Guppedantha Manasu April 8th: తండ్రిని తిడుతున్న మను.. అంతుచూస్తానంటూ హెచ్చరిక.. వసు ఏం చేయనుంది?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మను విశ్వనాథంను తాతా అని పిలవనని అంటాడు. తనే నన్ను అమ్మా అని పిలవనివ్వట్లేదని.. మరి మిమ్మల్ని తాత అని ఎలా పిలుస్తాను, మీకెలా దగ్గరవుతానని అంటాడు. ఆ తర్వాత ఏంజెల్ మాట్లాడుతూ.. మీ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని.. గొడవ జరిగినంత మాత్రానా ఆమె నీకు తల్లికాకుండా పోదని, విశ్వం తాత కాకుండా పోడని చెబుతుంది. మను స్పందిస్తూ.. తనే లేకుండా నేను ఇంకెవరికీ దగ్గర కాలేనని, ప్రేమగా ఉండలేనని చెప్పుకొస్తాడు. ఆ తర్వాత విశ్వం స్పందిస్తూ.. మీ మధ్య సమస్య ఏంటి అదొక్కటి చెబితే చాలని అంటాడు.

సమస్యకు ఎవరో కారణమో వారి ద్వారానే మీకు ఈ విషయం తెలుస్తుందని.. చెప్పి అక్కడి నుంచి మను వెళ్లిపోతాడు. ఇదేనా మీరు చెప్పిన ముఖ్యమైన విషయం అని వసును అనగానే.. ఏంజెల్ వసుకు సారీ చెబుతుంది. ఆ తర్వాత వసు త్వరలోనే మీరంతా కలిసిపోతారు, టెన్షన్ పడొద్దు.. అన్ని కష్టాలు తీరిపోతాయని వివరిస్తుంది. ఇక ఆ తర్వాత మను తన తాతను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే వసు కాఫీ పట్టుకుని వచ్చి.. సారీ చెబుతుంది. మీ మనసు అర్థం చేసుకున్నానని.. ఈ వయసులో విశ్వనాథం గారికి కావాల్సినవి కేవలం జ్ఞాపకాలు మాత్రమేనని అంటుంది. ఆయన కోసమే నేను మిమ్మల్ని తీసుకెళ్లానని వసు చెప్పగానే.. నేను ఎవరికీ దగ్గర కావాలనుకోవట్లేదు.. ఒక్క అమ్మ ప్రేమకు తప్ప అంటాడు.

Manu Fires on His Grand Father Vishwanatham on Guppedantha Manasu April 8th 2024 Episode 1042

ఆ తర్వాత అక్కడకు మహేంద్ర వస్తాడు... మను మాత్ర తాను అమ్మా ప్రేమ కావాలని అంటూనే ఉంటాడు. ఆ కర్మ కొద్దీ ఈ బాధ అనుభవిస్తున్నాననో కూడా తెలియట్లేదని.. నాతోనేనే యుద్ధం చేస్తూ, నాతోనేనే నరకం చూస్తున్నానని అంటాడు. ఆ తర్వాత తన తండ్రి ఎవరో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నానని... అదే అదునుగా భావించి అంతా నన్ను హింసిస్తున్నారని, తన తల్లిని వేలెత్తి చూపిస్తున్నారని అంటాడు. అప్పుడు వసు మాట్లాడుతూ... మీ బాధ తెలుసుకున్నాం కాబట్టే ఆమెను గట్టిగా మీ తండ్రి గురించి నిలదీశామని, కానీ ఆమె మాత్రం నిజం బయట పెట్టట్లేదని వివరిస్తుంది. మీకు సమాధానం దొరికితే చాలు కానీ.. ఆ సమాధానమే నా ఊపిరి, నా జీవితం అంటూ చెప్పుకొస్తాడు.

