Brahmamudi March 16th కావ్యను నిండా ముంచిన ఇందిరాదేవి... విడాకులకు సిద్ధమైన రాజ్?

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడులో విడాకులపై సంతకం చేసిన కావ్య ఆ పేపర్లను రాజ్‌కు ఇస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పండి.. నేను మా అమ్మ నాన్నకు చెప్పాలి.. నా వైపు నుంచి తప్పు ఉండకూడదు అంటూ కావ్య చెప్తుంది. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి కానీ.. నా దగ్గర ఉంది. కానీ మీకు లేదు.. ఈ విషయం అందరికీ స్పష్టంగా చెప్పాలని కావ్య రాజ్ తో అంటుంది. రాజ్ షాక్ లో బాధగా చూస్తూ ఉంటాడు. సాయంత్రం వరకు మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని కావ్య బాధతో వెళ్లిపోతుంది.

కావ్య ఆవేదన...
గది బయట నిలబడి కావ్య బోరున ఏడుస్తుంది. ఇది నటన అయినా.. తట్టుకోలేకపోతున్నా అంటూ బాధపడుతుంది. గదిలో రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి శభాష్‌.. రా.. మొత్తానికి నువ్ అనుకున్నది సాధించావ్ అంటూ మాట్లాడుతాడు. నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది... ఇంకేందుకు ఆలస్యం సంతకం పెట్టు అంటూ మాట్లాడుతాడు. దీంతో రాజ్ కోపంగా సూట్ కేస్ విసిరేస్తాడు. మరోవైపు కిందకు దిగిన కావ్యను రాజ్ ఏమన్నాడు అని ఇందిరాదేవి అడుగుతుంది. సైలెంటుగా ఉన్నారని చెప్తుంది కావ్య. దిమ్మ తిరిగి మైండ్ బొద్దిబారి ఉంటుంది వెధవకి అని ఇందిరాదేవి అంటుంది.

March 16th 2024 Episode number 359 in Brahmamudi Telugu Serial

నేను చూసుకుంటా...
నాకు భయంగా ఉందని కావ్య అంటే వెళ్లి తీరిగ్గా భయపడి రా. ఈ దెబ్బకి వాడు దిగి రావాల్సిందేనని ఇందిరాదేవి అంటుంది. అదంతా రుద్రాణి గమనిస్తుంటుంది. ఇంతలో రాజ్ వస్తుంటే అక్కడి నుంచి వెళ్లి డైనింగ్ టేబుల్‌ దగ్గరకు వెళ్తారు. రాజ్ బయటకు వెళ్తుంటే వచ్చి తినమని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ వచ్చి కూర్చుంటాడు. కావ్య వడ్డించు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కావ్య వడ్డిస్తుంది. రాజ్ బాధలో ఉంటునే.. తనకు ఇష్టం లేని ఇడ్లీ తింటుంటాడు. అది గమనించిన రుద్రాణి అడుగుతుంది. దాంతో రాజ్‌కు ఏమైందని అంతా షాక్ అవుతారు.

షాక్ లోనే రాజ్...
కావ్య వేరే టిఫిన్ వడ్డిస్తానని చెబితే.. అక్కర్లేదు. నా బ్రేక్ ఫాస్ట్ అయిపోయిందని వెళ్లిపోతాడు రాజ్. ఆ తర్వాత రాజ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. అసలు ఏం జరిగింది అని ఇందిరాదేవి అడుగుతుంది. మీరు చెప్పినట్లే విడాకుల పేపర్స్‌ మీద సంతకం చేసి ఇచ్చానని చెప్తుంది కావ్య. ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు అని కావ్య భయపడిపోతుంది. ఏం కాదులే. ఏం జరిగినా అడ్డుకోడానికి నేను ఉన్నాగా అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు విడాకుల గురించే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శ్వేత వచ్చి ఏంటీ రాజ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బయటకు వస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావంటుంది.

శ్వేత సలహా...
టేబుల్ మీద ఉన్న విడాకుల పత్రాలను చూసి షాక్ అవుతుంది. నా భర్త అంటే దుర్మార్గుడు కాబట్టి విడాకులు కోరుకున్నాను. కానీ కావ్య ఎందుకు కావాలనుకుంటుంది. శారీరకంగానే హింసిస్తేనే హింస కాదు రాజ్. తన గుండెకు గాయం అయింది.. మొత్తానికి నన్ను అడ్డు పెట్టుకుని అనుకున్నది సాధించావ్. నీ ఇంటి నుంచి. నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది కావ్య అంటూ శ్వేత అంటుంది. నీ భార్య నీ ఇంటి నుంచి అడుగుబయటపెట్టకుండా అడ్డుకో అని సలహా ఇస్తుంది. అయినా రాజ్ మౌనంగా ఉండిపోతాడు.

March 16th 2024 Episode number 359 in Brahmamudi Telugu Serial

అనామికకు సమస్య...
మరోవైపు పెద్ద సమస్య వచ్చిందని ధాన్యలక్ష్మీకి అనామిక వచ్చి చెబుతుంది. ఏంటని దాన్యలక్ష్మి అడుగుతుంది. నా కాలేజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్లు చాలా రిచ్. నేను ఏమో కల్యాణ్ మన ఆఫీస్ మొత్తం చూసుకుంటున్నాడని చెప్పాను. కానీ, ఇప్పుడు వాళ్లకు నిజం తెలిస్తే పరువు పోతుందని అనామిక భయపడుతుంది. అలా ఎందుకు చెప్పావ్. ఇంకోసారి చెప్పకు. ఇప్పుడు నేను చూసుకుంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో అనామిక ఫ్రెండ్స్ వస్తే కావ్య వెళ్లి డోర్ తీస్తుంది. వాళ్లు అనామిక ఫ్రెండ్స్. బెంగళూరు నుంచి వస్తున్నామని చెప్పడంతో వాళ్లను లోపలికి ఆహ్వానిస్తుంది కావ్య.

విడాకులకు రెడీ
తర్వాత అమ్మమ్మ. మా అత్తయ్య అని అనామిక పరిచయం చేస్తుంది. మీరు టార్చర్ పెట్టే టైపా పద్ధతి టైపా అని వాళ్లు అడిగితే.. అమ్మలా ప్రేమగా చూసుకునే టైపు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ఆంటీ ఎవరని అపర్ణ గురించి అడిగితే.. తను ఈ ఇంటికి పెద్ద కోడలు. ఇంట్లో ఏదైనా తన నిర్ణయం మీదే నడుస్తుంది. నేను పెద్ద కోడలు. ఆమె మా అత్తయ్య అని కావ్య అంటుంది. ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాతి ఎపిసోడులో అందరిముందు ముఖ్యమైన విషయం చెప్పాలని, తన జీవితానికి చెందిన విషయం అని రాజ్ అంటాడు. దాంతో కావ్య, ఇందిరాదేవి షాక్ అయిపోతారు. అది ఇప్పుడే చెప్పొచ్చు కదా అని ఇందిరాదేవి అంటే.. ఇది కళావతి పుట్టింటివాళ్ల సమక్షంలోనే చెప్పాలి అని రాజ్ అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X