Karthika Deepam 2 March 25th: బుల్లితెరపైకి మళ్లీ వంటలక్క- డాక్టర్‌బాబు.. ఫస్ట్ ఎపిసోడ్​లో జరిగేది ఇదే!

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. అంటూ మరోసారి వంటలక్క, డాక్టర్ బాబు బుల్లితెరపైకి వచ్చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై అలరించిన సీరియల్ కార్తీక దీపం. ఇప్పుడు ఆ సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం ఇది నవ వసంతం తెరకెక్కుతుంది. మరోసారి ఇంటిల్లిపాదిని టీవీకి అతుక్కునేలా చేసేలా మేకర్స్ గట్టి ప్లాన్, స్క్రిప్టు, స్క్రీన్ ప్లేతో వస్తున్నారు. కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం నుంచి స్టార్ మాటీవీలో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కానుంది. అయితే మొదటి ఎపిసోడులో ఏం జరగనుంది.. ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరోసారి బుల్లితెరపైకి...:మరోసారి మ్యాజిక్ చేసేందుకు డాక్టర్ బాబు, వంటలక్క కలిసి ఈ సారి కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ తో రాబోతున్నారు. మొదటి సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఒక్క ఆడవారినే కాదు.. మగవారిని సైతం టీవీల ముందు కూర్చొబెట్టింది కార్తీక దీపం. అలాంటి సీరియల్ కు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. టీవీ చరిత్రలో ఏ సీరియల్ చేయని ప్రమోషన్స్ మొదలు పెట్టారు టీమ్.

March 25th 2024 Episode Number 1 in Karthika Deepam 2 Telugu Serial

సూపర్ రెస్పాన్స్...:ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రీల్స్ ఆకట్టుకుంటున్నాయి. కార్తీక దీపం నుంచి విడుదల అయిన పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది. మరోసారి వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ కనిపించనుంది. డాక్టర్ బాబుగా నిరూపమ్ పరిటాల నటిస్తున్నారు. శౌర్య పాత్రలో చైత్రలక్ష్మి నటించగా.. మోనిత పాత్రలో మరో కొత్త అమ్మాయి నటిస్తుంది. అచ్చం మోనిత చెల్లెలిలా ఉందంటూ ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయి. ఇక మొదటి ఎపోసోడ్ సోమవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.

మొదటి ఎపిసోడ్ స్టోరీ ఇదే...:ఇక మొదటి ఎపిసోడులో దీప గెటప్పూ మొదటి సీరియల్ మాదరిగానే కనిపించనుంది. ఆమె ఈ కథలో కూడా వంటలక్కగానే కనిపిస్తుంది. సీరియల్ స్టార్టింగ్ లో సైకిల్ మీద టిఫిన్స్ కట్టుకుని ఎంట్రీ ఇస్తుంది వంటలక్క. ఆమె టిఫిన్స్ కోసం కూలీలు, పనివాళ్లు ఎదురుచూస్తుంటారు. ఇక సైకిల్ దిగిన దీప.. వారి ఆకలిని తీర్చుతుంది. ఆ తర్వాత సీరియల్లోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తారు మేకర్స్. దీప కూతురుగా శౌర్యగా చిన్నారి చైత్ర లక్ష్మి కనిపిస్తుంది. శౌర్యను స్కూల్లో దింపి.. డాక్టర్ బాబు ఇంటికి పనికి వెళ్తుంది. మరి అక్కడ ఆ ఇంట్లోని పాత్రలను పరిచయం చేస్తారు.

March 25th 2024 Episode Number 1 in Karthika Deepam 2 Telugu Serial

సైకిల్ గెలుచుకుని...:అందులో ఒక లేడీ విలన్ ( ఈ సీరియల్లో మోనిత) ఉంటుంది. ఇక కూతురు శౌర్యను దీప జాతరకు తీసుకుపోతుంది. అక్కడ సైకిల్ చూసిన శౌర్య.. తనకు కొనమని పట్టుబడుతుంది. అయితే అప్పటికే శౌర్య కోసం సైకిల్ కొనేందుకు డబ్బులు దాచుకున్న వంటలక్క.. ఆమె అత్త వాటిని లాగేసుకుంటుంది. తన కూతురి కోరిక తీర్చలేకపోయినందుకు బాధపడుతుంది. ఇక ఆ జాతరలో ఓ సైకిల్ పోటీ నిర్వహిస్తారు. అందులో వంటలక్క పాల్గొంటుంది. మగాళ్లతో పోటీ పడి తొక్కి ప్రైజ్ గా చిన్న సైకిల్ ను గెలుచుకుంటుంది. ఇక ఇక్కడే డాక్టర్ బాబు ఎంట్రీ ఇస్తాడు.

డాక్టర్ బాబు ఎంట్రీ...:ఆ పందెంలో గెలిచిన వాళ్లకి కార్తీక్ చేతుల మీదుగా గిఫ్ట్ అందించాలని ఊరి పెద్దలు పిలుస్తారు. దీంతో డాక్టర్ బాబు దీపకు సైకిల్ అందించబోతుంటే.. అతన్ని చూసి షాక్ అవుతుంది దీప. ఇకదీప కోపంగా కార్తీక్ వైపు చూసి.. అయిష్టంగానే ఆ సైకిల్‌ని అతని దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆ సమయంలో కార్తీక్ మాట్లాడుతూ.. 'నేను ఆ తప్పు చేయలేదు దీపా' అని అంటాడు. 'నేను క్షమించలేను బాబూ' అని వంటలక్క అనేసి వెళ్లిపోతుంది. ఇవండి కార్తీక దీపం 2 మొదటి ఎపిసోడ్ హైలెట్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X