Guppedantha Manasu April 11th: మను, భార్య ధరణి కాళ్లపై పడ్డ శైలేంద్ర.. వసు వార్నింగ్‌తో రచ్చ రచ్చే!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర.. మను వద్దకు వెళ్తాడు. మీరు రావాలి, మీరు రాకపోతే చాలా సమస్యలు వస్తాయని అంటాడు. మీరు వచ్చి కాలేజీ కాపాడడం వల్లే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నా.. మీరు ఇప్పుడు రాకపోతే చాలా సమసస్యలు వస్తాయని అంటాడు. మీ తల్లితండ్రులు గురించి నేను అడగను అని శైలేంద్ర చెప్పగా... మను మాత్రం నేను రానంటాడు. మొన్న నీవే కదా వద్దంది అంటూ వివరిస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర మను కాళ్లు పట్టుకుంటాడు. మిమ్మల్ని ఏమీ అనను అంటూ వివరిస్తాడు. కానీ కళలో తన భార్య ధరణినే.. మను అనుకుని అలా చేస్తాడు. దీంతో ధరణి అతడిని పిలవగా... కళ కన్నట్లు గుర్తిస్తాడు.
నన్నెందుకు కాలేజీకి రమ్మంటున్నావని భార్య అనగా.. నిన్ను కాదని చెబుతాడు. మరెవరినని అడగ్గా.. నువ్వు నా భార్యవు కదా.. నీలో నేను సగ భాగం కదా అందుకే నీ కాళ్లు పట్టుకున్నాను అంటూ చెప్పుకొస్తాడు. మీరు చాలా గ్రేట్ అండి మొన్న వసు పుట్టిన రోజు చేశారు, ఇప్పుడు నాకు ఇంతలా గౌరవం ఇస్తున్నారని అంటుంది. ఆ తర్వాత ధరణి వెళ్లిపోగా.. శైలేంద్ర మనుకు కాల్ చేస్తాడు. అతడు మొదటి సారి చేయగా... రెండోసారి మళ్లీ ఫోన్ చేస్తాడు. విషయం ఏంటో చెప్పు సోది చెప్పకు అంటూ మను అనగా.. కాలేజీకి రమ్మని శైలేంద్ర చెబుతాడు. పైన చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతూ పదే పదే బతిమాలుతాడు. నువ్వెందుకు ఇంతలా రమ్మంటున్నావనగా.. మా నాన్న నా తాట తీస్తాడని మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత కాళ్లు కూడా పట్టుకుంటానని అడగా.. ఆతడు మాత్రం మధ్యలోనే ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే మళ్లీ ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదని మెసేజ్ చేస్తాడు. అది చూసిన శైలేంద్ర మళ్లీ ఫోన్ చేసేందుకు భయపడతాడు. ఇక ఆ తర్వాత వసు అనుపమ, మహేంద్రలకు కాఫీ తీసుకు వచ్చి ఇస్తుంది. అంతలోనే అక్కడకు విశ్వం, ఏంజెల్ వస్తారు. రాగానే అనుపమ బాగోగులు అడిగి తెలుసుకుంటాడు విశ్వం. అనుపమపై అటాక్ చేసిందో ఎవరో తెలుసుకుంటున్నారా.. త్వరలోనే తెలుసుకోమని చెబుతాడు. ఆ తర్వాత అనుపమను ఇంటికి వచ్చేయమని అడగ్గా.. తనకు ఇక్కడే సంతోషంగా ఉందని అంటాడు.
మరి తాను ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోవాలనుకుందని విశ్వం అనగా.. మను, అనుపమ మధ్య గొడవలు జరిగాయి కదా ఎందుకని అడిగినందుకు తానలా చేసిందని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత నువ్వు కూడా అడుగు డ్యాడీ అనగానే.. నేను నిన్ను చూసేందుకు మాత్రమే వచ్చాను.. అవన్నీ నేను అడగను అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత వెళ్లొస్తామని అనగానే.. నీవు మళ్లీ మను వద్దకు వెళ్లకు అని అనుపమ చెబుతుంది. అతను మాత్రం అది నా చేతిలో లేదని, దేవుడు దయ తలిస్తే ఏదైనా జరుగుతుండొచ్చు అని వివరిస్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా.. నీ నాన్న నీకు తోడు ఉంటాడనే మాటను మాత్రం గుర్తు పెట్టుకో అనుపమ అంటూ చెప్పి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత మళ్లీ శైలేంద్రను చూపించగా.. మనుకు కాల్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. అంతలోనే వసు ఫోన్ చేస్తుంది. ఏంటని శైలేంద్ర అడగ్గా.. ఎక్కడున్నారని అంటుంది. గేట్ దగ్గర అనగానే ఓ సెక్యూరిటీ గార్డ్ పని రిహార్సల్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించగా.. ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు. త్వరగా నా క్యాబిన్ కు రమ్మని చెప్పగా.. ఆర్డర్ హా రిక్వెస్ట్ హా అని అడుగుతాడు. ఆర్డర్ అని వసు అనగానే ఫైర్ అవ్వబోతాడు. కానీ వసు కాల్ కట్ చేయగా.. వెంటనే క్యాబిన్ కు వస్తాడు. తలుపు కొట్టి రాలేదని మళ్లీ తలుపు కొట్టి పర్మిషన్ తీసుకుని రావాలని వసు చెబుతుంది. అలాగే చేస్తాడు శైలేంద్ర. మీకు చెప్పిన పని ఏమైందని అడగ్గా.. నాకు తెలీదంటాడు.

అంతలోనే మను అక్కడకు వస్తాడు. అది చూసిన శైలేంద్ర.. వసు మను వచ్చాడు చూడు అంటూ చెప్పుకొస్తాడు. వచ్చినందుకు థాంక్స్ బ్రో అని శైలేంద్ర అనగా.. మీరు నన్ను బ్రో అని పిలవకండి అంటాడు. ఒళ్లంతా కంపరంగా ఉందని వివరించగా.. నేను వసు గారితో మాట్లాడాలి మీరు వెళ్లండి అని చెబుతాడు. దీంతో ఓకే బాగా మాట్లాడుకోండి అంటూ వెటకారంగా మాట్లాడుతూ.. అక్కడి నుంచి శైలేంద్ర వెళ్లిపోతాడు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











