వసు కాలేజీలో పేరెంట్స్, లెక్చరర్స్ మీటింగ్ జరపాలని చెప్పుకొస్తుంది. అందరు హెచ్ఓడీలు ఇందుకు ఓకే చెప్పారని.. త్వరలోనే మనం మీటింగ్ పెట్టుకోవచ్చని వేరే అతను చెబుతాడు.
ఆ తర్వాత మను రాలేడని ఒకరు అనగా.. శైలేంద్ర ఆయన ఫ్యూచర్ లో కూడా రాలేకపోవచ్చని, ఆయనకు అనేక సమస్యలు ఉన్నాయని అంటాడు. ఆయన రావాలి కదా ఎందుకు రాలేదని వేరే వాళ్లు అనగా.. ఫణీంద్ర కదా.. మరి నువ్వెళ్లి తీసుకురాపో అని చెబుతాడు. లాస్ట్ మీటింగ్ లో గాజు గ్లాస్ పగిలి తనకు గాయం అయింది కదా ఇప్పుడు నువ్వెళ్లి అతడిని తీసుకురా అంటూ ఫణీంద్ర శైలేంద్రకు వివరిస్తాడు. అతడు మాత్రం బిక్కమొహం వేసుకుని చూస్తాడు.



Click it and Unblock the Notifications











