Guppedantha Manasu April 26th: రాజీవ్ హత్య కేసులో మను అరెస్ట్.. ఆగిపోయిన దత్తత.. అసలు నిజం ఏంటంటే?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ధరణి.. శైలేంద్రను మీరేం ప్లాన్ చేశారని అడుగుతుంది. దత్తత కార్యక్రమానికి వస్తున్నానంటే దాని వెనకాల ఏదో ఉందని అనిపిస్తుందని చెప్పగా.. శైలేంద్ర ఏం లేదు నువ్వెళ్లి రెడీ అవ్వు అంటాడు. ఆ తర్వాత తల్లితో మాట్లాడుతూ.. దత్తత కార్యక్రమం జరగదు, మను దానికి ఒప్పుకోడని అంటాడు. నువ్వు అయితే రెడీ అవ్వు మనం వెళ్దామని చెబుతాడు. ఆ తర్వాత దత్తత కార్యక్రమానికి జరిగే పూజను చూపిస్తారు. అరేంజ్ మెంట్స్ అన్ని బాగానే జరుగుతాయి. అయితే దత్తత వచ్చే అబ్బాయిని రమ్మనండి అనగా.. ఫోన్ చేయాలని చెబుతాడు.

అప్పుడే దేవయాని నేనిలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదని చెబుతుంది. అయితే చూడు అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత వసు ఫోన్ చేస్తే మను లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత అనుపమ కూడా ఫఓన్ చేస్తుంది. అయినప్పటికీ లేపకపోతే దేవయాని అసలు అతడికి ఈ దత్తత ఇష్టమేనా అని అడుగుతుంది. అదంతా నీకెందుకు అని ఫణీంద్ర అనగా.. దేవయాని నోరు మూసుకుంటుంది. ఆ తర్వాత మను ఫోన్ రీచ్ అవ్వట్లేదని అనుపమ అనగా.. మరేం చేద్దామని అనుకుంటారు. ఇక మను వచ్చేలా లేడని అంతా సర్దేయండి దేవయాని అంటుంది. ఆమెను కంట్రోల్ చేసే పనిలోనే మహేంద్ర ఉంటాడు. కానీ అప్పుడే మను ఎంట్ర ఇస్తాడు.

Manu Murdered Rajeev on Guppedantha Manasu April 26th 2024 Episode 1060

చాలా కోపంగా కనిపిస్తూనే ఇంట్లోకి రాగా.. అంతా చూస్తుండిపోతారు. మహేంద్ర లోపల బట్టలు ఉన్నాయని చెప్పగా అక్కడకు వెళ్లి వేసుకొచ్చుకుంటాడు. ఇదంతా చూసిన దేవయాని, శైలేంద్రలు షాక్ అవుతారు. ఏంట్రా రాడు, దత్తత జరగదన్నావు ఇదంతా ఏంటని దేవయాని శైలేంద్రను అడుగుతుంది. వచ్చినా దత్తత జరగదు మమ్మీ అని శైలేంద్ర చెబుతాడు. అప్పుడే గదిలోకి వెళ్లిన మను బయటకు వస్తాడు. దీంతో అందరూ అతిడనే చూస్తారు. మను వచ్చి పూజలో కూర్చోగా పూజ జరుగుతుంది. దత్తత కార్యక్రమం పూర్తి అయింది.. పాలు పోయడానికి ఎవరైనా వస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఫణీంద్ర వచ్చి నేను పోస్తానని చెబుతాడు. అంతలోనే ఇంట్లోకి పోలీసులు వస్తారు. ఎక్స్ క్యూజ్ మీ అంటూ అపుతారు.

మను గారు యువర్ అండర్ అరెస్ట్ అని చెబుతారు. దీంతో అంతా షాక్ అవుతారు. కానిస్టేబుల్స్ మనును అరెస్ట్ చేయండని అంటారు. మనును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనగా.. రాజీవ్ ను హత్య చేసినందుకు కస్టడీలోకి తీసుకుంటున్నాం అని చెబుతారు. నేను రాజీవ్ ను హత్య చేయడం ఏంటని మను అనగా.. అది చెప్పాల్సింది నువ్వు కాదు మేము అని అంటారు పోలీసులు. ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. తను అలా చేసేవాడు కాదని అంటాడు. ప్రత్యక్ష సాక్షితోనే వచ్చామని, అతడిని హత్య చేసింది మనుయే అని అంటారు. నువ్వు రాజీవ్ వద్దకు వెళ్లావా... అనగా వెళ్లానని అంటాడు. కానీ అక్కడ జరిగిందని వేరని చెబుతాడు. అయినా వాళ్లు వినకుండా మనును అరెస్ట్ చేస్తారు.

Manu Murdered Rajeev on Guppedantha Manasu April 26th 2024 Episode 1060

మరోవైపు మహేంద్ర, ఫణీంద్రలు ఆపే ప్రయత్నం చేసినా పోలీసులు ఆగరు. అనుపమ వెంటనే వసు ఏంటి ఇలా జరిగిందంటూ బాధ పడుతుంది. అయినా మను హత్య చేయడం ఏంటని అంటుంది. ఇదంతా అబద్ధం అని చెప్పుకొస్తుంది. ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎదురు అవుతున్నాయి, నా కొడుకు రిషి కనిపించకుండా పోయాడు, మనును దత్తత తీసుకోవాలనుకుంటే ఇలా జరిగిందని అంటాడు. వెంటనే ఫణీంద్ర.. అసలు రాజీవ్ చనిపోవడం ఏంటని, అయినా అతడిని మను చంపడం ఏంటని అడుగుతాడు. ఆ తర్వాత అనుపమ నా కొడుకు ఎలాంటి తప్పు చేసుండడని, తనను కాపాడమని వివరిస్తుంది.

Manu Murdered Rajeev on Guppedantha Manasu April 26th 2024 Episode 1060

ఆ తర్వాత దేవయాని మాట్లాడుతూ.. అతడే ఈ హత్య చేసి దాన్నుంచి తప్పించుకోవడానికే ఇక్కడకు వచ్చుంటాడని అంటుంది. ఇందుకు వసుధార మాట్లాడుతూ.. అలా ఏం అయ్యుండదు.. తాను మనసు మార్చుకుని ఉండొచ్చు కదా అనగా.. మనం అలా అనుకోవాలనే ఆయన ఇలా వచ్చుంటాడని.. చేసిన తప్పులకు కచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారంటూ చెబుతుంది. అనుపమ, వసులు చాలా కోపంగా చూస్తూ కనిపిస్తారు. ఇలా సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X