Just In
- 53 min ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 1 hr ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- 11 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 12 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- Sports
ISL 2020-21: హైదరాబాద్‌కు మరో డ్రా!
- News
బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ లెక్కల్లో తేడా: ఈ వారం ఎలిమినేషన్.. కంటెస్టెంట్ రీఎంట్రీ వివరాలు లీక్!
కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సీజన్ సీజన్‌కూ సరికొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ షోకు.. ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ షో తెలుగులో మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని, నాలుగోది మొదలెట్టారు నిర్వహకులు. ఈ సీజన్‌లో కూడా మంచి ఆదరణతో దూసుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 12వ వారం ఎలిమినేషన్.. కంటెస్టెంట్ రీఎంట్రీ విషయంలో బిగ్ బాస్ యూనిట్ అదిరిపోయే ప్లాన్ రెడీ చేసిందట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వాటిని బీట్ చేస్తూ దూసుకుపోతోంది
తెలుగు ప్రసారమైనా ప్రతిసారీ భారీ స్థాయిలో రేటింగ్ సాధించింది బిగ్ బాస్ షో. ఇప్పటి వరకూ పూర్తయిన ప్రతి సీజన్ రేటింగ్ విషయంలో ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే వచ్చింది. ఈ కారణంగానే ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయింది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం నేషనల్ రికార్డ్‌తో అదిరిపోయే ఆరంభం దక్కించుకుని ముందుకు సాగుతోంది.

అన్నీ కొత్తగానే.. అందుకే ఈ రెస్పాన్స్
గతంలో కంప్లీట్ అయిన మూడు సీజన్లు ఒకే తరహాలో సాగాయన్న టాక్ వినిపించింది. ఈ సారి కూడా అదే కంటిన్యూ అయితే రెస్పాన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉందని బిగ్ బాస్ యూనిట్ ముందుగానే గ్రహించింది. ఇందుకోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరికొత్త టాస్కులను పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నారు షో నిర్వహకులు.

ఫైనల్‌కు ముందు ప్రత్యేక ప్రయోగాలు
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇప్పటికే 80 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తద్వారా క్రమంగా ఫైనల్‌కు చేరువ అవుతోంది. ఈ నేపథ్యంలో షోపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ యూనిట్ అదిరిపోయే టాస్కులను రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే హిందీ బిగ్ బాస్‌లో ఎంతో పాపులర్ అయిన దెయ్యం ఎంట్రీని కూడా తీసుకొచ్చేశారు.

బిగ్ బాస్ లెక్కల్లో తేడా గమనించారా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కు సంబంధించి నాలుగు వారాలు మిగిలి ఉన్నాయని వీకెండ్ ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున వెల్లడించాడు. అంటే ఇప్పుడు హౌస్‌లో ఏడుగురు సభ్యలు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్స్‌కు వెళ్తారు. అంటే ఇద్దరు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. కాబట్టి మిగిలిన మూడు వారాల్లో ఒక వీకెండ్ ఎలిమినేషన్ ఉండదని అర్థం అవుతోంది.

ఈ వారం ఎలిమినేషన్‌పై డేరింగ్ స్టెప్
12వ వారానికి సంబంధించి ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, అవినాష్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనే కొత్త ప్రయోగం చేశారు. దీన్ని గెలుచుకోవడం ద్వారా ఓ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు అవినాష్. అది ఈ వారమే జరగబోతుందన్న వార్త తాజాగా లీకైంది.

కంటెస్టెంట్ రీఎంట్రీపై డేరింగ్ డెసీషన్!
మూడు నాలుగు వారాల నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరు బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అది ఈ వారం పక్కా అని వార్తలు వచ్చాయి. దీంతో రేపోమాపో రీఎంట్రీ ఉంటుందని అనుకున్నారంతా. తాజా సమాచారం ప్రకారం.. కంటెస్టెంట్‌ను ఈ వారం రీఎంట్రీ ఇప్పించరట. వచ్చే వారం మధ్యలో అది జరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.