Guppedantha Manasu March 11th: వసు బర్త్ డేకి మను హడావుడి.. ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాడా?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో అదిరిపోటే ట్విస్ట్ లు ఇస్తున్నారు. ముఖ్యంగా రాజీవ్ వసు, మనుల పోస్టర్లను అతికిస్తుండగా.. మను వీడియో తీస్తాడు. ఆ తర్వాత వాటి స్థానంలో మను.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే వసుధార అంటూ ఉండే పోస్టర్లను అతికిస్తాడు. ఇదే విషయాన్ని నేరుగా రాజీవ్, శైలేంద్రలకు చెప్పి వీడియో కూడా చూపిస్తాడు మను. ఇదంతా చూసిన శైలేంద్ర.. నువ్వు ఇంత సాడిస్ట్ వు ఏంట్రా అంటూ ఫైర్ అవుతాడు. రాజీవ్ అంత కష్టపడి పోస్టర్లు అతికిస్తే నువ్వు హాయిగా వీడియో తీశావా అంటూ అడుగుతాడు.

ఆ తర్వాత నీకు మా గురించి తెలియదంటూ శైలేంద్ర చెప్పగా... మీరు ఎంత దుర్మార్గులో తెలుసు.. వాడు ఎంత వెదవో తెలుసు.. కానీ మీరిద్దరూ ఒకటే అన్న విషయం మాత్రం నాకిప్పుడే తెలిసింది అంటూ మను చెప్పుకొస్తాడు. ఇక ముందు ముందు మీకు ముసళ్ల పండగే అంటూ చెప్పుకొస్తాడు. రాజీవ్.. బయ్యా నువ్వు ఎందుకు ఈ విషయంలో కల్గజేసుకుంటున్నావని అడగ్గానే.. నా పోస్టర్లు వేసి నన్ను ఎందుకు కల్గజేసుకుంటున్నావు అన్నావేంటి అని మను అంటాడు. ఈ పోస్టర్లు అందరికీ చూపించి మిమ్మల్ని బ్లేమ్ చేస్తానంటూ అనగా.. మను మాత్రం అవి నువ్వే క్రియేట్ చేయించావని చెబుతానంటూ వివరిస్తాడు.

Manu Over Action For Vasudhara Birth Day Celebrations on Guppedantha Manasu March 11th 2024 Episode 1021

ఆ తర్వాత మను.. శేలేంద్రపై ఫఐర్ అవుతాడు. తమ్ముడి భార్యను ఇలా అల్లరి చేసేందుకు సిగ్గులేదా అంటూ అడుగుతాడు. ఆ తర్వాత రాజీవ్ ను చూసి నీకు వసుధార ఏం అవుతుందని అడగ్గా.. చచ్చిపోయిన నా భార్య చెల్లెలు అని చెబుతాడు. ఎలాంటి సాయం, సపోర్ట్ లేకుండా ఇంత పైస్థాయికి వచ్చిన ఆమెకు సాయంగా ఉండకుండా.. ఇలా చేస్తావేంటంటూ తిడతాడు. అసలు నువ్వు మనిషివేనా అంటూ అడగ్గా... ఆ పోస్టర్లు అలాగే ఉంటే పరిస్థితి ఏమయ్యేదని అంటాడు. ఇందుకు రాజీవ్.. నిన్ను కొట్టి, ఇక్కడి నుంచి తరిమేసేది అంటూ చెబుతాడు. తను నన్ను దూరం పెట్టడం ఏమోకానీ.. తన పరువు మాత్రం పోయేది అంటూ చెప్పుకొస్తాడు.

