Guppedantha Manasu May 31st: శైలేంద్రను చంపబోయిన రాజీవ్.. కాపాడుకున్న దేవయాని.. డీఆర్ఎస్ మరో కొత్త ప్లాన్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసుకు ఎవరో స్ప్రే కొట్టగానే తాను కళ్లు తిరిగి పడిపోయానని.. ఆ తర్వాత ఏమైందో తనకు గుర్తు లేదని.. మహేంద్ర, మను, ఏంజెల్ కు చెబుతుంది. అప్పుడే మనుకు మెసేజ్ పెట్టి తాను అక్కడకు రాగానే డోర్ లాక్ చేసినట్లు వివరించారు. ఇలా ఎందుకు చేశారని వసు అనగా.. మీ ఇద్దరిపై రూమర్స్ క్రియేట్ చేయడానికే ఇలా చేశారంటూ చెప్పుకొస్తుంది. అయితే అసలు ఈ విషయం నీకెలా తెలిసందని ఏంజెల్ ని అడగ్గా.. తాను అటువైపు నుంచి వెళ్తుండగా.. తనకు ఎవరో డోర్ కొడుతున్న చప్పుడు వినిపించిందని తెలిపింది. అలా వెళ్లి చూసేసరికి వసు, మనులు ఉండగా.. తానే వాళ్లను బయటకు పంపించి ఏంజెల్ లోపల ఉన్నట్లు వివరించింది. వసు అందుకు థాంక్స్ చెప్పింది.
మను కూడా ఏంజెల్ కు థాంక్స్ చెబుతాడు. ఏదో ఒక మంచి పని చేస్తే తప్ప నాకు థాంక్స్ చెప్పవుగా.. నీ దగ్గర ఇంకా మంచి మార్కులు కొట్టేస్తానంటూ ఏంజెల్ చెబుతుంది. అప్పుడే మను నవ్వగా.. వామ్మో మా బావ నవ్వుతున్నాడంటూ వివరిస్తుంది. దీంతో అంతా హాయిగా నవ్వుకుంటారు. ఆ తర్వాత వసుధారను చూపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. రాజీవ్ మిస్ అయ్యాడని చెబుతారు. అప్పుడే మహేంద్ర రాగా.. వసు అసలు విషయం చెప్పేస్తుంది. రాజీవ్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడట అని చెప్పుకొస్తుంది. వాడు ఎస్కేప్ అయితే మనకు ఎందుకు ఫోన్ చేశారని అనగా.. జాగ్రత్తగా ఉండమని చెప్పారంటూ మహేంద్ర అంటాడు. వాడికి భయపడాల్సిన అవసరం లేదని, వాడికి అంత సీన్ లేదంటూ చెప్పుకొస్తాడు. కానీ వసు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అంటుంది.

కానీ వసు మాత్రం భయపడుతూ కనిపిస్తుంది. మహేంద్ర మాత్రం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆ రాజీవ్ గాడు, శైలేంద్రగాడు కామెడీ పీస్ లు అని చెబుతాడు. పెళ్లి ధ్యాసలో పడి వాడిని ఎవరు మోసం చేస్తున్నారో కూడా గ్రహించలేకపోయాడంటూ వివరిస్తాడు. ఇదంతా చాటు నుంచి విన్న రాజీవ్ శైలేంద్రే తనను పట్టించినట్లు తెలుసుకుంటాడు. అలా వెంటనే అతడి ఇంటికి వెళ్తాడు. అయితే అప్పటికే నిద్రలో శైలేంద్ర తెగ భయపడిపోతూ.. నన్ను చంపొద్దు బ్రదర్, నన్ను చంపొద్దు బ్రదర్ అంటూ అంటాడు. కానీ నిజంగానే వచ్చిన రాజీవ్ అతడి పీక పట్టుకుంటాడు. ఏమైంది ఇలా చేస్తున్నావని అనగా.. నువ్వే నన్ను పోలీసులకు పట్టించావని అంటాడు. నేను వాళ్లకు ఎందుకు సాయం చేస్తానని అనగా.. ఎండీ సీట్ కోసం అంటూ రాజీవ్ చెబుతాడు.
దీంతో శైలేంద్ర సైలెంట్ కాగా.. రాజీవ్ కోప్పడతాడు. ఎండీ సీటు పిచ్చితో వాళ్లు నిన్ను ఆడుకుంటే.. వసు పిచ్చితో ఉన్న నన్ను పోలీసులకు పట్టించావు కదా అంటూ ఫైర్ అవుతాడు. నాకెలా మోసం చేయాలనిపించిందని అడుగుతాడు. నువ్వు వసుధారను నాకు అప్పగిస్తాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందని.. అందుకే మధ్యలోనే నిన్ను బయటకు తీసుకెళ్లానని చెబుతాడు. కానీ వసు పెట్టుకున్న చిన్న జీపీఎస్ ట్రాకర్ వల్ల నేను దొరికిపోయానని చెప్పుకొచ్చాడు. మనకు ఐకమత్యం లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని రాజీవ్ అనగా.. ఇక మీద నుంచి కలిసికట్టుగా ఉందామని శైలేంద్ర చెబుతాడు. కానీ రాజీవ్ మాత్రం నీలాంటి ద్రోహితో నేను కలిసి ఉండలేనంటూ వివరిస్తాడు. చంపేస్తానంటూ గన్ తీసి శైలేంద్రకు గురి పెడతాడు. ఇక నుంచి కలిసి ప్లాన్ చేద్దామని, వద్దు వదిలేయమంటూ శైలేంద్ర అనగా.. ముందే చెప్పానుగా నన్ను మోసం చేసినవాడిని చంపేస్తానని అంటాడు.

