Guppedantha Manasu May 10th: వసుకు షాకిచ్చిన మను.. శైలేంద్రకు బంపరాఫర్.. ఇక రాజీవ్ జైలుకే!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో రాజీవ్ ఓ చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తానొకటి అనుకుంటే ఇంకోటి జరిగిందని.. తన మరదలు వసు తనను పట్టుకోవాలనుకోగా కొంచెంలో మిస్ అయ్యానంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతోలనే శైలేంద్ర ఫోన్ చేయగా.. ఇప్పుడు వీడెందుకు చేస్తున్నాడంటూనే ఫోన్ లిఫ్ట్ చేయకూడదని అనుకుంటాడు. శైలేంద్ర మాత్రం మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాడు. రాజీవ్ కట్ చేస్తుండగా.. వీడేదో ఎదవ పని చేసుంటాడని అనుకుంటూ కాలేజీకి వస్తాడు. అప్పుడే అతడి పీఏ వచ్చి శైలేంద్రకు నోటీసులు అందజేస్తాడు. 15 రోజుల్లో అతడికి 50 కోట్లు ఇవ్వకపోతే కాలేజీ తన పేరిట రాయించుకుంటాడా అంటూ ఫుల్ గా ఫైర్ అవుతాడు. అప్పుడే వసు, మహేంద్రలు అక్కడకు వస్తారు.
ఏమైంది శేలేంద్ర అనగా.. మీరే చూడండి మీకే అర్థం అవుతుందంటూ నోటీసులు ఇస్తాడు. అది చూసిన మహేంద్ర, వసులు షాక్ అవుతారు. 50 కోట్లు ఇవ్వకపోతే కాలేజీని హాండోవర్ చేసుకోవడం ఏంటంటూ అనుకుంటారు. మను ఇలా చేసుండరు, ఇంకెవరో చేసుంటారని వసు అనగా.. శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఇన్నాళ్లూ వాడేదో ధర్మప్రభువు అయినట్లు బిల్డప్ ఇచ్చారుగా... మంచి పనే చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదో గొడవ జరిగి మను ఇలా చేసుంటాడని మహేంద్ర అనగా.. ఓ పక్క నోటీసులు వచ్చాక కూడా మీరు వెనకేసుకొస్తున్నారా అంటూ శైలేంద్ర అంటాడు. తనకు శిక్ష పడితే ఆ తర్వాత ఏమీ చేయలేడనే ఇలా చేసుంటాడని శైలేంద్ర చెప్పగా.. వసు మాత్రం ఏదో జరిగే ఉంటుందని, మను ఇలా చేసుండడు అంటూ చెప్పుకొస్తుంది.

మను గురించి మీకు తెలియదని, అసలు వాడి గురించి నాకే బాగా తెలుసంటూ శైలేంద్ర అంటాడు. దీని గురించి తెలియాలంటే మనుతో మాట్లాడాలని వెళ్దాం పద అంటాడు. కానీ అంతలోనే శైలేంద్ర నేనే వెళ్తానంటూ వస్తాడు. అది చూసిన మహేంద్ర, వసులు యస్ అనుకుంటూ సంబరపడిపోతారు. అంతోలనే శైలేంద్ర పోలీస్ స్టేషన్ కు వచ్చి మనుతో మాట్లాడతాడు. ఇదేంటని అంటాడు. మీరు నాకు బాకీ ఉన్నారు కదా అంటూ మను అనగా.. ఆరోజే చెక్ చింపేశావు కదా అంటూ మను చెప్పుకొస్తాడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు అందరికీ తెలియదు కదా అంటూ మను స్వార్థపరుడిలా మాట్లాడతాడు. నేనేళ్లి నీ గురించి చెబుతానంటూ శైలేంద్ర అనగా.. అసలు లేని అప్పు సృష్టించిందే నువ్వు అని నేను కూడా చెబుతానంటూ మను అంటాడు.
