Brahmamudi March 12th అనామికకు దొరికిపోయిన కల్యాణ్, అప్పు.. రాజ్‌పై ఇందిరాదేవి చివరి అస్త్రం ఏంటంటే?
నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య వాళ్ల బావ భాస్కర్ ఆఫీసుకు వెళ్లడానికి రాజ్ తన కారు ఇస్తాడు. దీంతో ఇద్దరూ షాక్ అవుతారు. అదే విషయం ఇందిరాదేవితో చెబితే వాడు రివర్స్ లో వస్తున్నాడు అని చెప్తుంది. వాడికి నేనేంటో చూపిస్తానని చెప్తుంది. దీంతో కావ్య, ఆమె బావ కారు దగ్గరకు వెళ్తారు. ఈలోపు రాజ్ కూడా రెడీ అయ్యి వస్తాడు. రాజ్ ను చూసిన కావ్య, భాస్కర్ హ్యాపీగా ఫీలవుతారు. మీరు ఒక హెల్ప్ చేయాలని అడుగుతాడు రాజ్. దీంతో రాజ్ మళ్లీ జెలసీగా ఫీలవుతున్నాడని కావ్య, భాస్కర్ అనుకుంటారు.
వెంటనే ఎంటో చెప్పు అన్నయ్య అంటూ భాస్కర్ అడుగుతాడు. నేను ఆఫీసుకు వెళ్లాలి.. నాకు మీరు ఆఫీసు దాకా లిఫ్ట్ ఇస్తారా? అని అడగడంతో సరే అంటారు కావ్య, భాస్కర్. రాజ్ ను భాస్కర్ ముందు సీటులో కూర్చో అని చెప్పగానే నేను మధ్యలో దిగిపోయేవాడిని ముందు సీట్లో కావ్య కూర్చుంటేనే బాగుంటుందని కావ్యను కూర్చోబెడతాడు రాజ్. కారులో వెళ్తుంటే సరదాగా అలా తిరిగొస్తే రిలీఫ్ గా ఉంటుంది. అంటే మీరు మాతోనే వస్తారా? అని కావ్య అడుగుతుంది.

ఏం మాట్లాడుతున్నావు కళావతి పాపం తమ్ముడన్నయ్యా నేను ఉంటే ఫ్రీగా ఉండలేడని రాజ్ అంటాడు. మీరంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవారు. ఎన్నో విశేషాలు ఉంటాయి. హ్యాపీగా తిరిగేసి రండి. ఎంటి సైలెంట్‌గా కూర్చున్నారు సాంగ్స్ పెట్టొచ్చు కదా అని రాజ్ అంటాడు. వెంటనే రాజ్ సాంగ్స్ పెడతాడు. ఎఫ్‌ఎంలో బావకు సంబంధించిన సాంగ్స్ వస్తుంటాయి. రాజ్ డాన్స్ చేస్తాడు. తర్వాత ఒక దగ్గర దిగిపోతాడు.
పక్కకు వెళ్లిన రాజ్ నాతోనే పెట్టుకుంటారా అని తొంగి చూస్తుంటాడు. ఇప్పుడు చూడండి మీకు ఉంటుంది అంటూ వెళ్లిపోతాడు. కావ్య జరిగిందంతా ఇందిరాదేవికి ఫోన్ చేసి చెప్తుంది. దీంతో ఇందిరాదేవి మీరైతే ఇంటికి రండి అని చెప్పి రాజ్‌కు ఫోన్ చేసి తాతయ్యకు టాబ్లెట్స్ తీసుకురా అని చెప్తుంది. మరోవైపు అప్పు, కళ్యాణ్ కలిసి మాట్లాడుకుంటుంటారు. అసలు ఇంటికి కూడా వెళ్లాలనిపించడం లేదు బ్రో పుట్టి పెరిగింది అదే ఇంట్లో అయినా ఏదో పరాయి ఇంట్లోకి వెళ్లినట్టుందని కల్యాణ్ అంటాడు.
నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావని అప్పు అంటుంది. లేదు బ్రో నువ్వు అక్కడ ఉంటే నా బాధ అర్థం అయ్యుండేది కల్యాణ్ అంటాడు. ప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మడం లేదు అంతే కదా.. నమ్మేలా చెయ్ అప్పుడు అందరూ నీతో మంచిగా ఉంటారని చెప్తుంది అప్పు. ఇక ఇంట్లో వాళ్లకు బయటి వాళ్లకు ఏంటి తేడా? ఇంట్లో అనామికతోనే పెద్ద ప్రాబ్లమ్ అవుతుందని కల్యాణ్ చెప్పి బాధపడతాడు. కళ్యాణ్ బాధగా అనామిక గురించి చెప్తుంటాడు.
దీంతో నీ భార్య గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడం తప్పు అని నువ్వు అనామికకు నచ్చినట్లు ఉండమని లేకపోతే నీ గోల్ సాధించు అని అప్పు చెప్తుంది. మరోవైపు రాజ్ టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి రాగానే బామ్మ కావ్య ఎక్కడ అని అడుగుతుంది. వాళ్ల బావతో బయటకు వెళ్లిందని చెప్పగానే బావతో వెళ్లడం ఎంట్రా వెళ్తే నీతో వెళ్లాలి కానీ అంటూ అడుగుతుండగానే భాస్కర్, కావ్య వస్తారు. మరోవైపు అప్పు, కళ్యాణ్ మాట్లాడుకోవడం దూరం నుంచి అనామిక, ధాన్యలక్ష్మీ చూస్తారు. దీంతో అనామిక కోపంగా అప్పును కళ్యాణ్‌ను తిడుతుంది.
మమ్మల్ని ఇద్దరినీ విడదీసి తను మీ ఇంటికి కోడలు కావడానికి ట్రై చేస్తుందని అనామిక అంటుంది. ఇక ఇద్దరూ ఇంటికి వెళ్తారు. మరోవైపు రాజ్ పాస్‌పోర్ట్ తీసుకొచ్చి కావ్యకు ఇస్తాడు. నువ్వు మీ బావతో అమెరికా వెళ్లి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి భాస్కర్ అక్కడి వస్తారు. వాళ్లతో విషయం చెప్పి కావ్య బాధపడుతుంది. లాభం లేదు ఇక చివరి అస్త్రం వదలాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది.
ఏంటి అమ్మమ్మ అని కావ్య అడుగుతుంది. అదే ఇందాక నువ్వు భయపడిందే విడాకులు అని చెప్తుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది. దీంతో ఇవళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎపిసోడ్ లో కావ్యకు విడాకుల పత్రాలు ఇస్తుంది ఇందిరాదేవి. ఏంటమ్మమ్మ ఇది మీ చెత్తో ఇస్తున్నారా ఏంటి మీ ఉద్దేశం అని అడుగుతుంది కావ్య. విడిపోయే పత్రాలే మిమ్మల్ని కలుపుతాయి. ఇదే మన ఆఖరి అస్త్రం అని చెప్తుంది.


Click it and Unblock the Notifications











