Karthika Deepam March 28th: కార్తీక్ చేసిన ఆ తప్పేంటి.. దీప ఎందుకు కోపంగా ఉంది?

Karthika Deepam 2 Serial March 28th Episode: కార్తీక దీపం ఇది నవ వసంతం అంటూ ప్రారంభం అయింది. ఇక మొదటి రోజ గొప్పింట్లో పెరిగాల్సిన దీపను పేదింటికి ఎలా మారిందో చూపించారు. అలా ఆమె రాత మారిపోయింది. ఇక కట్ చేస్తే.. దీప పెద్దది అవుతుంది. అంతే కాదు ఆమెకు కూతురుని కూడా చూపిస్తున్నారు. అసలు ఆ కూతురు ఎవరు.. ఆమె భర్త ఎవరు.. ఏమయ్యారు అనేది సస్పెన్స్ లో ఉంచారు. అయితే దీపకు తన అత్త కొడుకు నర్సింహతో పెళ్లైనట్లు చూపిస్తున్నారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు.

అందాల పోటీల్లో జ్యోత్స్న....:మరోవైపు దీప స్థానంలో జ్యోత్స్న పెరిగి పెద్దది అవుతుంది. మనవరాలిని చూసి పారిజాతం మురిసిపోతుంది. ఇక జ్యోత్న్స అందాల పోటీకి వెళ్తుంది. అక్కడ మరో అమ్మాయికి, జ్యోత్స్నకు మధ్య పోటీ ఉంటుంది. ఫైనల్ రౌండ్ లో వారిద్దరికి ప్రశ్నలు వేస్తుంటారు న్యాయనిర్ణేతలు. మీ రోల్ మోడల్ ఎవరు.. అమ్మాయి అంటే ఎలా ఉండాలి అంటూ ప్రశ్నిస్తారు. దానికి జ్యోత్న్స నా రోల్ మోడల్ నేనే అంటూ చెప్పుకు వస్తుంది. ఇక ఆడవాళ్లకు తమ మీద తమకు విశ్వాసం ఉంటే.. ప్రపంచాన్ని జయించవచ్చని చెప్తుంది.

March 28th 2024 Episode Number 4 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

సైకిల్ పోటీల్లో దీప...:చూస్తుంటుంటే.. ఆమె జవాబులకు న్యాయనిర్ణేతలు యాక్సెప్ట్ చేసినట్లు అర్ధం అవుతుంది. తన కూతురు గెలవాలని సుమిత్ర కోరుకుంటూ ఉంటుంది. మరోవైపు దీప సైతం కూతురికి సైకిల్ కొనిచ్చేందుకు పోటీల్లో దిగుతుంది. మగాళ్లతో సహా పోటీ పడుతుంది. ఇక అక్కడ ఆమె ఆ పోటీల్లో గెలిస్తే.. ఓ చిన్న సైకిల్ బహుమతిగా తెలుచుకోవచ్చు. ఎట్టకేలకు ఆ పోటీల్లో దీప గెలుస్తోంది. అయితే పోటీల్లో విజేతకు గిఫ్ట్ ఇచ్చేందుకు కార్తీక్ ను ఊరి పెద్దలు గెస్టుగా పిలుస్తారు.

బహుమతి ఇచ్చేందు కార్తీక్ ఎంట్రీ...:విజేతలకు బహుబతి ప్రధానం చేయడానికి వచ్చేశారు కార్తీక్ గారు అని పిలుస్తారు. ఇక సైకిల్ పోటీల్లో గెలిచిన వారికి ఆయన చేతుల మీదుగా బహుమతిని అందించనున్నారు. అయితే దీప.. కార్తీక్ ను కోపంగా చూస్తుంటుంది. కార్తీక్ కూడా దీపను చూసి షాక్ అవుతాడు. బహుమతి అందుకునేందుకు దీప స్టేజీ మీదకు వస్తుంది. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఆ తప్పు నేను చేయలేదు... నన్ను నమ్మండి అని అంటాడు. నేను నమ్మను నన్ను నమ్మించలేరని దీప చెప్తుంది.

కార్తీక్ మీద దీపకు ఎందుకు కోపం...:అసలు దీప ఎందుకు కార్తీక్ మీద కోపంగా ఉంది. అసలు వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది.. కార్తీక్ చేసిన తప్పేంటి.. ఏం జరిగింది.. మరోవైపు జ్యోత్స్న పోటీల్లో విజేతగా నిలిచిందా.. ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కార్తీక దీపం సీరియల్ గత సీరియల్ కంటే సినిమా రేంజులో సాగుతోంది. ట్విస్టులు, షాక్ లతో కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ సీరియల్ అసలు కథలోకి వెళ్తోంది. చూడాలి మరి మున్ముందు ఎలా ఉండనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X