Brahmamudi March 26th సొంతిట్లోనే రాజ్‌కు అడుగడుగునా అవమానాలు.. దుష్ట చతుష్టయం కడుపుమాడ్చిన ప్రకాశం!
బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడులో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. తినకుండా రాజ్ కోసం ఎదురుచూస్తుండగా... ఇంతలో రుద్రాణి అందరి ముందుకు రాలేక రాజ్ రూంలోనే ఉండిపోయాడేమోనని దెబ్బిపొడుస్తుంది. అందరూ నీ కొడుకులాగా దులిపేసుకోలేరు అంటాడు ప్రకాశం. ఇంతలో రాజ్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తనకు తానే వడ్డించుకుంటుంటే.. తొందరగా వడ్డించుకో రాజ్ ఇలాంటి సమయంలోనే గబగబా తినాలని అంటుంది. ఎందుకంటే బాబు లేస్తాడు. లేస్తే ఏడుస్తాడు. ఏడిస్తే ఎత్తుకోవడానికి వాడి కన్నతల్లి ఇక్కడ లేదుగా అని వెటకారం చేస్తుంది.
కొడుకుపై అపర్ణ ఆగ్రహం...:రుద్రాణి మాటలకు అపర్ణ లేచి వెళ్లబోతుంది. అపర్ణ చేయి పట్టుకుని రాజ్ అపుతాడు. మమ్మీ భోం చేసి వెళ్లు అని రాజ్ అనగా.. రుద్రాణి మాటలతో నా కడుపు నిండిపోయిందని అపర్ణ అంటుంది. నీలాంటి వంశోద్దారకుణ్ని కన్నందుకు నాకింకా ఎన్ని అవమానాలు జరుగుతాయే తెలియక కడుపు రగిలిపోయి ఆకలి చచ్చిపోయిందని చెప్తుంది. మమ్మీ ఎవరి మీదో కోపం అన్నం మీద చూపించకూడదని నువ్వేగా చెప్పావని రాజ్ అంటాడు. నేనింకా చాలా చెప్పాను తప్పు చేయకూడదని చెప్పాను... ఇంటి పరువు తీయకూడదని చెప్పాను... వంశ గౌరవం నిలబెట్టాలని చెప్పానని అంటుంది అపర్ణ.

భోజనం చేయకుండానే రాజ్ :నేను భోజనం చేయడం మీకెవ్వరికీ నచ్చకపోతే.. నావల్ల మీరెందుకు అన్నం మానేయాలి. నేనే వెళ్లిపోతానని రాజ్ వెళ్లిపోతాడు. ఇప్పుడు కొడుకు తినకుండా పోయాడని మా వదిన కన్నపేగు కదిలిపోయి తను తినడం మానేస్తుందేమోనని రుద్రాణి అంటుంది. అపర్ణ తినకుండా వెళ్లిపోతుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు లేచి వెళ్లిపోతారు. ధాన్యలక్ష్మీ మాత్రం తనకు బాగా ఆకలేస్తుందని తినబోతే ప్రకాష్ తిడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, అనామిక కూడా తినకుండా వెళ్లిపోతారు. తర్వాత కావ్య ప్లేట్ లో భోజనం రాజ్‌కు తీసుకెళ్తుంటే అపర్ణ వచ్చి ఆపుతుంది.
రాజ్ కోసం కావ్య భోజనం..:ఇలా చేయడం కరెక్టు కాదని కావ్య చెప్పి భోజనం తీసుకుని వెళ్తుంది. నాకు ఆకలిగా లేదని రాజ్ అంటే.. ఇది పాత సినిమాల డైలాగ్ అని కావ్య అంటుంది. నీకు నా కథ సినిమాలా ఉందా అని రాజ్ అంటాడు. ఆకలిగా లేదన్నమాట లక్షసార్లు విన్నట్టే ఉంది. ఓ బిడ్డను ఎత్తుకొచ్చి వీడు నా బిడ్డ అన్నాక ఏ పెళ్లానికైనా మొగుడి మీద సానుభూతి ఉంటుందా? నోరు మూసుకుని తినండని కావ్య అంటుంది. ప్లేట్ తీసి రాజ్ చేతిలో పెడుతుంది కావ్య. రాజ్ తింటుంటే కావ్య చూస్తుంది.
ఇంట్లో వాళ్లను బాధపెడుతూ...:రాజ్ తిన్నాక ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఇంట్లో వాళ్లను ఎందుకు బాధపెడుతున్నారు. ఎవరిని బాధపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదని అంటాడు రాజ్. మరి ఇందులో ఏదైనా లోక కళ్యాణం ఉందా అని అడుగుతుంది కావ్య. నాకు ఇంకో దారి లేదని చెప్తాడు రాజ్. మీ దారిలో మీకు మీ కుటుంబం ఉంది. అది మర్చిపోతున్నారని కావ్య అంటుంది. అలాగని నా బాధ్యత నేను వదిలేసుకోలేనని చెప్తాడు రాజ్. మీరిలా గదిలో కూర్చుని బాధపడుతూ ఇంట్లో వాళ్లను కూడా బాధపెడుతున్నారని కావ్య అంటుంది.

ఆన్ లైన్ లో ఆర్డర్...:ఇవాళ ఎవరూ భోజనం చేయలేదు దానికి కారణం మీరే కదా? కనీసం వాళ్ల గురించైనా ఆలోచించి నోరు తెరచి నిజం ఏంటో చెప్పండని కావ్య అంటుంది. రాజ్ కోపంగా నువ్వు నాతో మాట్లాడటానికే భోజనం తెచ్చావా అంటూ కోప్పడి గుడ్‌నైట్ అంటూ నిద్రపోతుంటే.. ఎన్నాళ్లీ నిజం నిద్రపోతూనే ఉంటుంది అంటూ కావ్య అడిగినా చెప్పకుండా నిద్రపోతాడు రాజ్. మరోవైపు ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామికలు అందరూ ఆకలి వేస్తుందని బాధపడుతుంటారు. ఇంతలో రాహుల్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశానని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు.
ప్రకాశం మతిమరుపుతో...:ఇంతలో డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకుని వస్తాడు. బయట ఫోన్ మాట్లాడుతున్న ప్రకాశం.. డెలివరీ బాయ్‌ని ఎం తీసుకొస్తున్నావు అంటూ అడగ్గానే ఫుడ్ తీసుకొస్తున్నానని చెప్తాడు. ఎవరు ఆర్డర్ చేశారని ప్రకాశ్ అడుగుతాడు. రాహుల్ అని డెలివరీ బాయ్ చెప్పగానే రాహుల్ ఎవరూ ఈ ఇంట్లో లేరని ఆ ఫుడ్ నువ్వే తినమని సుభాష్ చెప్పి లోపలికి వెళ్తాడు. లోపల ఉన్న ఫుడ్ కూడా తీసుకువచ్చి డెలివరీ బాయ్‌కి ఇస్తాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
తదుపరి ఎపిసోడులో బాబు ఏడుస్తుంటే.. పాలు తాగమని రాజ్ అంటాడు. వాడి వయసుకు పాలు తాగితేనే బొజ్జ నిండదు ఉగ్గు తినిపించాలని కావ్య చెప్తుంది. ఇప్పుడేం చేయాలో చెప్పు అని కావ్యను అడిగితే... ఇప్పుడే వస్తానని కావ్య వెళ్లిపోతుంది. కల్యాణ్ తో కలిసి ఉగ్గు కొనుక్కోని వస్తుంటే.. ఇంట్లో వాళ్లంతా చూస్తారు.


Click it and Unblock the Notifications











