Karthika Deepam 2 : సీరియల్‌కి 'అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో' స్టోరీ టచ్.. ఇదెక్కడి ట్విస్ట్ రా!
Karthika Deepam 2 Serial March 26th Episode బుల్లితెర బహుబలి సీరియల్ కార్తీక దీపం మళ్లీ వచ్చేసింది. ఈసారి మరింత కొత్తగా.. మన డాక్టర్ బాబు, వంటలక్క కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. కార్తీకదీపం ఇది నవ వసంతం అంటూ.. కొత్త పాత్రధారులతో కొత్త కథతో అలరించబోతుంది. ఎట్టకేలకు స్టార్ మాటీవీలో రాత్రి 8 గంటలకు మొదటి ఎపిసోడ్ ప్రసారం అయింది. ఫస్ట్ ఎపిసోడ్ హైలెట్స్, తదుపరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొత్త నటీనటులతో ప్రారంభం...
కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ అదేనండి.. కార్తీక దీపం ఇది నవవసంతం పేరుతో బుల్లితెరపై మళ్లీ సందడి చేస్తుంది. ఇక ఈసారి తమిళ సీరియల్ చెల్లెమ్మకు రీమేక్ గా ఈ ధారావాహికను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సీరియల్లో వంటలక్కగా మరోసారి ప్రేమి విశ్వనాథ్, కార్తీక్ గా నిరూపమ్ పరిటాల, జ్యోత్స్నగా ( కార్తీక్ మరదలు) గాయత్రి సింహద్రి, దీప కూతురుగా శౌర్య( చైత్రలక్ష్మి) నటిస్తున్నారు. ఇక కొత్త నటీనటులు ఇందులో కనిపించనున్నారు.

సినిమాను తలపించిన సీరియల్...
ఇక మొదటి ఎపిసోడ్ ఆధ్యంతం సినిమాను తలపించింది. ఒక వర్షం కురిసిన రాత్రి.. ఆసుపత్రిలో సుమిత్రి (కార్తీక్ అత్త) ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఆమెనే దీప. అయితే పారిజాతం (కార్తీక్ ఈమె మనవడు) తన భర్త మీద కోపంతో.. ఆ బిడ్డ స్థానంలోకి తన మొదటి భర్త కొడుకు బిడ్డను ( జోత్స్న) మార్చతుంది. ఇక సుమిత్రికి పుట్టిన దీపను చంపేయమని ఓ వ్యక్తి ఇచ్చి పంపిస్తుంది. అతని మీద నమ్మకం లేక మరో వ్యక్తిని కూడా పారిజాతం వెనకలా పంపిస్తుంది.
వారసురాల మార్పిడి...
పారిజాతం పంపించిన ఆ వ్యక్తి ఆ బిడ్డను చంపలేక.. చెత్త కుండి పక్కన పడేసి వెళ్లిపోతాడు. ఇంతలో లారీతో గుద్ది చంపేస్తాడు పారిజాతం మనిషి. ఇక ఈ సీన్స్ అన్నింటినీ గమనిస్తూ ఉంటాడు పారిజాతం మొదటి భర్త కొడుకు. అయినా సైలెంటుగా ఉండిపోతాడు. ఇక ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోని వారంతా సంతోషిస్తారు. కార్తీక్ కు భార్య పుట్టిందని అనుకుంటారు. అయితే అసలు వారసురాలు మాత్రం బయట మరోవ్యక్తి దగ్గర పెరుగుతూ ఉంటుంది.
దీప స్థానంలోకి జ్యోత్స్న...
పాప చనిపోయిందని పారిజాతం సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో తన కొడుక్కి ఇదంతా తెలిసినా సైలెంటుగా ఉండిపోతాడు. కారణం తన కూతురు పెద్దింట పెరుగుతుందని సంతోషపడిపోతాడు. మరోవైపు శివరామాయ్య( పారిజాతం రెండో భర్త) తనకు మనవరాలు పుట్టిందని సంతోషపడిపోతుంటాడు. ఇక దీపను పెంచుకునే వ్యక్తి... వంటలు చేసే వ్యక్తి (అతని పేరు కుబేరా). తన భార్య చనిపోతుంది. తన అక్కను పిలిచి.. ఈ పాపను పెంచుకుంటానని చెప్తాడు.
వంటలక్కగా మారిన దీప...
దీని వల్లే నీ భార్య చనిపోయింది.. అంటూ నానా మాటలు అంటుంది. లేదు నా కూతురుగా నా వద్దే పెరుగుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకుంటాడు కుబేరా. ఇక ఇటు దీపకు అన్నప్రాసన చేస్తుంటారు. మరోవైపు జోత్న్సకు కూడా అన్నప్రాసన చేస్తుంటారు. దీప పుస్తకాలు పట్టుకోవాలని కుబేరా అనుకుంటాడు. కానీ తన అక్క తెచ్చిన గరిటెను పట్టుకుంటుంది. అలా వంటలక్క అవుతుంది.
దీప, జోత్స్న జీవితాలు...
మరోవైపు జోత్స్న కార్తిక్ ను పట్టుకోవాలని అంతా అనుకుంటారు. అప్పుడే పారిజాతం లిప్ స్టిక్ తీసి రాసుకుంటుంటే.. తన భర్త అరవడంతో.. అది జారి అక్కడపడిపోతుంది. ఇక ఆ పాప దాన్ని పట్టుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. ఒక్క పారిజాతం తప్ప. నా మనవరాలు నాకు నచ్చింది పట్టుకుందని అనుకుంటుంది. అలా దీప, జోత్న్స జీవితాలు ప్రారంభం అవుతాయి. వీరు పెద్దవారు అవుతుంటారు.
అల్లుఅర్జున్ అలా వైకుంఠపురంలో...
ఇక ఈ స్టోరీ అంతా చూస్తుంటే.. అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమా గుర్తుకు వస్తుంటుంది. అందులో కూడా అల్లు అర్జున్ స్థానంలో సుశాంత్ పెరుగుతూ ఉంటాడు. ఇప్పుడు దీప స్థానంలో జోత్స్న పెరుగతుందన్నమాట. అయితే ఇదంతా చూస్తుంటే.. ఈ సీరియల్లో దీప.. కార్తీక్ కు మరదలి క్యారెక్టర్ చేయబోతుంది. అయితే ఆమె ప్లేస్ ను జోత్స్న కొట్టేసింది. మరి ముందు ముందు ఏం జరగనుందో చూడాలి


Click it and Unblock the Notifications