నేను వసుధార కోసం ఎంతకైనా తెగిస్తానని రాజీవ్ అనగా.. నువ్వు తెగిస్తే నీ తల తెంచడానికి అయినా నేను వెనుకాడను అంటూ మను వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వీడే మన టార్గెట్ అంటూ శైలేంద్ర చెప్పుకొస్తాడు. ఇక ఆ తర్వాత అనుపమ, మహేంద్ర, వసులను చూపిస్తారు. మను చేసిన తప్పేం లేదు కదా అంటూ అడగ్గా.. తను అలా చేయడం నాకు నచ్చలేదని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర.. మనకు మను ఎంత సాయం చేస్తున్నాడని తను చాలా మంచివాడని.. తను కాలేజీ విషయంలో అండగా నిలబడ్డాడని, అలాగే నీకు భరోసా ఇస్తున్నాడని వివరిస్తాడు. నీ బర్త్ డే చేయడం వల్ల నీకొచ్చే నష్టం ఏంటని అడగ్గా... రిషి సార్ లేరు కదా.. ఆయన లేకుండా నేను ఏ సెలబ్రేషన్స్ చేసుకోనని అంటుంది.

అంటే రిషి లేడని నువ్వు కూడా నమ్ముతున్నావా అని అనగా.. వద్దు అలా అనొద్దు మామయ్యా... రిషి సార్ వచ్చేదాకా నా జీవితంలో ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దనుకుంటున్నానను అని చెప్పుకొస్తుంది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వసు వెళ్లిపోతుంది. ఏంటిది అనుపమ అనగా.. తనకు ఇష్టం లేదు అంటుంది కదా వదిలెయ్ మహేంద్ర అంటుంది. ఆ తర్వాత శైలేంద్రస ధరణిలను చూపిస్తారు. ముఖ్యంగా ధరణి... మీరు చాలా మారిపోయారు, మీరు చేసిన మంచి అత్తయ్య గారికి తెలియకపోతే ఎలా అంటూ చెబుతుంది. మీ మంచితనం గురించి అందరికీ తెబుతానంటూ తన అత్తయ్యను పిలిచి మరీ వివరిస్తుంది.

Manu Over Action For Vasudhara Birth Day Celebrations on Guppedantha Manasu March 11th 2024 Episode 1021

మీ అబ్బాయి నన్ను కాలేజీకి ఎందుకు తీసుకు వెళ్లారో తెలుసా, సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు కదా... అక్కడ వసుధార హ్యాపీ బర్త్ డే అడ్వాన్స్ అంటూ పోస్టర్లు అతికించారని అంటుంది. వాడు చెబుతాడు నువ్వు ఆగు అనగా.. ధరణి మాత్రం ఆగకుండా... వసుధార బర్త్ డే గుర్తుపెట్టుకుని పోస్టర్లు వేయించారని భర్తపై ప్రశంసల వెల్లువ కురిపిస్తుంది. ఆ తర్వాత అత్తయ్య మీరు ఆయనకు దిష్టి తీయించండి అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన తల్లి.. నువ్వేనారా ఇదంతా చేసింది అనగా.. నేనెలా చేస్తాను, రిషి చావాలని కోరుకునే నేనెలా చేస్తానంటూ అంటాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం అంతా చెబుతాడు.

ఇక ఆ తర్వాత మహేంద్ర.. మనుకు ఫోన్ చేసి వసుధార బర్త్ డే గ్రాండ్ గా చేయాలి అని చెబుతాడు. తనకు ఇష్టం లేదు కదా అని చెప్పినా వినకుండా.. గ్రాండ్ గా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా సెలబ్రేషన్స్ చేయాలని వివరిస్తాడు. ఆ తర్వాత అనుపమ వచ్చి ఇది కరెక్ట్ కాదు మహేంద్ర.. వసు ఇష్టం లేదంటున్నా ఇలా చేయడం అంటూ చెబుతుంది. ఆ తర్వాత దీనంతటికీ వసు మనుపై ఫైర్ అవుతుందని.. అందరి ముందు అవమానిస్తుందని అంటుంది. వద్దని చెప్పినా వినకుండా మహేంద్ర మాత్రం.. నేను నా కోడలు బర్త్ డే చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నానని వివరిస్తాడు.

మరోవైపు వసు తన భర్త రిషి ఫొటో చూసుకుని మరీ మాట్లాడుతూ ఉంటుంది. నేను చేసింది తప్పని ఎందుకు అనుకుంటున్నారు.. నా మనసు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.. నేను చేసిన తప్పేంటి సార్ అంటూ రిషి ఫొటోతో మాట్లాడుతూ.. బాధ పడుతూ ఉంటుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X