Brahmamudi March 25th ఆ నిజం తెలిసేవరకు నేను వెళ్లను.. రాజ్‌కు షాకిచ్చిన కావ్య!

నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య.. బాబు కోసం పాలు తీసుకుపోతుంటే అపర్ణ ప్రశ్నిస్తుంది. దానికి తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోలేని తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి.. కానీ డబ్బుతో నిజాన్ని పాతిపెట్టకూడదని కావ్య మాట్లాడుతుంది. నేను కావాలనుకుంటే నాకు కావాల్సినవి నా కాళ్ల దగ్గరకు తెప్పించుకునేదాన్ని అంతే కానీ నాకు డబ్బు మీద, ఆస్తుల మీద ఇక్కడున్న వాళ్లకు ఉన్నంత ఆశ లేదని చెప్తుంది. ఇప్పుడు మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే మీ అబ్బాయి చేసిన తప్పు గురించి ఆలోచించండని అంటుంది.

అర్థం కావడానికి ఈ జన్మ సరిపోదు:అంతే కానీ ఆ పసివాణ్ని నేను బాధపెట్టలేను అంటూ కావ్య... అపర్ణకు చెప్తుంది. అప్పుడే వచ్చిన ఇందిరాదేవి... శభాష్‌ కావ్య నా మనవరాలు అనిపించుకున్నావని అంటుంది. గొప్పగా ఆలోచించాలి అంటే ఇలాంటి గొప్ప ఇంట్లో ఉంటేనో గొప్ప కుటుంబంలో పుడితేనో రాదని చెప్తుంది. అంటే వదిన నిర్ణయాన్ని నువ్వు కూడా తప్పు పడుతున్నావా అమ్మ అని రుద్రాణి అడుగుతుంది. రాజ్‌ చేసిన తప్పుకు పసివాణ్ని బాధపెట్టకూడదు. కావ్య ఎంత గొప్పగా ఆలోచించిందో మీకు అర్థం కావడానికి ఈ జన్మ సరిపోదు. కావ్య నువ్వేమి చేసినా నేను నీకు తోడుగా ఉంటానని ఇందిరాదేవి చెప్తుంది.

March 25th 2024 Episode number 366 in Brahmamudi Telugu Serial

బాబుకు పట్టడానికి కావ్య పాలు:ఇందిరాదేవి చెప్పగానే కావ్య వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి వారసుడు వచ్చిన వేళ నీ మాటకు విలువ పడిపోతుంది వదిన అంటూ అపర్ణకు చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు పైన బాబుకు పట్టడానికి కావ్య పాలు తీసుకుని వచ్చి రాజ్‌ చేతికి ఇస్తుంది. పాలు పట్టిస్తూ కావ్యకు థాంక్స్‌ చెప్తాడు రాజ్. మీరు థాంక్స్‌ చెప్పడం వల్ల నాకు ఒరిగేదేంటని అడుగుంది కావ్య. అది నా బాధ్యత అని రాజ్ అనగా.. ఆ బాధ్యత పక్కన పెట్టుకున్నారు కదా అని కావ్య అంటుంది.

డైవర్స్‌ పేపర్స్‌ మీద సంతకం:నువ్వు కాస్త పంచుకున్నావు కదా అని రాజ్ అంటాడు. పంచుకున్నాను కదా అని పెంచుకోలేనని చెప్తుంది కావ్య. నువ్వు ఆశించే జవాబు నా నుంచి రాదు అంటూ రాజ్‌ అనగానే కావ్య ఏడుస్తూ తన బాధని మరోసారి రాజ్ తో చెప్తుంది. భూదేవిలోనూ భూకంపం వస్తుంది అంటూ కావ్య చెప్పగానే.. కష్టాన్ని నష్టాన్ని నీకు రాకుండా చేస్తాను అంటూ రాజ్‌ డైవర్స్‌ పేపర్స్‌ మీద సంతకం చేసి ఇస్తాడు. దీంతో కావ్య షాక్‌ అవుతుంది.

సంతకాలు అవసరమా అంటూ:ఈ నరకం నుంచి విముక్తి పొందే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందని రాజ్ అంటాడు. ఇన్నాళ్లు ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వచ్చానని.. ఇప్పుడు నీ జీవితం నీది ఈ నిర్ణయం నీది... వీడ్కోలు చెప్పుకోవడం తప్పా నిన్ను ఆపే శక్తి నాకు లేదని రాజ్ చెప్తాడు. పూర్తయిందా? నీ బాధ్యత తీరిపోయిందా? నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోవాలంటే ఈ కాగితాలు సంతకాలు అవసరమా అంటూ కావ్య ఆవేదన చెందుతుంది. నువ్వు కోరుకున్నదే కదా అని రాజ్ అంటాడు.

March 25th 2024 Episode number 366 in Brahmamudi Telugu Serial

ఆ తల్లి తల్లిగా ఎలా మారింది:నేను కోరుకున్నవన్నీ చేశారా అని కావ్య నిలదీస్తుంది. అసలు ఏం అనుకుంటున్నారు. మీరు ఉండమంటే ఉండాలి మీరు పొమ్మంటే పోవాలి. అన్నింటికీ తలవంచాలి లేదంటే విడాకులు తీసుకోవాలి అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. నేను ఇలా వెళ్లను. ఇంత సింపుల్‌గా తెగదెంపులు చేసుకుని నేను వెళ్లనని తెగేసి చెబుతుంది. ఈ బిడ్డకు తల్లి ఎవరో తెలియాలని అంటుంది. తాళి కట్టిన భార్య ఉండగా ఆ తల్లి తల్లిగా ఎలా మారిందో తెలియాలని చెప్తుంది.

అపర్ణ వచ్చి అనామికపై ఫైర్:ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికిన రోజు నేను వెళ్లాలో ఇక్కడే ఉండి పోవాలో నిర్ణయించుకుంటాను. అప్పటి వరకు నన్ను వెళ్లమనే అధికారం మీకు లేదని చెప్పేసి పేపర్స్‌ రాజ్‌ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు అనామిక వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసి ఇంట్లో జరుగుతున్న విషయాలు మొత్తం చెప్తుంది. అది విన్న అపర్ణ వచ్చి ఫోన్‌ లాక్కుంటుంది. ఇంట్లో విషయాలు ఎందుకు చెప్తావని కోప్పడుతుంది. రుద్రాణి చూసి ధాన్యలక్ష్మిని తీసుకొస్తుంది.

ధాన్యలక్ష్మి కూడా:ధాన్యలక్ష్మీ కూడా అనామికను తిడుతుంది. ఇంటి పరువు బజారున పడేస్తావా? అంటూ నిలదీస్తుంది. అపర్ణను కూడా నిలదీస్తుంది. అనామికను తిడితే సమస్య పరిష్కారం అవుతుందా అంటూ అడుగుతుంది. అపర్ణ, అనామిక వెళ్లాక రుద్రాణి నువ్వేంటి నువ్వు మీ తోడికోడలును తిట్టకుండా నీ కోడలును తిట్టావేంటి అని అడుగుతుంది. నేను నీ రూట్‌లోనే వెళ్తున్నాను రుద్రాణి అంటూ ధాన్యలక్ష్మీ చెప్పతుంది. తదుపరి ఎపిసోడ్ లో రాజ్ భోజనం చేస్తుంటే అపర్ణ వెళ్లిపోబోతుంది. ఇంతలో నేనే వెళ్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. కావ్య రాజ్ కోసం భోజనం తీసుకుపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X