Brahmamudi March 29th అప్పు పోలీస్ కావాలంటే కోరిక తీర్చాలన్న బ్రోకర్... ఆ బాబు శ్వేతకి కొడకా ఏంటి?

నేటి బ్రహ్మముడి సీరియల్లో బాబుకు స్నానం చేయించడం ఎలానో కావ్య.. రాజ్‌కు చూపిస్తుంది. అయితే రాజ్‌కు చేయించడం రాదు. దీంతో కావ్యనే బాబును తీసుకుని ఆయిల్‌ రుద్దుతుంది. ఇది కానీ మీ అమ్మగారు చూశారంటే నీకు నాకు తలంటుతుందని అంటుంది. మరోవైపు ప్రకాష్‌ కు ఆఫీసు నుంచి మేనేజర్‌ ఫోన్‌ చేసి కంపెనీకి కోటీ రూపాయల నష్టం వచ్చిందని చెప్తాడు. రాజ్‌ వేరే పనుల్లో పడి పట్టించుకోలదు.. అందు వల్లే.. ఈ విషయం అన్నయ్యకు చెప్పొద్దని నేనే మేనేజ్‌ చేస్తానని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు.

సుభాష్ ఫైర్...

ఇదంతా పై నుంచి విన్న అనామిక, రుద్రాణి వెంటనే ఈ విషయం మీ అత్తయ్యకు చెప్పాలని అనుకుంటారు. ఇక ధాన్యలక్ష్మీ వద్దకు వెళ్లి మొత్తం చెప్తుంది రుద్రాణి. దీంతో కోపంగా దొరికింది మా అక్క.. ఆ రోజు మా ఆయన 50 లక్షలు నష్టం చేశారని భార్యాభర్తలు అంత గొడవ చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను అని కోపంగా కిందకు వెళ్తుంది. కింద సుభాష్‌ ఫోన్‌ మాట్లాడి కట్‌ చేసి వస్తుండగా ప్రకాష్‌ ఆ అలంకృత జ్యూవెల్లర్స్‌ వారి ఆర్డర్స్‌ మధ్యలోనే ఆపేశారట ఎందుకు అని సుభాష్ అడుగుతాడు.

March 29th 2024 Episode number 370 in Brahmamudi Telugu Serial

ధాన్యలక్ష్మి పెంట....

వాళ్ల మొహం అన్నయ్యా అది కాకపోతే ఇంకో కంపెనీకి సప్లయ్‌ చేస్తామని ప్రకాష్ అంటుంటే.. నేను అడిగింది వీళ్ల గురించి అని సుభాష్ అంటాడు. అది నేను రేపు వెళ్లి చూసుకుంటానులే అన్నయ్యా అని ప్రకాశ్ అంటాడు. రేపటిదాకా మీకు గుర్తుండాలి కదండి.. బావగారికి కారణం ఇప్పుడే చెప్పండని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని ప్రకాశం అంటాడు. మీరెందుకు ఈ విషయంలో నిజం దాస్తున్నారు. ఎవర్ని కాపాడటానికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది.

రాజ్ వల్ల కోటి నష్టం...

అది నీకు అనవసరం అని ప్రకాష్ అనగానే సుభాష్‌ ఇంతకీ ఏం జరిగింది. ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతుంది. అనగానే ప్రకాష్‌ ఏమీ లేదని చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ రాజ్‌ కంపెనీ విషయాలు పట్టించుకోకపోవడం వల్ల మన కంపెనీకి కోటి రూపాయలు నష్టం వచ్చిందని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. దీంతో మరోసారి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతలో రాజ్‌ పైనుంచి వస్తాడు. నష్టం నా వల్లే జరిగింది. ఈ సంవత్సరంలో నేను కంపెనీకి ఎన్నో లాభాలు తీసుకొచ్చానని రాజ్ అంటాడు.

అప్పు సెలక్ట్...

