Brahmamudi March 21st బిడ్డతో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ.. ఆ బిడ్డకు తల్లెవరు?

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్ కోసం కావ్యతో పాటు ఫ్యామిలీ అంతా ఎదురుచూస్తున్న వేళ రాజ్ కారులో నుంచి దిగుతాడు. ఆ తర్వాత కారు దిగి మరోవైపు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేస్తాడు. అందరూ సర్‌ప్రైజింగ్‌గా చూస్తుంటారు. ఏదో పెద్ద గిఫ్టే తెచ్చినట్టున్నాడని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్‌ ఒక చిన్న బాబును కారులోంచి ఎత్తుకుని వస్తుంటాడు. అందరూ షాక్‌ అవుతారు. రాజ్‌ బాబును ఎత్తుకుని కావ్య పక్కన వచ్చి నిలబడతాడు. అందరూ షాక్ అవుతారు. అసలు ఎవరూ ఈ బిడ్డ అంటూ అపర్ణ, ఇందిరాదేవి, రుద్రాణి అడుగుతారు.

కావ్యకు షాక్...
ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవు ఎంటి నాన్నా అని అపర్ణ అడుగుతుంది. నువ్వు వస్తావని ఎదురుచూస్తుంటే హఠాత్తుగా బిడ్డను ఎత్తుకుని వచ్చావేంటి? ఈ బిడ్డకు ఈ ఇంటికి సంబంధం ఏంటని ఇందిరాదేవి ప్రశ్నిస్తుంది. చెప్పరా బిడ్డకు తల్లి లేదా? తండ్రి లేడా? చెప్పరా అని అపర్ణ నిలదీస్తుంది. దీంతో రాజ్ అందరూ అడిగారు నువ్వు అడగవా? నువ్వు అడిగినా అడగకపోయినా నేను సమాధానం చెప్తాను. మరీ ముఖ్యంగా ఇది నీకే చెప్తానని కావ్యతో రాజ్ అంటాడు.

March 21st 2024 Episode number 363 in Brahmamudi Telugu Serial

దుగ్గిరాల వంశ వారసుడు...
కాసేపట్లో ఈ వేదిక మీద వేడుక జరుగుతుందన్న ఆశతో నువ్వు ఎదురుచూస్తుంటావన్న విషయం నాకు తెలుసని కావ్యతో రాజ్ అంటాడు. కానీ ఇదే వేదిక మీద నేనొక నిజాన్ని చెప్పబొతున్నానని చెప్పుకువస్తాడు. అది విని తట్టుకునే శక్తి నీలో ఉందని నమ్ముతున్నానని రాజ్ అంటాడు. రాజ్‌ ఆ బాబును చూపిస్తూ వీడు నా రక్తం.. దుగ్గిరాల వంశ వారసుడు అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ రాజ్‌ను తిడుతుంది.

రాజ్ మాటలు నమ్మని ఫ్యామిలీ...
కల్యాణ్ మాట్లాడుతూ.. పెళ్లిరోజు ఫ్రాంక్‌ చేస్తున్నావా? అని అడుగుతాడు. మేం ఎవ్వరం నువ్వు చెప్పేది నమ్మం అంటూ ప్రకాశం, ధాన్యలక్ష్మి అంటారు. దీంతో అబద్దాన్ని నిజం అని చెప్పలేని నేను నిజాన్ని కూడా అబద్దం అని చెప్పలేను అంటూ ఇది నిజం ఈ బిడ్డ నా బిడ్డ అంటాడు రాజ్‌. ఇక నుంచి ఈ ఇంటి వారసుడు అనడంతో అందరూ షాక్‌ అవుతారు. ఇందిరాదేవి వెళ్లి రాజ్‌ను తిడుతుంది. అదేంటమ్మా.. వాడు కచ్చితంగా నమ్మకంగా నిజమే అని చెబుతుంటే వాడు ఏ తప్పు చేయలేదని ఇంకా నమ్ముతావేంటి అంటుంది రుద్రాణి.

అపర్ణ ఫైర్...
ఇది ఎవరో చెప్పిన నిజం కాదు వాడే బయటపెట్టిన నిజమని రుద్రాణి చెప్పుకువస్తుంది. ఏంటి వదిన అలా కొయ్యబారిపోయావు. ఇన్నాళ్లు నా కొడుకుని నేను సరిగ్గా పెంచలేదని దుమ్మెత్తిపోశారుగా మరి నువ్వు నీ కొడుకుని ఎలా పెంచావని నానా మాటలు అంటుంది. అరేయ్‌ విన్నావా? మీ అత్త ఏమంటుందో విన్నావా? నా పెంపకం గురించి మాట్లాడుతుందని అపర్ణ ఆవేదన చెందుతుంది. ఈ అవకాశం ఇచ్చింది ఎవరు..? నీ తల్లిని ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? నువ్వు .. నన్ను మీ అమ్మను ఒక మరబొమ్మలా మార్చిపడేశావని ఫైర్ అవుతుంది. ఇలాంటి పాపిస్టి పని ఎలా చేయగలిగావు నీకు నీ భార్య గుర్తుకు రాలేదా అని నిలదీస్తుంది.

March 21st 2024 Episode number 363 in Brahmamudi Telugu Serial

సైలెంట్ గా రాజ్...
మీరైనా అడగండి అంటూ సుభాష్ తో అంటుంది అపర్ణ. ఏం అడగమంటావు అపర్ణా.. అన్నీ తెలిసినవాడు ఇలాంటి పరిస్థితుల్లో దోషిగా నిలబడితే నిలదీసినంత మాత్రాన నిజం అబద్దం అవుతుందా? తల్లిగా నువ్వెలా ఓడిపోయావో.. తండ్రిగా నేను ఓడిపోయానని సుభాష్ అంటాడు. అందరూ రాజ్‌ను ప్రశ్నిస్తుంటారు. రాజ్‌ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. మాకెవ్వరికీ సమాధానం చెప్పకపోయినా నీ భార్యకు సమాధానం చెప్పు అని ఇందిరాదేవి అడగ్గానే నేనొక ప్రశ్నలా మారిపోయాను.. నా దగ్గర సమాధానం లేదు. అంటూ బాబును తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు రాజ్‌. కావ్య కూడా లోపలికి వెళ్తుంది.

ఆ బిడ్డకు తల్లెవరు...
ఇప్పుడు నేను ఏం చేయాలి. ఏడవాలా? సర్దుకుపోవాలా? బట్టలు సర్దుకునిపోవాలా? విడాకులు ఇచ్చి శాశ్వతంగా వెళ్లిపోవాలా అని రాజ్ ను నిలదీస్తుంది కావ్య. ఏం చెప్పాలి. అడిగే స్థానంలో నువ్వున్నావు. చెప్పలేనంత దూరంలో నేనున్నానని రాజ్ అంటాడు. ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కావ్యను మా ఇంటికి పంపించేయమని కనకం అంటుంది. అమ్మా అంటూ కావ్య అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X