Brahmamudi March 19th ఫంక్షన్‌లో విడాకుల పత్రాలతో రాజ్.. కావ్యతో విడిపోతున్నట్లు అనౌన్స్!
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడులో కావ్య అంటే అపర్ణకు ఇంకా ఇష్టం లేదని లేకపోతే ఇప్పటి వరకు తన కోడలు కోసం చేయించిన నగలు ఎందుకు ఇవ్వలేదని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు. దీంతో అపర్ణ కోపంగా తనగదిలోకి వెళ్లి నగలు తీసుకువస్తుంది. నీ పెళ్లిలో తీసుకున్న ఈ నగలు మళ్లీ నీ పెళ్లిరోజుకు గిఫ్టుగా ఇస్తున్నానని కావ్యకు ఇచ్చేస్తుంది అపర్ణ. నగలు ఇవ్వడంతో తనకు ఎలాంటి నగలు అవసరం లేదని కావ్య చెప్తుంది. అపర్ణ కోపంగా తీసుకో అని చెప్తుంది. దీంతో కావ్య నగలు తీసుకుంటుంది.
నోరు ముసుకున్న రుద్రాణి, ధాన్యలక్ష్మి
కావ్య నగలు తీసుకోవడంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి నోరు మూసుకుంటారు. తర్వాత కావ్య నగలు తీసుకుని అపర్ణ రూంలోకి వెళ్లగానే అపర్ణ కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా రూంలోకి వస్తావు అనగానే కావ్య తిరిగి వెళ్లిపోతుంది. రూంలోకి ఎందుకు వచ్చావు ఎందువు వెళ్తున్నావు అని అడుగుతుంది అపర్ణ. క్లారిటీ కోసం వచ్చానని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. మీకు నా మనసులో చోటు ఉందేమో అనుకున్నాను.. కానీ లేదని క్లారిటీ వచ్చిందని చెప్తుంది కావ్య. తెలివైనదానివే అంటూ అపర్ణ మాట్లాడుతుంది.

ఫంక్షన్ కు కనకం ఫ్యామిలీ...
మరోవైపు అప్పు అటూ ఇటూ తిరుగుతూ తింటుంటే ఒకచోట కూర్చుని తినొచ్చు కదా అని కనకం తిడుతుంది. నిన్నెవడు వడ్డించమన్నాడు.. నేనే వడ్డించుకు తింటానులే.. అని అప్పు అంటుంది. బోయే పోలీసువి డిటర్జెంట్ తో ఉండటం నేర్చుకోమని కనకం అంటుంది. అది డిటర్జెంటో డిష్ వాషో కాదు డిసిప్లీన్ అని చెప్తుంది అప్పు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే కావ్య ఫోన్ చేస్తుంది. ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి మీరందరూ ఫంక్షన్‌కు రావాలని పిలుస్తుంది. సాయంత్రం అందరూ కలసి రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
రుద్రాణికి అపర్ణ వార్నింగ్...
మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు. రాజ్ ఇంకా కిందకు రాలేదు ఈ పూజ అంటేనే ఇష్టం లేనట్టుందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇష్టం లేదు అని నీకు చెప్పాడా అని అపర్ణ అంటుంది. చెప్పలేదు అలా అని ఇష్టం ఉన్నట్లు కూడా లేడు. మార్నింగ్ నుంచి ఏదో కంగారుపడుతూ తిరుగుతున్నాడు. ఈ పూజ ఎక్కడ జరిగిపోతుందోనని తిరుగుతున్నట్టున్నాడని రుద్రాణి అంటుంది. కంపెనీ బాధ్యతలు చూసుకునేవాడికి ఆ మాత్రం కంగారు ఉంటుంది రుద్రాణి అని అపర్ణ అంటుంది.

ధాన్యలక్ష్మి వెటకారం
నీ కొడుకులాగా ఖాలీగా ఇంట్లో కూర్చుంటాడు అనుకుంటున్నావా? రాజ్‌కు ఎప్పుడు ఏది పూర్తి చేయాలో బాగా తెలుసని చెప్తుంది. అందుకేనా పూజకి టైం అవుతున్నా ఇంకా గదిలోనే కూర్చున్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. ఒకవేళ నువ్వు నా ముందు కావ్య మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నట్లు రాజ్ కూడా నటిస్తున్నాడేమో అక్క అని ధాన్యలక్ష్మి వెటకారం చేస్తుంది. నటించాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుక్కి అంతకన్నా లేదు. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తానని వెళ్తుంది అపర్ణ.
అగ్ని సాక్షిగా ప్రమాణం...
తర్వాత పూజ మొదలవుతుంది. కావ్య ఒక్కతే పీటల మీద కూర్చుని ఉంటుంది. అందరూ రాజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. అందరూ వెడ్డింగ్ యానివర్సరీ విషెష్ చెప్తారు. తర్వాత కావ్య పక్కన పూజలో కూర్చుంటాడు రాజ్. పూజ ఎందుకు చేస్తున్నారో పంతులు వివరించగానే రాజ్, కావ్య షాక్ అవుతారు. తర్వాత పంతులు పూజ పూర్తి చేసి హారతి ఇస్తూ ఇద్దరూ జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేయమని చెప్తాడు.

హారతి కిందపడిపోవడంతో..
కావ్య ప్రమాణం చేస్తుంటే.. రాజ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇందిరాదేవి ప్రమాణం చేయమని గట్టిగా చెప్పగానే రాజ్ ప్రమాణం చేయబోతాడు ఇంతలో హారతి పట్టుకున్న అపర్ణ చేయి కాలడంతో హారతి కిందపడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. హారతి మరోసారి వెలిగించమని ఇందిరాదేవి చెప్పగానే అపర్ణ అలాగేనని వెలిగిస్తుంటే రాజ్ కు ఆఫీసు నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు. తర్వాత సాయంత్రం పార్టీకి అంతా రెడీ అవుతుంది.
రాజ్ డివర్స్ పేపర్స్..
గదిలో మాత్రం కావ్య ఇంకా రెడీ కాకుండా అలాగే ఉండిపోతుంది. ఇందిరాదేవి వచ్చి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతుంది. ఉదయం పూజలో అపశృతి జరిగినప్పటి నుంచి నాకు భయమేస్తుంది అని చెప్తుంది. నా మనసు మససులో లేదు అంటూ ఏడుస్తుంది. ఇక ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో కావ్యను రెడీ చేసి ఫంక్షన్ దగ్గరకు తీసుకువస్తుంది ఇందిరాదేవి. ఇక కనకం వాళ్లు చూసి మురిసిపోతారు. ఇంతలో రాజ్ వస్తాడు. డివర్స్ పేపర్స్ తీసుకుని వచ్చి.. స్టేజీ మీద కావ్య సంతకం చేసి ఇచ్చిందని చెప్తాడు. దీంతో ఇంట్లోని వాళ్లంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications










