Brahmamudi March 27th కల్యాణ్‌తో కలిసి బయటకెళ్లిన కావ్య.. ఇంట్లో వాళ్ల ముందు అడ్డంగా బుక్!

నేటి బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ తినడానికి వస్తే.. రుద్రాణి సూటి పోటీ మాటలతో అవమానిస్తుంది. దీంతో అపర్ణ తినకుండా వెళ్లిపోతుంటే.. నేనే వెళ్లిపోతాను మమ్మీ అంటూ రాజ్ వెళ్లిపోతాడు. ఇక రుద్రాణి మరోసారి రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఆ తర్వాత అపర్ణ తినకుండా పోతుంది. ఒకరి తర్వాత ఒకరు తినకుండా వెళ్లిపోతారు. చివరకు దుష్టచతుష్టయం( అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మి, రాహుల్) మిగులుతారు. వారిని కూడా తినకుండా చేస్తాడు ప్రకాశం. ఇంట్లోవారంతా పస్తులు ఉంటే.. సిగ్గులేకుండా తినకండి అని చెప్పేసి వెళ్లిపోతాడు.

ఆకలితో చతుష్టయం రోదనలు:ఇక మరోవైపు రాజ్ కోసం కావ్య భోజనం తీసుకుని పోతుంది. అపర్ణ వచ్చి అడ్డుకోగా.. ఇలాగైనా ఆయన నిజం చెప్తాడేమో అని అంటుంది కావ్య. ఇక భోజనం తీసుకుపోగా.. మొదటి వద్దని చెప్తాడు రాజ్. ఆ తర్వాత తింటాడు. ఇక మళ్లీ కావ్య బాబు గురించి ప్రశ్నిస్తుంది. ఇందుకోసమే భోజనం తెచ్చావా అని రాజ్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు. ఆ తర్వాత కావ్య ఎన్నాళ్లు నిజం దాచుతారో దాచండి అంటూ చెప్తుంది. ఇక దుష్ట చతుష్టయం ఆకలితో అలమటిస్తూ ఉంటుంది.

March 27th 2024 Episode number 368 in Brahmamudi Telugu Serial

ఆర్డర్ చేసిన ఆన్లైన్ ఫుడ్ వెనక్కి...:ఇక రాహుల్ ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. డెలివరీ బాయ్ వచ్చే సమయానికి బయట ప్రకాశం ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక డెలివరీ బాయ్ వస్తే.. ఈ ఇంట్లో సిగ్గులేని వారు ఎవరు లేరు.. ఫుడ్ రిటర్న్ తీసుకుపో అని చెప్తాడు. ఇక రుద్రాణి ఇంట్లోని భోజనం చేద్దాంలే అని చెప్తుంది. ఇంతలో లోపలికి వెళ్లిన ప్రకాష్.. ఇంట్లో మిగిలిన ఫుడ్ అంతా డెలివరీ బాయ్ కి ఇచ్చి పంపిస్తాడు. ఇక రాజ్ గదిలో బాబు ఏడుస్తూ ఉంటాడు.

బాబుకి ఉగ్గు పెట్టాలన్న కావ్య..:ఏమైంది నాన్న అంటూ రాజ్ ఆడిస్తూ ఉంటాడు. వాడికి ఆకలి వేస్తుందని కావ్య చెప్తుంది. పాలు ఇస్తే సరిపోదు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని రాజ్ అడుగుతాడు. వాడికి ఉగ్గు తినిపించాలని చెప్తుంది. ఉగ్గా అని ఆశ్యర్యంగా అడుగుతాడు రాజ్. ఇప్పుడేం చేద్దామని అడిగుతాడు రాజ్. కావ్య ఇప్పుడే వస్తానని వెళ్లిపోతుంది. ఇక ఈ విషయాన్ని కావ్య, కల్యాణ్ కి చెప్తుంది. వాళ్లిద్దరూ కలిసి బయటకు వెళ్తారు. పిల్లాడి కోసం ఉగ్గు కొని ఇంటికి వస్తారు.

March 27th 2024 Episode number 368 in Brahmamudi Telugu Serial

ఇంట్లో వాళ్ల ముందు అడ్డంగా బుక్..:వాళ్లు ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని వారంతా హాల్లో ఎదురుచూస్తుంటారు. వాళ్లందరిని చూసి కల్యాణ్, కావ్య షాక్ అవుతారు. వారిపై అపర్ణ, అనామిక కోపంగా చూస్తుంటారు. కల్యాణ్ చేతిలో బాబుకు తినిపించే ఉగ్గు ప్యాకెట్ చూసి.. ఫైర్ అవుతారు. మరోవైపు ఏడుస్తున్న బాబును రాజ్ ఆడిస్తుంటాడు. రాజ్, అతని కొడుక్కి ఎవరు సాయం చెయొద్దని అపర్ణ ఆదేశించింది. మరి కావ్య, కల్యాణ్ సాయం చేయడంపై ఏం జరిగింది.. అపర్ణ వారిని క్షమించిందా.. రాజ్ ఏమైనా అడ్డుకున్నాడా అనేది తెలియాలంటే ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X