Brahmamudi March 15th కావ్యకు రాజ్ విడాకులు ఇచ్చాడా? లేదా కలిసిపోయారా?

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడులో ధాన్యలక్ష్మి, అనామిక పెట్టిన పంచాయితీ తర్వాత కావ్య, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్తుంది. ఇకపై తన చెల్లెలు అప్పునూ కలవొద్దని దీనివల్ల నీకు ప్రాబ్లమ్‌ రాకున్నా అప్పుకు సమస్య అవుతుందని కావ్య వివరిస్తుంది. దీంతో కళ్యాణ్‌ మా స్నేహం చాలా పవిత్రమైందని పెళ్లికన్నా ముందే మేం స్నేహితులమని అంటాడు. కానీ సొసైటీ అలా అనుకోదని నువ్వు కూడా అనామిక మనసును కష్టపెట్టకుండా చూసుకోమని కావ్వ చెప్పుకువస్తుంది.

కావ్యకు రాజ్ డబ్బులు...:అయితే ఈ విషయంలో నేను మీ మాట వినలేనని అప్పును కలవాలనుకుంటే కలిసి తీరతానని కల్యాణ్ తెగేసి చెప్తాడు. తర్వాత కావ్య కాఫీ తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్తుంది. రాజ్ ఒక్క నిమిషం అంటూ డబ్బులు తీసి కావ్యకు ఇస్తాడు. కాఫీ ఇంత ఖరీదైందేమీ కాదని కావ్య అంటుంది. తానేమీ కాఫీ కొట్టు పెట్టుకోలేదు. ఎందుకు ఇంత డబ్బు ఇచ్చారని కావ్య అడుగుతుంది. నువ్వేసిన డిజైన్స్‌ కు నేను ఇవ్వాల్సిన డబ్బు అని రాజ్ అంటాడు. నెల కాగానే జీతం ఇస్తారుగా అని కావ్య అంటుంది.

March 15th 2024 Episode number 358 in Brahmamudi Telugu Serial

దారి ఖర్చులకు డబ్బులు...:అప్పటిదాకా నువ్వు ఉండవు కదా? పాస్‌ఫోర్టు వచ్చిందిగా పారిన్‌ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలిగా.. ఇంకా కావాలంటే అడుగు ఇస్తానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇందిరాదేవి, భాస్కర్‌ వస్తారు. చూశారా అమ్మమ్మగారు మా ఆయన నేను వెళ్ళిపోవడానికి దారి ఖర్చులకు చాలా డబ్బులు ఇచ్చారని కావ్య బాధగా చెప్తుంది. నువ్విలాగే ఆలోచిస్తుంటే వాడు అహానికి పోయి నిన్ను ఎయిర్‌ఫోర్టులో దించేసినా దించేస్తాడని ఇందిరాదేవి అంటుంది.

విడాకుల పత్రాలతో కృష్ణుడి వద్దకు:నువ్వు ఈ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు వాడు ఎందుకు దారికి రాడో నేను చూస్తానని ఇందిరాదేవి చెప్తుంది. నీ కాపురం నిలబెట్టుకోవడానికి నీ ముందున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకో లేదంటే నీఇష్టం అంటూ ఇందిరాదేవి, భాస్కర్‌ వెళ్లిపోతారు. కావ్య ఏడుస్తూ కాగితాలు పట్టుకుని వెళ్లి కృష్ణుడి విగ్రహం వద్దకు వెళ్తుంది. అక్కడ నిలబడి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది కావ్య. తర్వాత పేపర్స్‌ పై సంతకం పెడుతుంది.

March 15th 2024 Episode number 358 in Brahmamudi Telugu Serial

కల నిజమైతే బాగుండేమో...:ఆ పేపర్స్‌ తీసుకుని తన గదిలోకి వెళ్తుంది కావ్య. రూంలో రాజ్‌ రెడీ అవుతుంటాడు. కావ్య ఏడుస్తూ పేపర్స్‌ పక్కకు పడేసి వెళ్లి రాజ్‌ను వెనకనుంచి హగ్‌ చేసుకుని.. మీరు నాకు కావాలి. నేను ఎప్పటికి నీ భార్యగానే ఉండాలి. నన్ను దూరం చేసుకోవద్దు నేను భరించలేను. మీకు దూరం అయ్యి నేను తట్టుకోలేను. ప్రశాంతంగా బతకలేను. మీరు నాకు కావాలి.. అన్నట్లు కావ్య కలగంటుంది. ఇంతలో కావ్యను చూస్తూ.. పిలిచావా? గది బయటే నిలబడిపోయావేంటని రాజ్ అడుగుతాడు.

స్థిరాస్తులు కావాలా...:మీ నిర్ణయం కోసం... ఈ కాగితాలు చూడండని కావ్య అనగా.. ఏంటివని రాజ్ అడుగుతాడు. మన భవిష్యత్తు ఈ రాతల్లోనే ఉందని కావ్య అంటుంది. స్వప్నకు రాసిచ్చినట్టుగా నీక్కూడా భరోసా కోసం ఆస్థి ఏమైనా రాసివ్వాలా అని రాజ్ అంటాడు. స్థిరాస్తులు రాసిచ్చే రైట్స్‌ నాకు లేవు. తాతయ్యే రాయాలి. అయినా నాన్నమ్మ నీకు బెస్ట్‌ ఫ్రెండే కదా అని రాజ్ అంటాడు. నాకు మీ ఆస్థులేం అక్కర్లేదని కావ్య అంటుంది. మరేం కావాలని రాజ్ అంటాడు.

March 15th 2024 Episode number 358 in Brahmamudi Telugu Serial

రాజ్ బాధగా చూస్తూ...:విడాకులు, అవును విడాకుల పేపర్స్‌ మీద నేను సంతకం చేశానని చెప్తుంది కావ్య. మీరు సంతకం చేయడమే బాకీ ఉంది... మీరు కోరుకున్నదే కదా.. నేనేమీ వెళ్లిపోతాననలేదు. నాకు విడాకులు ఇచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని మీరే చెప్పారని కావ్య అంటుంది. మీరు మారతారని చాలా చేశాను. సంవత్సరం గడిచిపోయింది. ఇక మీ జీవితం మీ ఇష్టమని కావ్య అంటూ చెప్తుంటే రాజ్‌ బాధగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

తర్వాత ఎపిసోడ్ లో కావ్య నీ జీవితంలోంచి వెళ్లిపోతుందన్నా ఊహ తట్టుకోలేక నీ మెదడు స్థబ్తంగా మారింది. నీ మనసు నిశ్శబ్దంగా మారింది. ఈ శున్యం నువ్వు పూడ్చుకోలేవు రాజ్. పిచ్చివాడివి అవుతావు. ఏ తప్పు చేయని నీ భార్య నీ మీద ప్రేమను చంపుకుని వెళ్లిపోతే నువ్వు తట్టుకోలేవు. నీ భార్య బయట అడుగుపెట్టకుండా నీ ప్రేమను బయటపెట్టు అని శ్వేత రాజ్ కు చెప్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X