Brahmamudi March 22nd రాజ్‌ను నిలదీసిన కావ్య.. ఆ బిడ్డకు తల్లి ఎవరో చెప్పేశాడా?
బ్రహ్మముడి సీరియల్ ఈ వారం 45 నిమిషాల పాటు టెలికాస్ట్ అవుతుంది. మరోవైపు సీరియల్ లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి రోజున రాజ్.. కావ్య కోసం పెద్ద గిఫ్ట్ తీసుకువస్తాడు అనుకుంటే.. ఓ పిల్లాడితో ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు. ఇక ఆ పిల్లాడు ఎవరు అంటూ అందరూ ప్రశ్నించారు. 'నా రక్తం.. దుగ్గిరాల వంశం వారసుడు' అంటూ రాజ్ సమాధానం చెబుతాడు. కానీ రాజ్ చెప్పిన విషయం ఎవరూ నమ్మరు.
రాజ్ ఎప్పటికీ తప్పు చేయడు...
రాజ్ ఎప్పటికీ తప్పు చేయడు అంటూ మాట్లాడుతారు. ఇది నిజం అంటూ చెప్పుకువస్తాడు రాజ్. రుద్రాణి తన కొడుకు తప్పు చేస్తే.. అందరూ ప్రశ్నించారు. మరి రాజ్ తప్పు చేశాడు.. అంటూ ఎద్దేవా చేసి మాట్లాడుతుంది. దీంతో అపర్ణ.. చూశావారా.. నీ అత్త నిన్ను, నన్ను ఎన్ని మటాలు అంటుంది. నా పెంపకం బాగాలేదు అని చెప్తుంది.. అసలు ఈ బిడ్డ ఎవరు.. ఎలా నీ భార్యకు అన్యాయం ఎలా చేయాలనిపించింది అంటూ ప్రశ్నిస్తుంది.

కావ్య నిలదీత...
మీరైనా చెప్పండి అంటూ సుభాష్ ను అడుగుతుంది అపర్ణ. ఇక సుభాష్ మాట్లాడుతూ.. నువ్వు ఎలా తల్లిగా ఓడిపోయావో నేను కూడా తండ్రిగా ఓడిపోయాను అంటూ చెప్తాడు. ఎవరు ఎంత ప్రశ్నించిన రాజ్ సమాధనం చెప్పకుండా గదిలోకి వెళ్లిపోతాడు. కావ్య మాత్రం సైలెంటుగా ఉండిపోతుంది. అసలు ఆ బిడ్డ ఎవరు అనే ఆలోచనలో పడిపోతుంది. నా రక్తం అనే మాటను గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. దీంతో కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజ్ గదిలోకి వచ్చిన కావ్య.. రాజ్ ను నిలదీస్తుంది. నేను సర్దుకుపోవాలా అంటూ ప్రశ్నిస్తుంది.
కనకం ఫైర్...
మరోవైపు అపర్ణ, కనకం ఫంక్షన్లో గొడవ పడుతుంటారు. అసలు నీ కూతురు జేష్ట్య దేవిలాగా మా గడపలో కాలు మోపిన నాటి నుంచే మా ఇంటికి అరిష్టం చుట్టుకుందని అపర్ణ అంటుంది. కనకం మీద ఊగిపోతూ ఫైర్ అవుతుంది. దీంతో నా కూతురికి ఇంత అన్యాయం చేసి పై నుంచి దాందే తప్పంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అంటూ అపర్ణకు కనకం వార్నింగ్ ఇస్తుంది. నీ కూతురికి ఇంత కష్టంగా ఉంటే.. ఆ కష్టాన్ని చూసి మీ కన్నపేగు మెలితిరిగిపోతుంటే.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటారు. తీసుకోని పోండి అని అపర్ణ ఫైర్ అవుతుంది.
పుట్టింటికి కావ్య...
ఆ మాటతో కనకం నా కూతురిని పంపించండి.. ఇప్పుడే పంపించండి అని అరుస్తుంది. ఇంతలో కావ్య ఎంట్రీ వచ్చి... అమ్మా అని గట్టిగా అంటుంది. చూస్తుంటే కనకంనే కావ్య మందలించేలా ఉందని అర్థం అవుతుంది. మరి కావ్య పుట్టింటికి వెళ్తుందా.. లేదా అనేది తెలియాలి. మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ ఎవరు.. నిజంగానే రాజ్ కు చీకటి కోణం ఉందా.. ఆ బాబు కన్నతల్లి ఎవరో రాజ్ చెబుతాడా అనేది చూడాలి.
ఏదో ట్విస్ట్...
అసలు రాముడు లాంటి రాజ్... కావ్యకు అన్యాయం చేసి మరో అమ్మాయితో బిడ్డను కన్నాడు అంటే... ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. రాజ్ తప్పు చేయకపోవచ్చని.. ఏదో ట్విస్ట్ ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నారు. మరి మున్ముందు ఆ బిడ్డ ఎవరు.. ఆ బాబుకు తల్లి ఎవరు అనేది మున్ముందు తెలియాల్సి ఉంది. ఏం జరగనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