అయితే వేరే ఎవరైనా ఇలా చేసుంటే నరకం చూపించి చంపేవాడిని కానీ.. నువ్వు కాబట్టి సింగిల్ బుల్లెట్ తో చంపేస్తానంటాడు. శైలేంద్ర మాత్రం వద్దు వద్దంటూ కాళ్లు పట్టుకుంటాడు. అప్పుడే దేవయాని వస్తుంది. రాజీవ్ ఏం చేస్తున్నావంటూ అడుగుతుంది. చూశారా మీ కొడుకు ఏం చేశారో.. శత్రువుల పంచన చేరి నన్నే జైలుకు పంపాడని అంటాడు. కానీ శైలేంద్ర సారీ చెప్పగా.. దేవయాని మాత్రం తాను చేసిన తప్పు గురించి చెప్పాడని అంటుంది. నేను వార్నింగ్ ఇచ్చానని.. ఇక మీద నుంచి వాడు అలా చేయడని అంటుంది. వాడిని చంపేస్తే నీకేం ఉపయోగం ఉండదని.. వాళ్లు ప్లాన్ చేసి ఇలా చేశారు, మనును బయటకు తీసుకెళ్లారని చెబుతుంది.

వారిని ఏదైనా చేయాలి కానీ మీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకుని చావడం ఎందుకు అంటుంది. కలిసికట్టుగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం అని నువ్వే అన్నావుగా.. మీరిద్దరూ కలిసి వాళ్లను దెబ్బ కొట్టండి అని అంటుంది. మీ ఇద్దరి వీక్ నెస్ ల వల్లే ఇలా జరిగిందని.. శత్రువుల వీక్ నెస్ తెలుసుకుని దెబ్బ కొట్టాలని వివరిస్తుంది. నన్ను ఫాలో అయితూ ముగ్గురం కలిసి వారిని దెబ్బ కొట్టచ్చని చెబుతుంది. ఇక ఆ తర్వాత దేవయాని మహేంద్ర ఇంటికి వస్తుంది. అప్పుడే అనుపమ మహేంద్రకు కాఫీ తెస్తుంది. ధరణి కూడా ఆమె వెంట ఉండడం చూసి ఫణీంద్ర కోసం చూస్తాడు.
ఆయన రాలేరని.. మేమిద్దరమే వచ్చామని అంటుంది. ఏం పని మీద వచ్చారని అనగా.. నా కొడుకు, కోడలికి పెళ్లి జరిగి సంవత్సరాలు జరిగినా.. వాళ్లకు పిల్లలు కలగడం లేదని అందుకే చిన్న వ్రతం చేయించాలనుకుంటున్నానని చెబుతుంది. మీరంతా కలిసి వచ్చేయండని.. ఈరోజు సాయంత్రమే మంచి ముహూర్తం ఉందని దేవయాని చెబుతుంది. అనుపమతో పాటు వసుకు బొట్టు పెట్టి మరీ ఈ ఫంక్షన్ కు రావాలని పిలుస్తారు. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











