Karthika Deepam March 29th: దీపను బాధపెట్టిన ఓ వ్యక్తి... చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!

Karthika Deepam 2 Serial March 29th Episode: కార్తీక దీపం 2 సీరియల్ రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. గత సీరియల్ కంటే మరింత కొత్తగా సాగుతోంది. కొత్త కథతో, కొత్త నటీనటులతో ఈ సీరియల్ ప్రారంభం అయింది. అయితే ప్రారంభం అయినప్పటి నుంచి అసలు ఈ శౌర్య ఎవరు.. ఆమె భర్త ఎవరు.. కార్తీక్ చేసిన తప్పు ఏంటి అనేది ప్రేక్షకుల మదిలో ప్రశ్నలుగా మిగిలిపోయాయి. సస్పెన్స్ గా మిగిలిపోయిన ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు కానీ... ఇప్పుడిప్పుడే స్టోరీలోకి వెళ్తోంది సీరియల్. ఇక తాజాగా ఓ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఓ వ్యక్తి నీళ్లు కావాలని దీప ఇంటికి వస్తాడు. దీప అతనికి నీళ్లు ఇస్తుంది. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. నీ పెనిమిటీ నా దగ్గర అప్పు చేసి ఆరేళ్లు అయింది. ఓ పని చేద్దాం దీప.. నువ్వు నన్ను నీ పెనిమిటి అనుకున్నావు అనుకో.. నీ బాకీ తీరుతుంది. నా అవసరం తీరుతుంది అని చెప్తాడు. దీంతో దీప కోపంతో ఊగిపోయి.. లాగి పెట్టి ఆ వ్యక్తి కొడుతుంది. అడగ్గానే మంచినీళ్లు ఇచ్చానని మొగుడు స్థానాన్ని ఇస్తాను అనుకున్నావా.. నాలుక చీరెేస్తా ఇలాంటి తప్పుడు కూతలు కూశావంటే.. అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

March 29th 2024 Episode Number 5 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

మరోవైపు దీప కోసం వచ్చిన కార్తీక్.. ఇదే వ్యక్తిని దీప గారి ఇల్లు ఎక్కడండి అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి ఎట్లా కనిపిస్తున్నారా నీకు.. నీలాంటి వాళ్లు దాని వెనుక వందమంది ఉన్నా.. నేనైతే దాన్ని వదిలిపెట్టను.. అంటూ రెచ్చిపోతాడు. మర్యాద లేకుండా అది ఇది అంటారేంటి అని కార్తీక్ అడుగుతాడు. అంటా.. దాన్ని అయితే ఇడిచిపెట్టను.. దాని అంతు చూస్తా.. చెప్పు దానికి.. అంటూ ఉండగా.. కార్తీక్ అతని చెంపపగులగొడుతాడు. ఇంకోసారి దీప జోలికి వస్తే చంపుతా అంటూ వార్నింగ్ ఇస్తాడు.

ఇక నిన్నటి ఎపిసోడులో... దీప తన కూతురికి సైకిల్ కొనడానికి జాతరకు వెళ్తుంటే.. తన అత్త డబ్బులు లాక్కుంటుంది. అయితే అక్కడ శౌర్యకు సైకిల్ కొనివ్వలేకపోయాను అని బాధపడుతుంది దీప. అప్పుడే జాతరలో సైకిల్ పోటీలు నిర్వహిస్తారు. ఇక దీప ఆ పోటీల్లో మగవారితో పోటీ పడుతుంది. అయితే మొదటి ప్రైజ్ వాషింగ్ మిషన్, రెండో ప్రైజ్ మిక్సీ, మూడో ప్రైజ్ చిన్న సైకిల్ ఉంది. దీప కావాలనే మూడో స్థానం గెలుస్తుంది.

March 29th 2024 Episode Number 5 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

మరోవైపు జ్యోత్స్న అందాల పోటీల్లో పాల్గొంటుంది. చివరి రౌండులో జ్యోత్స్నకు మరో అమ్మాయికి ప్రశ్నలు వేస్తారు న్యాయనిర్ణేతలు. ఇక జ్యోత్స్న గెలుస్తుందా లేదా అని అందరు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో జ్యోత్స్న గెలిచినట్లు ప్రకటిస్తారు. దీంతో నా మనవరాలు గెలిచిందంటూ సంతోషిస్తుంది పారిజాతం. ఇక ఇంటికి వెళ్లిన జూనియర్ మోనిత.. అక్కడ బావ రాలేదని అలుగుతుంది. బావకు మిసెస్ అవ్వడమే తన గోల్ అంటూ అసలు విషయం బయటపెడుతుంది.

మరోవైపు దీపకు బహుమతిని అందించేందుకు కార్తీక్ గెస్టుగా వెళ్తాడు. అక్కడ దీపకు బహుమతి అందిస్తుంటే.. దీప మాత్రం కోపంగా చూస్తుంది. అప్పుడు కార్తీక్ నేను ఆ తప్పు చేయలేదు దీప అంటూ చెప్తాడు కార్తీక్. దీప ఇంటికి వెళ్లిపోతుంది. ఇక తన అత్త సాధింపులు ఉంటాయి. దీప తనను అసహ్యించుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. తన తప్పు లేదని చెప్పాలని.. దీపను వెతుక్కుంటూ వెళ్తాడు. మరి అసలు కార్తీక్ చేసిన తప్పేంటి.. అసలు దీప భర్త ఎవరు.. ఆ శౌర్య ఎవరు.. అనేది తెలియాలంటే ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X