ఇప్పుడు కొంత నష్టం వచ్చింది అది ఒక్క నెలలో పూడ్చేస్తానని రాజ్‌ చెప్పి కుటుంబంలో వచ్చిన కలహాల గురించి బాధపడతాడు. రాజ్ పాలకుండ లాంటి ఈ కుటుంబంలో విషపు చుక్క పడింది. అది లాభమా? నష్టమా? నీ వారసత్వంలోనే అపశృతి దొర్లింది ఈ ఇంటి పునాదులతో సహా పెకిలించుకుంటూ ఒక రావి మొక్క మొలిచింది. అది లాభమా? నష్టమా? అంటూ రాజ్‌ను అడిగి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు పోలీస్‌ సెలెక్షన్స్‌ లో రిటన్ టెస్ట్‌, పిజికల్‌ టెస్ట్‌ లో పాసయ్యారని త్వరలోనే మీకు మెయిల్‌ వస్తుందని పోలీస్‌ ఆఫీసర్‌ అప్పుకు చెప్పగానే అప్పు హ్యాపీగా ఫీలవుతూ బయటకు వస్తుంది.

March 29th 2024 Episode number 370 in Brahmamudi Telugu Serial

లంచం ఇవ్వాలన్న బ్రోకర్...

ఏంటి మేడం చాలా సంతోషంగా ఉన్నట్టున్నారని బ్రోకర్ అంటాడు. లంచం ఇవ్వకుండా ఏ పని జరగదు అన్నావు. అసలు నేను పోలీస్‌ అవ్వలేను అన్నావు చూశావా? నా కష్టంతో ఎంతదూరం వచ్చానో అని అప్పు అంటుంది. చాలా దూరం వచ్చారు కానీ చివరిలో ఆగిపోతారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ అవ్వలేదుగా.. మెయిల్‌ వస్తుందని చెప్పారా? మీరు చెప్పింది నిజమే మీ లాంటి యంగ్‌ టాలెంట్ ను బాగానే ఎంకరేజ్‌ చేస్తారు. కానీ మధ్యలో కొంత మంది ఉంటారు. నాలాంటి నీచులు.. మీకు మెయిల్‌ రావాలి అంటే లోపల మావాడు ఉన్నాడు వాడికి లంచం ఇస్తేగానీ మీకు మెయిల్‌ రాదని బ్రోకర్ చెప్తాడు..

అలా చేస్తే.. జాబ్ మీదే...

మీరు పైసా ఖర్చు పెట్టకున్నా సరే జస్ట్‌ ఒక్క నైట్‌ మావాడిని శాటిఫై చేస్తే చాలు అనగానే బ్రోకర్‌ కాలర్‌ పట్టుకుని వార్నింగ్‌ ఇస్తుంది అప్పు. మరోవైపు రాజ్‌ బాబును తీసుకుని ఆఫీసుకు వెళ్తుంటే కావ్య వెళ్లి మీరు ఇలా ఆఫీసుకు వెళ్తే ఆఫీసులో మీకున్న రెస్పెక్ట్‌ పోతుందని ఇలా వెళ్లోద్దని చెప్తుంది. ఆ బిడ్డకు తల్లి ఎవరో చెప్పమని అడుగుతుంది. ఆమెను తీసుకురండి నేను వెళ్లిపోతానని చెప్తుంది. దీంతో రాజ్, కావ్యను ఆఫీసుకు రమ్మని అడుగుతాడు. అయితే ఏ హోదాలో రావాలని కావ్య అడుగుతుంది. డిజైనర్‌ గా రమ్మని రాజ్‌ చెప్తాడు. దీంతో సరే వస్తానని కావ్య అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

తదుపరి ఎపిసోడ్ లో... ఆఫీసుకు కావ్య, రాజ్ బాబుతో కలిసి వెళ్తారు. అందరూ బాబును చూస్తూ ఉంటారు. శ్వేత వచ్చి.. బాబు క్యూట్ గా ఉన్నాడు ఎవరి బాబు సార్ అని అడుగుతుంది. బాబు ఎవరో తెలిస్తే ఇన్మార్మేషన్ మాత్రమే వస్తుంది. పని చేస్తే జీతం వస్తుందని సీరియస్ అవుతాడు. ఇక మరోవైపు శ్వేత, రాజ్ గదిలో మాట్లాడుకుంటారు. కావ్య చూసి షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X