ఊపిరి ఉన్నంత వరకు దీని కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కానీ నా గురించి అమ్మ బాధ పడకూడదని మను అంటాడు. నా వల్ల తను బాధ పడుతుంటే చూడలేకపోతున్నానని.. ఇదంతా అతడి వల్లే, తన వల్లే, నా తండ్రి వల్లే ఇదంతా జరుగుతుందని ఫైర్ అవుతాడు. నా తల్లి ఏ తప్పు చేసిందని.. ఎవరెవరి ముందే అవమాన పడాలని, ఇన్నేళ్లుగా మేము ఇన్ని సమస్యలు ఎదుర్కుంటున్నామంటే కారణం అతడేనని అంటాడు. అతడిని నేను వదిలిపెట్టను, ఈ లోకంలో అతడు ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని తీరుతానని.. తన తల్లి ముందు నిలబెట్టి మరీ నిలదీస్తానని శపథం చేస్తాడు. మా బాధకు అతడు సమాధానం చెప్పి తీరాల్సిందేనని అంటాడు.

Manu Fires on His Grand Father Vishwanatham on Guppedantha Manasu April 8th 2024 Episode 1042

అప్పటి వరకు అక్కడే ఉండి ఇదంతా చూసిన మహేంద్ర ఆ తర్వాత హాల్లోకి వెళ్తాడు. అనుపమను చూసి పిలుస్తాడు. మందులు వేస్కున్నావా, లెటర్లు రాస్తూ, బట్టలు సర్దుతున్నావా అంటూ అడుగుతాడు. నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండాలని.. అందుకే కదా ఇక్కడకు తీసుకు వచ్చిందని వివరిస్తాడు. ముందు నేను, ఆ తర్వాత వసుధార, ఇప్పుడు నువ్వు సమస్యలతో బాధ పడుతున్నామని అంటాడు. మీ సమస్యలు అన్నీ తీరిపోయి త్వరలోనే హ్యాపీగా ఉంటారని అనగా.. లేదు వసు నా సమస్య తీరేది కాదంటూ చెప్పుకొస్తుంది. అందుకేగా నీ సమస్యలు ఎమున్నాయో అని అడిగేది అంటూ మహేంద్ర అంటాడు. నువ్వు, మను ఇప్పుడెలా ఉంటున్నారో.. ఒకప్పుడు జగతి, రిషిలు కూడా ఇలాగే ఉండేవారని చెప్పాడు.

వారిద్దరికీ కూడా కోపం, అధికారం, ప్రేమ.. ఇలా ఒకరిపై ఒకరికి ఉండేదని.. కానీ చివరకు కలిసిపోయారని మహేంద్ర చెప్పుకొస్తాడు. మీరు కూడా అలాగే త్వరలోనే కలిసిపోతారని అనుపమకు వివరిస్తాడు. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతూ ఉండడాన్న చూపిస్తారు. వసు కాలేజీలో పేరెంట్స్, లెక్చరర్స్ మీటింగ్ జరపాలని చెప్పుకొస్తుంది. అందరు హెచ్ఓడీలు ఇందుకు ఓకే చెప్పారని.. త్వరలోనే మనం మీటింగ్ పెట్టుకోవచ్చని వేరే అతను చెబుతాడు. ఆ తర్వాత మను రాలేడని ఒకరు అనగా.. శైలేంద్ర ఆయన ఫ్యూచర్ లో కూడా రాలేకపోవచ్చని, ఆయనకు అనేక సమస్యలు ఉన్నాయని అంటాడు.

ఆయన రావాలి కదా ఎందుకు రాలేదని వేరే వాళ్లు అనగా.. ఫణీంద్ర కదా.. మరి నువ్వెళ్లి తీసుకురాపో అని చెబుతాడు. లాస్ట్ మీటింగ్ లో గాజు గ్లాస్ పగిలి తనకు గాయం అయింది కదా ఇప్పుడు నువ్వెళ్లి అతడిని తీసుకురా అంటూ ఫణీంద్ర శైలేంద్రకు వివరిస్తాడు. అతడు మాత్రం బిక్కమొహం వేసుకుని చూస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X