Brahmamudi March 28th ఆ బాబు రాహుల్ కొడుకని స్వప్నకి డౌట్.. రాజ్ వల్ల కోటి రూపాయల నష్టం!
నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య బాబు కోసం సేవలు చేస్తూ ఉంటుంది. దానికి రాజ్ థ్యాంక్స్ చెప్తాడు. మీరు థ్యాంక్స్ చెప్తే సంతోషపడే రోజులు పోయాయని చెప్తుంది కావ్య. ఇక మర్నాడు ఉదయం హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. వారికి కాఫీ అందిస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో ఓ డెలివరీ బాయ్ వచ్చి... పార్సిల్ ఇస్తాడు. అది రాహుల్ తీసుకుంటాడు. ఇదేదో ఊయాల లాగే ఉందని అంటాడు రాహుల్. ఇంతలో రుద్రాణి వచ్చి.. వదినా నువ్వే అర్డర్ పెట్టావా అంటే.. అపర్ణ నిన్ను పడుకోబెట్టి ఊగబెడుదామని అంటూ వెటకారం చేస్తుంది.
రుద్రాణి మీద ఇందిరాదేవి ఆగ్రహం...:నువ్వే కదా.. నీ మనవడి కోసం ఆర్డర్ పెట్టిందని అపర్ణను అడుగుతుంది రుద్రాణి. షటప్ రుద్రాణి.. నేను ఎందుకు ఆర్డర్ చేస్తాను అని అంటుంది అపర్ణ. మరి ఎవరు ఆర్డర్ పెట్టారు అని రుద్రాణి అనగానే... రాజ్ నేనే అంటూ బాబును ఎత్తుకుని కిందకు వస్తాడు. ఇక ఊయలను తీసుకుని రాజ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు రుద్రాణి వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో ఇందిరాదేవి... రుద్రాణి మీద ఫైర్ అవుతుంది.

ఊయలలో బాబు...:ఇక రాజ్ బాబును ఊయలలో వేస్తాడు. ఇంతలో రాజ్ కు ఓ కాల్ రాగానే పక్కకు వెళ్తాడు. ఇంతలో రుద్రాణి వాడి తల్లి కావొచ్చు అని మాట్లాడుతుంది. మరోవైపు ఊయలలో ఉన్న బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో స్వప్న వచ్చి... ఆ బాబును ఎత్తుకుంటుంది. ఏమైంది నాన్న అంటూ ఊరుకోబెడుతుంది. ఇంత మంది ఉన్నారు.. బాబు ఏడుస్తుంటే చూడరేంటి అని అడుగుతుంది. ఆ బాబు ఎవరో తెలిస్తే... నువ్వు కూడా మానవత్వాన్ని వదిలేస్తావ్ అంటుంది రుద్రాణి.
స్వప్న ఎంట్రీ.. :ఎవరి కొడుకు అని అడుగుతుంది. రాజ్ కొడుకు అని రుద్రాణి అంటుంది. నిజం చెప్పండి.. రాజ్ కొడకా, రాహుల్ కొడకా అని స్వప్న అంటుంది. దానికి రాహుల్ నేను కాదు.. రాజ్ కొడుకే అని చెప్తాడు. కాసేపటి వరకు స్వప్న అస్సలు నమ్మదు. మా అత్త ఏదో ఏదో వాగుతుంది.. మీరైనా చెప్పండని అరుస్తుంది. దీంతో రాజ్ ఎంట్రీ ఇచ్చి నా బిడ్డే అని బాబును తీసుకుని వెళ్లిపోతాడు. స్వప్న షాక్ అవుతుంది. నీ చెల్లెలికి సవతి యోగం ఉన్నట్లు ఉంది ఆమెనే అడుగు అని రుద్రాణి అంటుంది.

