Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర, దేవయానిలను చూపిస్తారు. శైలేంద్ర ఆపరేషన్ డీఆర్ఎస్ లో ఆర్ అంటే రాజీవ్ అవసరం లేదని అంటాడు. మనును నేరుగా నేనే దెబ్బ కొడతానంటాడు. ఎలా సాధ్యమవుతుందంటూ దేవయాని అనగా.. మనుకి కాల్ చేసి చెప్పినట్లు, అతడికి ఈ విషయం కూడా తెలియదంటాడు. మహేంద్ర వర్సెస్ మను ఫైట్ జరిగి.. మను ఇక్కడి నుంచి వెళ్లిపోతాడని అంటాడు. ఇదే జరిగితే తాము చాలా సంతఓషంగా ఉండొచ్చని దేవయాని అంటుంది. ఆ తర్వాత శైలేంద్ర మన నిజంగానే మహేంద్ర కొడుకని చెబుతాడు. మహేంద్రలో మ.. అనుపమ లో ను కలిపి అతడికి పేరు పెట్టారని అంటాడు.
ఇదంతా నిజమేనని తల్లితో వాదిస్తాడు. మను మహేంద్ర కొడుకే అని చెప్పుకొస్తాడు. అయితే ఈ విషయం నువ్వు నీ తండ్రికి చెప్పకూడదని దేవయాని అంటుంది. ఇది నిజం అయినా అబద్ధం అయినా మనకే నష్టం అని చెబుతుంది. నాక్కూడా అనుమానంగానే ఉందని దేవయాని వివరిస్తుంది. ఇక ఆ తర్వాత మనును చూపిస్తారు. మహేంద్ర ఇంటి ముందు అతడు నిలబడి ఉండగా.. అనుపమ కూడా అక్కడే ఉంటుంది. అయితే అప్పుడే వసు, మహేంద్రలు ఇంటికి రాగా.. మను అసలేం చేస్తున్నారు సార్ అంటూ మహేంద్రను నిలదీస్తాడు. నా అనుమతి లేకుడా నన్ను దత్తత తీసుకోవడం ఏంటని అంటాడు. అందరికీ మంచి జరుగుతుందని ఇలా చేశానని మహేంద్ర అనగా.. మను మాత్రం నాకు అస్సలే మంచి జరగదు అంటూ కోప్పడతాడు.

మీరు మళ్లీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వదులుకోవాలని అంటూనే వసుపై కూడా పైర్ అవుతాడు. మీరు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారేంటి అనగా.. వసు ఇది మామయ్య నిర్ణయం అంటుంది. ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో దత్తత కార్యక్రమం ఉంటుందని ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెబుతాడు. మను మాత్రం ఇది కుదరదని చెబుతున్నా.. ముహూర్తం చూసి, అందరి మధ్య ఈ దత్తత స్వీకారం జరుగుతుందని మహేంద్ర చెప్పగా.. మను మాత్రం ఇక్కడ ఎవరికీ ఇది నచ్చలేదని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర.. నిన్ను నేను ముందు నుంచీ కొడుకుగానే చూస్తున్నానని.. అందుకే రిషి కంకణం కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత తండ్రి లేకుండా ఉండడం కంటే కూడా ఇతడే నా తండ్రి అని చెప్పుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని మహేంద్ర అనగా.. మను ఫైర్ అవుతాడు. అసలేం మాట్లాడుతున్నారు అంటూ గట్టిగా అరవగా.. వసు కోపం తగ్గించుకోమని చెబుతుంది. అయినా వినకుండా గట్టిగా ఫైర్ అవుతాడు. మీరెవరు, ఏ హక్కుతో నన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నారని అంటాడు. అప్పుడే మహేంద్ర మరి కాలేజీకి 50 కోట్లు ఇచ్చి ఎందుకు కాపాడావు, వసు పుట్టిన రోజు ఎందుకు చేశావని, ఏ హక్కు ఉందని ఇలా చేశావంటూ మహేంద్ర అడుగుతాడు. మీరేం చేసినా నేను దత్తత కార్యక్రమానికి రానని అంటాడు. కానీ మహేంద్ర మాత్రం నువ్వు వస్తావు, ఆరోజు దత్తత జరుగుతుందని చెబుతాడు.
లేదంటే ఇకపై నువ్వు నన్ను జీవితంలో చూడలేవని, ఇక ఎప్పటికీ చూడలేవని బెదిరిస్తాడు. మను మీకేమైనా పిచ్చా అని అడగ్గా.. అవును పిచ్చోడినే కావాలంటే వసును అడుగు అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత మహేంద్ర విశ్వనాథంకు ఫోన్ చేసి ఆరోగ్యం బాగుందా, బీపీ టాబ్లెట్ దగ్గర పెట్టుకోండని అంటాడు. ఎందకంటూ అడగ్గా.. మీ మనవడు మను తండ్రి ఎవరో తెలయదని, అందుకే అనుపమ మను గొడవ పడుతున్నారని చెబుతాడు. ఇదే విషయమై మను పరువు పోయే పరిస్థితి వచ్చిందని.. అందుకే తాను మనును దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. ఆల్రెడీ నేను ఫిక్స అయ్యాను, అనుపమ, మను, మా అన్నయ్య వాళ్లందరితో చెప్పానని వివరిస్తాడు. మీరు కూడా రావాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
ఆ తర్వాత ఏంజెల్ రాగా.. విశ్వం మను దత్తత గురించి చెబుతాడు. ఏం జరగబోతుందో అని వారిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అనుపమ పెద్దమ్మ ఆమెకు ఫోన్ చేస్తుంది. మహేంద్ర మనును దత్తత తీసుకోబోతున్నాడా అని అనగా... అవునని చెబుతుంది. నీవు నోరు తెరిచి ఒక్క మాట చెబితే నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయని.. ఇంకెంత కాలం ఈ నిందలు మోస్తావంటూ అడుగుతుంది. ఇక వేచి చూడొద్దంటూ వివరిస్తుంది. త్వరగా నిర్ణయం తీసుకోమని చెబుతుంది. ఆ తర్వాత మను ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత అనుపమ పెద్దమ్మ అతిడితో మాట్లాడుతుంది. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