శైలేంద్ర మాత్రం నీలాంటి నీచుడిని ఎక్కడా చూడలేదు అనగా.. నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు అంటూ మను చెప్పుకొస్తాడు. రాజీవ్ బతికే ఉండగా.. కావాలనే మీరు నన్ను కేసులో ఇరికించారని నాకు తెలుసంటూ వివరిస్తాడు. మీ ఇద్దరూ తోడి దొంగలని నాకు తెలుసంటూ మను అనగా... శైలేంద్ర వాడితో నాకే సంబంధం లేదని చెబుతాడు. సరే కానీ 50 కోట్లు ఇచ్చేస్తాను.. నన్ను ఈ కేసులోంచి తప్పించమని అంటాడు. దానికి నీ బోడి 50 కోట్లు ఎవరికి కావాలని అనగా.. సరే ఎండీ పదవి ఇస్తానని మను ఆశ చూపిస్తాడు. కాలేజీని నీకు అప్పజెప్పి నేను వెళ్లిపోతానంటూ చెప్పగా... శైలేంద్ర ఆసక్తిగా చూస్తాడు. నన్ను ఈ కేసు నుంచి తప్పిస్తే ఎండీ పదవిన నీకిప్పిస్తానని అంటాడు. తాను ఈ పని చేయనని శైలేంద్ర అనగా... నీ ఇష్టం మరి ఈ అద్భుతమైన ఆఫర్ ను మిస్ చేసుకుంటే నీకే మంచిది కాదని అంచాడు.

రాజీవ్ ను తీసుకు వచ్చి అతను బతికే ఉన్నాడని చూపించి నన్ను బయటకు తీసుకు వస్తే నెక్స్ట్ మినెట్ యే.. నిన్ను ఎండీని చేస్తానంటాడు. వసుధార వాళ్లు ఊరుకుంటారా అని శైలేంద్ర అనగా.. వాళ్లు నాకు డబ్బులే కట్టరు, అలాంటప్పుడు ఆ కాలేజీ నా సొంతం.. దాన్ని నీకే ఇచ్చేస్తానని వివరిస్తాడు. ఇక శైలేంద్ర బయటకు వస్తుండగా.. ఓ కానిస్టేబుల్ అతడిని ఆపుతాడు. అతడిని కలిసేందుకు చాలా మంది వస్తున్నారని చెప్పగా... తనను కలిసేందుకు ఎవరెవరు వస్తున్నారో నాకు చెబితే నీకు డబ్బులు ఇస్తానంటాడు. నేనలాంటి వాడిని కాదంటూ కానిస్టేబుల్ అనగా.. అతడి ఫోన్ తీసుకుని మరీ తన నెంబర్ అందులో సేవ్ చేస్తాడు. చేయాలనిపిస్తే నాకు ఫోన్ చేయు అంటూ వెళ్లిపోతాడు.
ఇక మహేంద్ర, వసుల వద్దకు వస్తాడు శైలేంద్ర. మను ఏమన్నాడు అని అనగానే గట్టిగా నిలదీశానని అంటాడు. చొక్కా పట్టుకుని మరీ మమ్మల్ని ఎలా మోసం చేస్తావని ప్రశ్నించానంటాడు. మరి నువ్వేదో పొడిచేస్తానని వెళ్లావు కదా అంటూ మహేంద్ర అంటాడు. వాడిలా పక్కా ప్లాన్ తో మోసం చేస్తాడని నేనెలా అనుకుంటానంటూ శైలేంద్ర అంటాడు. అంతలోనే వసు.. మను ఇలా చేయడం ఏంటని అంటుంది. తనని నమ్మి నేనెంత మోసపోయానో నాకిప్పుడే అర్థం అయిందని మహేంద్ర అనగా.. ఇదంతా మీ వల్లే జరిగిందని వసు అంటుంది. మొదటి నుంచి నేను తనని అనుమానిస్తూనే వచ్చాను.. మీరే సాయం చేశాడు మంచి వారంటూ నెత్తిన పెట్టుకున్నారని చెబుతుంది. ఇప్పుడు మనం 50 కోట్లు ఎక్కడి నుంచి తీసుకు వస్తామంటూ మహేంద్రను ప్రశ్నిస్తుంది. మహేంద్ర కూడా మనం నమ్మిన వాళ్లంతా మనల్ని ఇలా మోసం చేస్తున్నారేంటని అడుగుతాడు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