జైలుకుపోతే పరిష్కరం వస్తుందా...:ఇక కావ్యను గదిలోకి తీసుకుని వచ్చి.. ఏం జరుగుతుందని ప్రశ్నిస్తుంది స్వప్న. టిఫిన్ రెడీ చేస్తాను అని కావ్య వెళ్తుంటే... నువ్వు సేవలు చేయ్ అంటూ వెటకారం చేస్తుంది స్వప్న. నీ మొగుడు ఒక బిడ్డను తీసుకువచ్చి నా కొడుకు అని చెప్తే.. నువ్వు చేయాల్సింది ఇదా అని స్వప్న అడుగుతుంది. మరి ఏం చేయమంటావ్ అని కావ్య అంటే.. షర్ట్ పట్టుకుని అడుగు అని ఫైర్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అంటూ రెచ్చిపోతుంది. దీంతో కావ్య.. తను జైలుకు పోతే నా సమస్య పరిష్కరం అవ్వదు అని మాట్లాడుతుంది కావ్య.
అప్పుకు కల్యాణ్ కాల్...:వీలైతే నాకు సాయం చేయమని అడుగుతుంది కావ్య. సరే నీకోసం కొన్నాళ్లు సైలెంటుగా ఉంటాను.. ఇలాగే చేస్తే ఎవరి మాట వినను అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు అప్పుకి కల్యాణ్ కాల్ చేసి... కావ్య, రాజ్ గురించి మాట్లాడుతుంది. ఇదంతా సైలెంటుగా అనామిక వింటూ ఉంటుంది. పోలీస్ సెలక్షన్స్ ఉన్నాయి కదా.. బాగా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతాడు. అలాగే అని చెప్తుంది అప్పు. ఇక నేను వదినాకు అండగా ఉంటాను నువ్వేం బాధపడకు అని చెప్తాడు కల్యాణ్.
అనామిక పంచాయితీ...:ఇక అప్పుతో ఫోన్ మాట్లాడిన తర్వాత అనామిక వచ్చి రెచ్చిపోతుంది. మీ అన్నయ్య లాగా మీరు అంతే అంటూ మాట్లాడుతుంది. దీంతో అవకాశం దొరికిందని మాట్లాడకు అంటూ కల్యాణ్ చెప్తాడు. నీ ప్రవర్తన మీద నేను నడుచుకునేది ఉంటుందని చెప్పేసి వెళ్లిపోతాడు. మరోవైపు బాబుకు స్నానం చేయించడానికి రాజ్ షవర్ కిందకు తీసుకుపోతుంటాడు. ఇంతలో కావ్య వచ్చి అలా చేయించకూడదని చెప్తుంది. సున్నీపిండి, ఆయిల్ పెట్టి చేయించాలని చెప్తుంది.
బాబుకి స్నానం...:అదేలా నాకు తెలీదు అంటే.. పది నిమిషాలు ఆగి గార్డెన్ లోకి రండి అంటూ కావ్య చెప్తుంది. నేను అన్నీ అరెంజ్ చేస్తాను అంటుంది. ఆ బిడ్డకు తల్లి ఎవరో చెప్పాలని కావ్య అంటుంది. ఇక గార్డెన్ లో బాబుకి స్నానం చేయించడానికి తీసుకువెళ్తారు. మీరు షర్ట్స్ కొనుక్కోవాలని రాజ్ తో కావ్య అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తర్వాతి ఎపిసోడ్లో :సుభాష్ వచ్చి.. ప్రకాశంను ఆ ప్రాజెక్టును మధ్యలోనే ఎందుకు వదిలేశారు అని అడుగుతాడు. దీంతో ధాన్యలక్ష్మి ఎంట్రీ ఇచ్చి.. మీరేందుకు దాస్తున్నారు.. ఎవరిని కాపాడాటానికి అని అంటుంది. మీరన్న ఆర్డర్ ఆగిపోవడం వల్ల కంపెనీకి కోటి రూపాయలు నష్టం వచ్చింది. దానికి కారణం రాజ్ అంటూ చెప్తుంది. మరి రాజ్ వల్ల అంత కష్టం ఎందుకు వచ్చింది.. ఏమైంది అనేది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










