Guppedantha Manasu May 21st: శైలేంద్ర ఆశలపై నీళ్లు.. బోర్డు మీటింగ్‌లో పోయిన పరువు.. ఫణీంద్ర చీవాట్లు!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర మనుకు ఫోన్ చేస్తాడు. వెంటనే శైలేంద్ర మన డీల్ గుర్తుందా అనగా.. మను అవునంటాడు. మీరు ఎక్కడ ఉన్నారని అనగా.. మహేంద్ర గారి ఇంట్లో అని.. ఎందుకెళ్లావు మీ అమ్మను చూడడానికి అంటే అవునంటాడు. వసు, మహేంద్రలతో మాట్లాడొద్దని వెంటనే తన ఇంటికి వెళ్లిపోమని అంటాడు. ఈరోజు అసలు వాళ్లను కాంటాక్ట్ అవ్వొద్దంటూ చెప్పుకొస్తాడు. కానీ మను మాత్రం ఎందుకు అంటూ అడుగుతూనే ఉంటాడు. సరే రేపు మనం కాలేజీలో కలుసుకుందాం అంటూ మను ఫోన్ కట్ చేయగా.. నేనెందుకు భయపడాలి చెప్పిన ప్రకారం నేను మనును బయటకు తీసుకు వచ్చాను కదా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత మహేంద్ర, వసులను చూపిస్తారు.

ఏంటి మామయ్యా ఈరోజు తొందరగా కాలేజీకి రెడీ అయ్యారు, ఇప్పుడే వెళ్దామంటున్నారని అంటుంది వసు. శైలేంద్ర ఎండీ కాబోతున్నాడని తెగ సంబురపడిపోతూ ఉంటాడని అనుకుంటారు. ఎండీ పదవి కోసం మనపై ఎన్నో పగలు, కుట్రలు చేశారని మహేంద్ర అంటాడు. ఏమీ తెలియకపోయినా పదవిపై వాడికి ఎందుకంత పిచ్చో అనగా... మనం ఈరోజు ఇచ్చే షాక్ సాంపుల్ మాత్రమేనని అంటాడు. ముందు ముందు మరిన్ని చూపించాలంటూ చెప్పుకొస్తాడు. జగతి చావుకు కారణం అయ్యాడు వాడంటూ ఫైర్ అవుతాడు. శైలేంద్రను పూర్తిగా కాలేజీకి దూరం చేయాలని.. దానికి కాస్త సమయం పడుతుందని అంటుంది. అలా వారిద్దరూ కాలేజీకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మనం ఫణీంద్ర సార్ కు తెలియకుండా ఇంత నడిపించామంటే ఎంతగా బాధ పడతారో ఏమోనని వసు అనగా.. నేను చెబితే వింటాడని మహేంద్ర చెబుతాడు.

Manu Give Big Shock to Shailendra on Guppedantha Manasu May 21st 2024Episode 1080

ఆ తర్వాత మను కాలేజీలో పని చేసుకుంటూ ఉండగా.. శైలేంద్ర వస్తాడు. నువ్వేమైనా మనసు మార్చుకున్నావా అని అంటాడు. వసుధార వాళ్లు మిమ్మల్ని బాగా తిట్టారని.. నేనే ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడానని అంటాడు శైలేంద్ర. మను మాత్రం నాకు ఎవరెవరు ఏమేం చేశారో తెలుసని అంటాడు. అప్పుడే వసుధార అక్కడకు వస్తుంది. ఏంటి వసుధార కాబోయే ఎండీ ఇక్కడ ఉండగా... కనీసం అడిగి రావాలని కూడా తెలీదా అంటే.. నేనే ఇప్పుడు ఎండీనని చెబుతుంది. నేనే ఎండీ అని మీరు అనౌన్స్ చేస్తారా.. నేనే అనౌన్స్ చేసుకోవాలా అంటూ అడుగుతాడు. అలాగే ఓ పెన్ తీసి వసు నీ రెసిగ్నేషన్ మీద ఈ పెన్ తోనే నువ్వు సంతకం పెట్టాలని.. నేను కూడా ఎండీగా తొలి సంతకం ఈ పెన్నుతోనే పెడుతున్నానని అంటాడు.

ఇక ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి బోర్డు మీటింగ్ ఉంది రమ్మని చెబుతాడు. ఎండీ వస్తున్నారని అందరికీ చెప్పు అనగా.. సరేనంటాడు. ఎండీ మేడమ్, మీరు, మను సార్ వస్తున్నారని చెబుతానంటాడు. దీంతో శైలేంద్ర మొహం మాడిపోతుంది. ఇక ఆ తర్వాత శైలేంద్ర తల్లి దేవయానికి ఫోన్ చేసి మాట్లాడతాడు. తనకు మంచి జరగబోతుందని.. చాలా సంతోషంగా ఉందంటాడు. నేను పంచభక్ష పరమాన్నాలు తినాలనుకుంటున్నానని.. వంటలు చేసి పెట్టమని అంటాడు. దేవయాని మాత్రం నువ్వేమైనా ఎండీ కాబోతున్నావా అనగా.. తెగ సంబురపడిపోతూనే ఫోన్ కట్ చేస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత బోర్డు మీటింగ్ కు వస్తాడు శైలేంద్ర. అప్పటికే అందరూ అక్కడ ఉంటారు.

