Brahmamudi March 13th కావ్య ప్లాన్ రివర్స్ - రాజ్పై శాపనార్థాలు - అనామికపై రెచ్చిపోయిన కనకం!
ఎమోషనల్, ఫైటింగ్ వంటి సీన్స్‌తో నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన భర్త రాజ్‌లో మార్పు తీసుకురావాలని.. కావ్య వేసిన బావతో రొమాన్స్ ప్లాన్ బెడిసికొట్టింది. రాజ్ తనకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అయిష్టంగానే ఉన్నా కావ్యకు పాస్‌పోర్టు ఇచ్చి అమెరికా వెళ్లమని చెప్పి వెళ్లిపోతాడు. కొత్త జీవితం ప్రారంభించమని ఉచిత సలహా ఇచ్చి పక్కకు వెళ్లిపోతాడు. దీంతో కంగుతిన్న కావ్య బాధలో మునిగిపోతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇందిరాదేవి.. ఎలాగైన రాజ్‌ను దారిలో పెట్టేందుకు చివరి అస్త్రంగా విడాకులను ప్రయోగించాలని కావ్యకు సలహా ఇస్తుంది. కానీ దానికి కావ్య నో చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు, కళ్యాణ్ కలిసి తిరగడం చూసి తట్టుకోలేపోయిన అనామిక, ధాన్యలక్ష్మీ కనకం ఇంటికి వెళ్లి గొడవ వేసుకుంటారు. అయితే కనకం కూడా తిరిగి వారిని కాస్త గట్టిగానే అంటుంది. అలానే గొడవ అయ్యాక తన ఇంటికి వచ్చిన కళ్యాణ్‌ను కూడా ఇంటికి రావొద్దని కనకం బాధతో గట్టిగానే మాట్లాడుతుంది.
రాజ్ అంతరాత్మ శాపనార్థాలు.. కావ్యను అమెరికా పంపించాలని రాజ్ గట్టిగా నిర్ణయం తీసుకోవడంతో అతడి అంతరాత్మ చాలా బాధ పడుతుంది. శాపనార్థాలు కూడా పెట్టింది. దీంతో రాజ్.. తన అంతరాత్మతో ఫిలాసఫీలు మాట్లాడి కవర్ చేస్తాడు. జీవితాంతం ఆడగాలి లేకుండా నీ శరీరంలో బంధీగా బతకడం నా వల్ల కాదంటూ అంతరాత్మ మొర పెట్టుకుంటుంది. అయినా రాజ్ దేనికి సమాధానం చెప్పకుండా కోపంగా వెళ్లిపోతాడు.

కనకం రివర్స్ ఎటాక్.. ఇక సహనం కోల్పోయిన కనకన.. అయినా మీ కొడుకు, నీ భర్తకు బుద్ధి చెప్పండి సంస్కారం లేని మనుషులు మనం, సంస్కారం ఉన్న వాళ్లతో తిరగొద్దని కనకం దీటుగానే బదులిస్తుంది. ఇంకోసారి ఇలా ఇంటికొచ్చి గొడవ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి.. మీ అత్తగారిని, మామగారిని నిలదీస్తానని అంటూ ధాన్యలక్ష్మిని బెదిరిస్తుంది కనకం.
అస్సలు కదలను... ధాన్యలక్ష్మీ, అనామికతో గొడవ అయ్యాక కళ్యాణ్‌ను తీసుకొని అప్పు ఇంటికొస్తుంది. అయితే వీరిద్దరితో కాస్త కఠినంగా మాట్లాడతారు నీకు పెళ్లైంది. అప్పు పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఇప్పుడు కూడా మీరు కలిసి తిరిగితే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు అంటూ కనకం అంటుంది. మా స్నేహ బంధాన్ని తప్పు పడుతున్న వారు ఎవరు అని కళ్యాణ్ తిరిగి అడుగుతాడు. అయినా కనకం, కృష్ణమూర్తి మాత్రం జరిగిన గొడవ గురించి చెప్పరు. కానీ కళ్యాణ్ మాత్రం తమ స్నేహాం గురించి నీచంగా మాట్లాడింది ఎవరో చెబితే గానీ ఇక్కడి నుంచి కదలనని అలానే అక్కడే ఉంటాడు. ఇక సీరియల్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










