»   » ఓ అనామకుడు ‘బిగ్ బాస్-10’ విన్నరయ్యాడు, ఎవరు అతగాడు?

ఓ అనామకుడు ‘బిగ్ బాస్-10’ విన్నరయ్యాడు, ఎవరు అతగాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కలర్స్ ఛానల్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రసారం అయ్యే రియాల్టీ షో 'బిగ్ బాస్' 10వ సీజన్లో సెలబ్రిటీలందరినీ వెనక్కి నెట్టి ఓ అనామకుడు, ఓ సామాన్యుడు విజేతగా నిలిచాడు. హర్యానాకు చెందిన మన్ వీర్ గుజ్జర్ ఈ షో విజేతగా నిలిచారు.

ఈ షోలో గెలుపొందడం మన్ వీర్ ద్వారా రూ. 80 లక్షల రూపాయలు గెలుపొందారు. తన కుమారుడు విజేతగా గెలుపొందిన విషయం ప్రకటించగానే అతడి తండ్రి సంబ్రమాశ్చర్యాలకు లోనవ్వడంతో పాటు వెంటనే అందులో సగ భాగం అంటే రూ. 40 లక్షలు సల్మాన్ ఖాన్ చారిటీ ఆర్గనైజేషన్ కు డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు.

బిగ్ బాస్ రియాల్టీ షోలో విజేత కావడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని నెలల పాటు బయటి ప్రపంచానికి దూరంగా బిగ్ బాస్ హౌస్ లో గడిపే క్రమంలో వారి ప్రవర్తన, వీక్షకులను ఆకట్టుకోవడానికి ఏం చేసారు అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

సెలబ్రిటీలను వెనక్కి నెట్టి

సెలబ్రిటీలను వెనక్కి నెట్టి

ఈ షోలో నటి, మోడల్ గుర్బానీ జడ్జ్ తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే వారందరినీ వెనక్కి నెట్టి మన్ వీర్ గుజ్జర్ ఎక్కువ మార్కులు కొట్టేసారు. అటు ప్రేక్షకుల నుండి, ఇటు సెలబ్రిటీల నుండి గుజ్జర్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి.

నన్ను స్టార్ లా చూడొద్దు

నన్ను స్టార్ లా చూడొద్దు

ఈ గెలుపుపై గుజ్జర్ మాట్లాడుతూ..... తాను విజయం సాధించడం నమ్మలేక పోతున్నాను. అంతా నన్ను ఓ స్టార్ లా చూస్తున్నారు, కానీ నాకు కామన్ మ్యాన్ గా ఉండటమే ఇష్టమని గుజ్జర్ ప్రకటించారు.

ఎవరీ మన్ వీర్ గుజ్జర్

ఎవరీ మన్ వీర్ గుజ్జర్

హర్యానా రాష్ట్రం నోయిడాకు చెందిన మన్ వీర్ గుజ్జర్ డెయిర్ ఫాం నడిపిస్తున్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తొలిసారే విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

సినీ, టీవీ రంగంలో రాణిస్తాడా?

సినీ, టీవీ రంగంలో రాణిస్తాడా?

ఇప్పటి వరకు గత బిగ్ బాస్ 9 సీజన్లలో గెలుపొందిన విజేతలు టీవీ లేదా సినిమా రంగంలో రాణిస్తూ స్టార్స్ అయిపోయారు. మన్ వీర్ గుజ్జర్ కూడా సినీ, టీవీ రంగం నుండి అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Having enthralled the audience with unadulterated drama and non-stop entertainment, another season of COLORS' marquee reality show Bigg Boss 10 came to an end yesterday (January 29). It's the triumph of the common man!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu