Karthika Deepam March 27th: అసలు ఈ శౌర్య ఎక్కడ నుంచి వచ్చింది.. దీప భర్త కార్తీక్ కాదా?

Karthika Deepam 2 Serial March 27th Episode: నేటి కార్తీక దీపం ఇది నవ వసంతం ఎపిసోడులో దీప జీవితం పారిజాతం కుట్రతో తలకిందులు అవుతుంది. సిరి సంపదలతో ప్రకాశించాల్సిన దీప బాల్యం మంచి మనసు ఉన్న కుబేర్ ఇంట్లో కళకళలాడుతోంది. దీప ఆలోచన వల్ల కుబేర్ తలరాత మారింది. కుబేర్ హోటల్ నడుపుతూ ఉంటారు. ఇక ఆరోజు టిఫిన్ చేసిన వారి పేర్లను ఓ సీసాలో వేస్తారు. ఇక సైకిల్ మీద దీప ఎంట్రీ వస్తుంది. రా అమ్మ నీ చేతులతో చీటీ తీసి తిన్న వారిలో విజేత ఎవరో తేల్చాలని కుబేర్ అంటాడు.

అమ్మ జ్ఞాపకంగా దీప మెడలో చైన్...

దీప ఓ వ్యక్తి పేరు ప్రకటిస్తుంది. అందరూ సంతోషిస్తారు. ఈ స్క్రీమ్ బాగుందని ప్రశంసిస్తారు. దీంతో నాదేం లేదు.. దీప తల్లే ఈ స్కీమ్ పెట్టింది. ఇక దీపను కలెక్టర్ చేయాలని.. చదువుకోమని దీపకు చెప్తాడు. దీప మెడలో చైన్ జడకు తట్టుకుంటే.. కుబేర్ పిలిచి మరీ దాన్ని సెట్ చేసి పంపిస్తాడు. అది మీ అమ్మ జ్ఞాపకంగా ఉండాలని నీ మెడలో వేశాను అంటూ చెప్తాడు. ఇక దీప పాఠశాలకు వెళ్తుంది.

March 27th 2024 Episode Number 3 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

నీళ్లలో పడిపోయిన కార్తీక్...

మరోవైపు కార్తీక్, జోత్న్స పెరిగి పెద్దవారు అవుతుంటారు. సుమిత్ర వారిని గుడికి తీసుకుపోతుంది. అక్కడ జ్యోత్స్న ఓ కలువ పువ్వును చూసి కార్తిక్ ను తీసుకురమ్మని చెప్తుంది. అయితే తనకు నీళ్లంటే భయం అంటూ చెప్తాడు. అయినా సరే జ్యోత్న్స బలవంతం చేయడంతో నీళ్లలోకి కార్తీక్ దిగుతాడు. నీటిలో మునిగిపోతాడు. ఈ విషయాన్ని సుమిత్రకు చెప్తుంది జ్యోత్స్న. ఇక అటుగా వెళ్తున్న దీప చూసి.. కార్తీక్ ను కాపాడి బయటకు తీస్తుంది.

తల్లిని కలిసిన దీప...

ఇక దీపకు తెలియకుండానే తన వాళ్లను కలుసుకుంటుంది. సుమిత్ర వచ్చి.. ఎందుకు అందులో దిగావ్ అంటూ మేనల్లుడిపై కోప్పడుతుంది. జ్యోత్న్స కలువ పువ్వు కావాలని అడిగిందని చెప్తాడు. దీంతో జ్యోత్స్నపై అరుస్తుంది సుమిత్ర. ఆ తర్వాత దీపను చూసి నా మేనల్లుడిని కాపాడావు.. అంటూ చేతులు పట్టుకుంది. దీప అమ్మ అంటూ పిలువగానే పరవశించిపోతుంది. నువ్వు చేసిన సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని సుమిత్ర అంటుంది.

కార్తీక్ ను కలిసిన దీప...

ఇక డబ్బులు తీసి దీపకు ఇవ్వబోతుంటే.. వద్దని చెప్తుంది. నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోను అంటుంది దీప. ఇక దీప కలువపువ్వులను కార్తీక్ కు ఇవ్వబోతుంటే లాక్కుంటుంది జ్యోత్స్న. ఇక దీప తన సైకిల్ తీసుకుని వెళ్తుంటే.. కార్తీక్ వచ్చి ఆగమని చెప్తాడు. కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. నేను కూడా ఏదో ఒకరోజు సాయం చేస్తా అంటూ చెప్తాడు. నీ పేరేంటి అని దీప అడగ్గా.. కార్తీక్ అని చెప్తాడు. మళ్లీ మనం కలుస్తామా అని కార్తీక్ అడగ్గా.. చూద్దామని దీప అంటుంది.

దీప చైన్ కార్తీక్ వద్ద...

కార్తీక్ కారులో వెళ్లిపోతాడు. మరోవైపు దీప తన గొలుసు లేదని చూసుకుంటుంది. ఇక మరోవైపు కార్తీక్ పాకెట్లో దీప చైన్ ఉంటుంది. తనదే అయి ఉంటుందా అని అనుకుంటాడు కార్తిక్. మరోవైపు దీప చదువుకుంటూ ఉంటుంది. కుబేర్ దీపను చూసి నీ గొలుసు ఏది అంటూ అడుగుతాడు. ఓ అబ్బాయిని కాపాడినప్పుడు పోయిందని చెప్తుంది. ఇంతలో తన అత్త వచ్చి.. నీ తండ్రి గొడ్డులా కష్టపడుతుంటే.. నువ్వు దర్జాగా తిని చదువుతున్నావా అంటూ తిడుతుంది.

వంటలక్కగా మార్చిన అత్త...

నీ చదివించడానికి నా తమ్ముడు చచ్చేలా ఉన్నాడు అంటూ నానా మాటలు అంటుంది. దీంతో దీప బాధపడుతుంది. తన అక్కను పక్కకు తీసుకుని పోయి కుబేర్ తిడుతాడు. చదవకపోతే.. మంచి సంబంధాలు రావని కుబేర్ అంటే.. నా కొడుకు ఉన్నాడుగా చేసుకుంటాడు అంటూ మాట్లాడుతుంది. వాడా.. నా కూతురికి ఇవ్వను అంటూ కుబేర్ అంటాడు. ఇక తన కొడుకు నర్సింహకు దీపను ఇచ్చి చేయాలని నిర్ణయించుకుంటుంది కుబేర్ అక్క అనసూయ.

చదువు మానేసి...

మరోవైపు దీప తన పుస్తకాలను తీసుకుని పోయి.. వేరే అమ్మాయికి ఇస్తుంది. ఏమైందని అడిగితే.. నేను ఇవాళ్టి నుంచి చదువు మానేశాను అంటూ చెప్తుంది. దానికి కుబేర్ వద్దు.. చదువుకోవాలని అని చెప్తాడు. పట్టు వదలని దీప.. ఇలాగే చేస్తే నేను వెళ్లిపోతాను అంటూ బెదిరిస్తుంది. తప్పని పరిస్థితుల్లో దీప చెప్పిన దానికి ఒప్పుకుంటాడు కుబేర్. దీప తన చదువుకు దూరం అయినా.. కుబేర్ కు సాయంగా మారింది.

దీప సినిమా లెవెల్లో ఎంట్రీ...

ఏళ్లు గడిచాయి.. ఇక దీప కోసం చాలా మంది ఎదురు చూస్తు ఉంటారు. అక్క వస్తుందని అంతా అనుకుంటారు. ఇక దీప సైకిల్ మీద ఫుడ్ క్యారేజ్ లతో ఎంట్రీ ఇస్తుంది. అక్కడ ఉన్నవారికి టిఫిన్స్ పెడుతుంది. దీప ఎంట్రీ ఓ సినిమా లెవెల్లో ఉంటుంది. ఇక అక్కడ ఉన్నవాళ్లంతా తిని దీపకు తోచినంత డబ్బులు ఇస్తారు. ఇక దీప చేసిన పనికి అందరూ మెచ్చుకుంటారు. తను ఎవరికి ఏ కష్టం వచ్చిన ముందుంటుందని అనుకుంటారు. ఆ తర్వాత ఆసుపత్రి వద్ద కూడా టిఫిన్స్ ఫ్రీగా పెడుతుంది.

శౌర్య ప్రశ్నకు సైలెంట్...

మరోవైపు దీప కూతురు శౌర్య స్కూల్లో దీప కోసం ఎదురు చూస్తు ఉంటుంది. టీచర్ వచ్చి క్లాస్ కు రమ్మని అడుగుతుంది. దానికి శౌర్య రాను అంటూ మాట్లాడుతుంది. మా నాన్న దగ్గరకు తీసుకుపోతుందని శౌర్య అంటుంది. ఇంతలో దీప టీచర్ కోసం టీఫిన్ ఇస్తుంది. ఇక శౌర్యతో మనం జాతరకు వెళ్తున్నాం.. అక్కడ సైకిల్ కొంటున్నాం అని అంటే.. మరి నాన్న అని అడుగుతుంది శౌర్య. ఇక సమాధానం చెప్పలేక దీప సైలెంట్ అయిపోతుంది.

జాతరలో సైకిల్ గెలుపు...

ఇక దీప, ఆమె కూతురు శౌర్య కలిసి జాతరకు వెళ్తారు. ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో జాతరలో సైకిల్ కొనుక్కుందాం అనుకుని దాచుకున్న డబ్బును తన అత్త లాక్కుని వెళ్లిపోతుంది. దీంతో తన కూతురికి సైకిల్ కొనివ్వలేదని దీప బాధపడుతుంది. అప్పుడే సైకిల్ పందెలు పెడతారు. అప్పుడు కూతురు శౌర్య.. తన తల్లి దీపను అందులో పాల్గొనమని చెప్తుంది. సైకిల్ పందెల్లో దీప పాల్గొని.. బహుమతిగా చిన్న సైకిల్ ను గెలుచుకుంటుంది.

దీపకు పెళ్లైందా...
అయితే ఆ ఊరి పెద్దలు ఆ బహుమతిని అందించేందుకు కార్తీక్ ను గెస్టుగా పిలుస్తారు. కార్తీక్ ను చూసిన దీప.. కోపంగా మొహం పెడుతుంది. కార్తీక్ కూడా ఏదో గిల్టీగా ఫీల్ అవుతారు. అయితే కార్తీక్ పై దీప ఎందుకు కోపంగా ఉంది.. అసలు దీపకు పెళ్లైందా.. ఆ కూతురికి తండ్రి ఎవరు.. తన తండ్రి కుబేర్ ఏమయ్యాడు అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X