Bigg Boss Telugu 7: గౌతమ్ ఎలిమినేషన్ కుట్ర లీక్.. ఆ ఇద్దరికే తక్కువ ఓట్లు.. అందుకే డాక్టర్ బాబు ఔట్
ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే షోకూ దక్కని రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే ఇది ఎన్నో సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఈ మధ్యనే ఏడో సీజన్‌ను సైతం నిర్వహకులు మొదలెట్టారు. ఎన్నో అంచనాల నడుమ మొదలైన దీనికి సైతం మంచి స్పందనే వస్తోంది. అదే సమయంలో షోపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక, గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ బిగ్ బాస్ షోపై అనుమానాలను మరింతగా పెంచేసింది. ఈ నేపథ్యంలో దీని వెనుక లీకైన షాకింగ్ న్యూస్‌ను మీరే చూడండి!
సరికొత్త కంటెంట్‌తో వినోదం: ఒకే రకమైన టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాకులు, ఫైటింగ్‌లు ఇలా గత సీజన్లు మొత్తం ఒకే తరహాలో నడిచినట్లు అనిపించాయి. దీంతో బిగ్ బాస్ షోపై ఆసక్తి క్రమంగా తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకున్నారో ఏమో కానీ, ఈ సారి మాత్రం షో విషయంలో నిర్వహకులు పంథాను మార్చుకుని ఉల్టా పుల్టా ఏడో సీజన్‌తో వచ్చారు. దీని ద్వారా వినోదాన్ని బాగానే పంచుతున్నారు.

ఫెయిర్ కాదు... ఆమె కోసమే: బిగ్ బాస్ షోలో ఓటింగ్ పక్కాగా ఉంటుందని నిర్వహకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్స్ ఓటింగ్ ద్వారానే జరుగుతాయని ప్రతి ఎపిసోడ్‌లో హోస్ట్‌తో వివరిస్తున్నారు. అయినప్పటికీ ఏడో ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూనే ఉన్నారు. అంతేకాదు, జనాలు చీదరించుకుంటోన్న శోభా శెట్టిని సేఫ్ చేస్తూనే వస్తున్నారు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు షాక్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎక్కువగా ఎలిమినేషన్స్ షాకింగ్‌గానే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే 11వ వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో 12వ వారంలో డబుల్ ట్రబుల్ పెట్టారు. ఇక, ఫినాలే వీక్‌కు ఎంతో ముఖ్యమైన 13వ వారం ఎలిమినేషన్‌లో సంచలనం కనిపించింది. ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్‌గా పేరొందిన గౌతమ్ కృష్ణ షో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు.
మళ్లీ ఆమెను సేవ్ చేశారు: బిగ్ బాస్ ఏడో సీజన్ 13వ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను ఒక్కొక్కరుగా సేఫ్ చేసుకుంటూ వచ్చారు. అయితే, ఆదివారం ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్‌ను ఎవరికీ వాడనని చెప్పడంతో నాగార్జున దాన్ని తీసేసుకున్నాడు. చివరి రౌండ్‌లో శోభా శెట్టి, గౌతమ్ ఉండగా.. డాక్టర్ బాబును పంపేసి తన ముద్దుబిడ్డను బిగ్ బాస్ కాపాడుకున్నాడు.
ఎలిమినేషన్ వెనుక కుట్ర: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లొచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు 'లోపల జరిగేది నిజమేనా..? డైరెక్షన్ ప్రకారమే షో నడుస్తుందా' అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాళ్లంతా ఇది రియాలిటీ షోనే అని కచ్చితంగా చెబుతున్నారు. అయితే, షోలో జరిగే ఎలిమినేషన్లు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ ఎలిమినేట్ అవడంతో దీని వెనుక కుట్ర జరిగినట్లు న్యూస్ లీకైంది.
వాళ్లిద్దరికే తక్కువ ఓట్లు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ సాగుతున్నాయని తాజాగా ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం ప్రకారం.. 13వ వారంలో ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ కంటే అంబటి అర్జున్, శోభా శెట్టికి తక్కువ ఓట్లు నమోదు అయ్యాయని తెలిసింది. శని, ఆదివారం ఎపిసోడ్లలో నాగార్జున మాట్లాడిన మాటలు దీనికి బలం చేకూర్చాయి.
అందుకేనా గౌతమ్ ఔట్: మొదటి నుంచీ ఏడో సీజన్‌లో స్టార్ మా బ్యాచ్‌ను బిగ్ బాస్ కావాలనే కాపాడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా శోభా శెట్టి లేదా ప్రియాంకను ఫినాలేకు పంపాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే శోభాను 13వ వారంలోనూ సేఫ్ చేశారని టాక్ వచ్చింది. అలాగే, అర్జున్ చాలా టాస్కులు గెలిచి ఫినాలేకు చేరవడం వల్లే అతడిని కాపాడి గౌతమ్‌ను బలి చేశారని టాక్.


Click it and Unblock the Notifications