Manu Give Big Shock to Shailendra on Guppedantha Manasu May 21st 2024Episode 1080

వసు ఎండీ పదవిలో ఉండడం చూసి షాక్ అవుతాడు. కానీ వెంటనే వసు మను సార్ ఓ కేసులో ఇరుక్కోవడం, ఆయన చంపాడనుకున్న రాజీవ్ బతికే ఉండడం వల్ల మనకు మంచి జరగిందని అంటారు. అయితే ఓ నోటీసు వచ్చిందని అందులో మను గారు 50 కోట్లు కట్టాలని పంపించారు.. కానీ ఇప్పుడు ఆయన దాన్ని మాఫీ చేస్తున్నారని చెబుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవేనని అందరికీ చూపిస్తుంది. ఈ నోటీసులు రాగానే దాని వెనుక ఏదో మత్లబ్ ఉందని అనిపించిందని.. ఆ నేరం చేశావని కూడా నేను నమ్మలేదంటూ ఫణీంద్ర చెప్పుకొస్తాడు. అప్పుడే శైలేంద్ర అసలు విషయం చెప్పకుండా ఇలా చేస్తున్నారేంటని ప్రశ్నిస్తాడు. బాబాయ్ ఏంటిది అనగా.. నేను ఊరికే వచ్చాను.. నాకేం తెలియదని అంటాడు.

అప్పుడే మను.. మీరు ఆగండి శైలేంద్ర.. నేను మాట్లాడతానంటూ నోరూ మూయించి.. నాకు పదవుల మీద ఎలాంటి ఆశ, వ్యామోహం లేదని చెబుతాడు. ఆ తర్వాత మీటింగ్ ఓవర్ అనగా.. ఏయ్ వసుధార మీటింగ్ అయిపోవడం ఏంటని ప్రశ్నిస్తాడు. నన్ను ఎండీగా అనౌన్స్ చేయాలిగా అంటాడు. అప్పుడే ఫణీంద్ర... ఏంట్రా, నిన్ను ఎండీ చేయడం ఏంటని అడుగుతాడు. నీకు పిచ్చి పట్టిందని.. భోజనం చేసేటప్పుడు, ధరణి వద్ద పిచ్చిగా వ్యవహరించావని, ఇప్పుడేమో ఎండీ పదవి కావాలంటూ గొడవ చేస్తున్నావంటాడు. అప్పుడు శైలేంద్ర.. డాడీ నీకేం తెలీదు నేను మాట్లాడి వస్తాను నువ్వెళ్లు అనగా.. నీ చావు నువ్వు చావంటూ వెళ్లిపోతాడు ఫణీంద్ర. అయితే శైలేంద్ర మనుపై ఫైర్ అవుతాడు.

Manu Give Big Shock to Shailendra on Guppedantha Manasu May 21st 2024Episode 1080

ముందు వాళ్లు సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్లను చూపించి అడగ్గా.. మను వాటిని చింపేస్తాడు. గాల్లోకి విసరగా.. శైలేంద్ర నన్నే మోసం చేస్తున్నావా అంటూ అడుగుతాడు. నువ్వు మోసాల గురించి మాట్లాడడం ఏంటని మను చెప్పుకొస్తాడు. నీ గురించి తెలుసు కాబట్టి మా జాగ్రత్తలో మేమున్నామని చెబుతాడు. నువ్వు, రాజీవ్ కావాలనే నన్ను కేసులో ఇరికించారని.. అందుకే మేమిలా ప్లాన్ చేశామంటాడు. మీ ఇద్దరూ ఎండీ పదవి వద్దు అనుకోవడం గురించి చాలా డిస్కస్ చేశారు కదా అంటాడు. అది నీకెలా తెలుసు అనగా.. మహేంద్ర తన చేతిలో ఉన్న మైక్రోఫన్ తీసి చూపిస్తాడు. దీన్ని కనెక్ట్ చేసుకున్న వాళ్లకు మనం మాట్లాడుకునేదంతా వినిపిస్తుంది కదా అనగా.. దీన్ని ఏ వెధవ పెట్టాడు అంటాడు.

నువ్వు పెట్టినప్పుడే తెలిసిపోయిందని.. నువ్వు మమ్మల్ని అంత సామాన్యంగా నమ్మవని మాకు తెలుసు.. అందుకే నీ ప్లాన్ ను నీకే తిప్పికొట్టామని అంటాడు. అసలు మను ఈ కాలేజీ అప్పే తీర్చలేదు మీకు ఆ విషయం తెలుసా అంటూ శైలేంద్ర అడుగుతాడు. తెలుసని.. మహేంద్ర చెప్పగా.. వసు నవ్వుతుంది. దీంతో శైలేంద్ర మొహం అంతా మాడిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X