Brahmamudi March 23rd భర్త మీద కావ్యకు గుడ్డి నమ్మకం.. దుగ్గిరాల వంశం నుంచి రాజ్ వెలి!
నేటి బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తీసుకువచ్చిన బిడ్డకు తల్లి ఎవరు అంటూ కావ్య నిలదీస్తుంది. అప్పుడే బాబు ఏడుస్తూ ఉండటంతో రాజ్ ఆ బాబును ఎత్తుకుని సమాధానం చెప్పకుండా వెళ్లిపోతాడు. మరోవైపు కనకం తన కూతురుకి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంది. దీంతో అప్పుడే అపర్ణ వచ్చి ఫైర్ అవుతుంది. ఇది మా ఇంటి సమస్య మేం తీర్చుకుంటామని చెప్తుంది. మీ కూతురు వల్లే మా ఇంటికి అరిష్టం అంటూ అపర్ణ నానా మాటలు అంటుంది. దీంతో కనకం నా కూతురిని నాతో పంపించండి అంటూ అరుస్తుంది.
అప్పుడే అమ్మ అంటూ కావ్య వచ్చి నా తప్పేంటో ఆయన్ని అడగాలి కదా అంటూ మాట్లాడుతుంది. అప్పటి వరకు నేను బయట అడుగుపెట్టను. ఈ దుగ్గిరాల వంశం ఏం సమాధానం చెప్తుందో తెలిసేవరకు నేను ఈ ఇంటిని వదిలిరాను అని చెప్తుంది. మరోవైపు అనామిక, రాహుల్, రుద్రాణి.. రాజ్ సామ్రాజ్యం కూల్చాలి అంటూ మాట్లాడుకుంటారు. అప్పుడు ధాన్యలక్ష్మి విని రివర్స్ అవుతుంది. నీ కొడుకు గురించే ఇలా చేస్తున్నామంటూ ఆమె మనసును మార్చుతారు.

మరోవైపు కావ్యకు ఇందిరాదేవి సారీ చెప్తుంది. మీరు చేసింది ఏముంది అని కావ్య అడుగుతుంది. చేయగలిగింది ఏం లేదు అందుకే అంటుంది. ఇప్పుడు ఈ కుటుంబంలో నీకు సాయం చేయడానికి ఏమి మిగలేదు అంటూ మాట్లాడుతుంది ఇందిరాదేవి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కాదనే శక్తి ఎవరికి లేదు అని చెప్పేసి వెళ్లిపోతుంది. మరోవైపు కృష్ణుడి వద్ద కావ్య మొర పెట్టుకుంటుంది. ఆయనకు పుట్టిన బిడ్డ కాదు అని నమ్ముతుంది.
రాజ్ తప్పు చేయడని ఇందిరాదేవికి చెప్తుంది. ఆయన తప్పు చేశారంటే నేను నమ్మలేను.. ఆయనే చెప్పినంత మాత్రన అది నిజం అయిపోవాలని లేదు అంటుంది. భర్త మీద కావ్యకు ఉన్న నమ్మకం చూసి ఇందిరాదేవి షాక్ అవుతుంది. నా మనవడిపై ఎందుకు అంత నమ్మకం అని అడుగుతుంది. దానికి ఎవరికైనా ఆపద వస్తే ముందుండే ఆయన, నేను ఖాళీ కడుపుతో పడుకుంటే ప్రేమను చూపించే ఆయన అలాంటి తప్పు చేశారంటే నేను నమ్మను అంటూ కావ్య చెప్పుకువస్తుంది.
మరోవైపు అపర్ణ.. రాజ్ మీద ఫైర్ అవుతుంది. రాజ్ తన తప్పు సరిదిద్దుకోవడానికి ఆ బిడ్డను వాడి తల్లి దగ్గరే వదిలేసి రా అని చెప్తుంది. నేను వీడిని తండ్రిని లేని అనాధలా వదిలి పెట్టలేను.. అని రాజ్ తల్లి అపర్ణకు నో చెప్తాడు. దీంతో నిన్ను నీ బిడ్డను ఈ దుగ్గిరాల ఇంటి వారసులుగా గుర్తించరు అంటూ అపర్ణ ఆదేశిస్తుంది. మరి రాజ్ ఏం చేశాడు... నిజంగానే ఆ బిడ్డను వదిలేశాడా.. లేదా దుగ్గిరాల వంశం వారసుడి స్థానం నుంచి తప్పుకున్నాడా అనేది తెలియాలంటే ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











