Brahmamudi March 2nd రాజ్‌కు అత్తింట్లో అడుగడుగునా అవమానం... కావ్యపై డౌట్ వచ్చేలా చేసిన శ్వేత!

నేటి బ్రహ్మముడి సీరియల్ లో కావ్య తన పుట్టింటికి వెళ్తానని రాజ్‌తో చెప్పడంతో సరే వెళ్లమని అంటాడు. ఇంత శుభవార్త ఇంత లేటుగానా వెంటనే వెళ్లిపో... నేను ఇక్కడ ఫ్రీగా ఉంటానని చెప్తాడు రాజ్‌. ఇంతలో తన బావ కూడా వస్తున్నాడని కావ్య చెప్పడంతో రాజ్‌ ఇరిటేటింగ్‌గా పీలవుతాడు. తనకు ముందే ఎందుకు చెప్పలేదని కావ్యపై అరుస్తాడు. నేనంటే మీ పర్మిషన్‌ తీసుకోవాలి. కానీ మా బావ ఎవరి పర్మిషన్‌ తీసుకోవాలి అంటూ కావ్య ప్రశ్నించడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు.

ఇందిరాదేవి ప్లాన్ స్టార్ట్: కావ్య, వాళ్ల బావ ఇద్దరూ రెడీ అవుదామని పైకి వెళ్తారు. ఓరేయ్‌ బావ తమ్ముడు చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఎలాగైనా నేను కూడా వస్తానురా అని రాజ్ మనసులో అనుకుంటాడు. పైకి వెళ్తున్న కావ్య, వాళ్ల బావకు ఇందిరాదేవి ఎదురుగా వచ్చి విషయం మీటారా? అని అడుగుతుంది. మీటాము కానీ ఆయన ఏం చెప్పి మాతో వస్తారో అర్థం కావడం లేదని అంటుంది కావ్య. మీరైతే రెడీ అవ్వండి నేను వెళ్లి ఏదో ఒకటి చేస్తాను అంటుంది ఇందిరాదేవి.

March 2nd 2024 Episode number 347 in Brahmamudi Telugu Serial

ఇందిరాదేవి ఫైర్: మరోవైపు రాజ్‌ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ కళావతిని పుట్టింటికి పిలిచి నన్ను మాత్రం ఎందుకు పిలవలేదు. పైగా ఆ బావ గాడ్ని కూడా పిలిచారని అనుకుంటూ ఉంటాడు. ఏంటి రాజ్‌ ఏదో టెన్షన్‌లో ఉన్నట్లున్నావని ఇందిరాదేవి అనుకుంటూ వెళ్తుంది. నా టెన్షన్‌ పక్కన పెట్టు నీకసలు విషయం తెలుసా? అని అడుగుతాడు రాజ్. ఇందిరాదేవి తెలుసని వాళ్ల ఈడూ జోడూ బాగుందని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనగానే రాజ్‌ మరింత ఇరిటేట్‌ అవుతారు.

ముగ్గురు కలిసి కనకం ఇంటికి: నాన్నమ్మ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? అనగానే మన మేనేజర్‌ సంతోష్‌ ఆయన కాబోయే పెళ్లాంతో కలిసి కాశీ వెళ్తే తప్పేంటి అని ఇందిరాదేవి అంటుంది. అది కాదని రాజ్‌ అసలు విషయం చెప్తాడు. వాళ్లిద్దరే వెళ్తున్నారా? నువ్వు వెళ్లటం లేదా? అనగానే తనను పిలవలేదని బాధగా చెప్తాడు రాజ్‌. దీంతో కోపంగా ఇందిరాదేవి కనకానికి ఫోన్‌ చేసి తిడుతుంది. తర్వాత ముగ్గురూ కలిసి కావ్య పుట్టింటికి బయలుదేరుతారు.

March 2nd 2024 Episode number 347 in Brahmamudi Telugu Serial

రాజ్‌ ఇరిటేటింగ్‌: బావ ఇలా మనం పక్కపక్కన కూర్చుని కలిసి ప్రయాణం చేసి ఎన్నో ఏళ్లు అయ్యింది కదా? అని కావ్య అంటుంది. అవును బుజ్జి చాలా ఏళ్లు అయ్యిందని బావ భాస్కర్ అంటాడు. బావా అప్పట్లో నీ కారులో వెళ్తున్నప్పుడు మొక్కజోన్న పొత్తులు, చిలగడదుంపలు కొనుక్కుని తింటూ వెళ్లే వాళ్లం కదా అని కావ్య అంటుంటుంది. ఇద్దరూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నట్లు నటిస్తుంటే వెనకాల కూర్చున్న రాజ్‌ ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు. మీ సోది వినలేక చచ్చిపోతున్నాను అంటూ ఇద్దరిని తిడతాడు.

March 2nd 2024 Episode number 347 in Brahmamudi Telugu Serial

మేనల్లుడికి హారతీ: మరోవైపు కనకం కావ్య, రాజ్‌ ల కోసం ఎదురుచూస్తుంది. ఇందిరాదేవి ఫోన్‌ చేసి ముగ్గురూ బయలుదేరారు అని చెప్తుంది. ఇంతలో కారు వస్తుంది. కనకం, మూర్తి, అప్పు వచ్చి కావ్యను వాళ్ల బావను మాత్రమే పలకరిస్తూ దిష్టి తీయబోతుంటే... కంగారుగా కారు దిగిన రాజ్‌ ఇరిటేటింగ్‌ గా తిడుతూ.. ఏం చేస్తున్నారండి మీరు ముగ్గురికి కలిసి చత్వారం వచ్చిందా? కళావతికి ఇతనికి కలిపి హారతి ఎలా ఇస్తారు. ఇదేనా మన సాంప్రదాయం. ఇదేనా మన సనాతన ధర్మం అని రాజ్ అంటాడు.

స్వప్న చేసిన పనికే కావ్యకు దూరం: బాబు చిన్నప్పటి నుంచి వాడు మా ఇంట్లో పెరిగాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాడని సంతోషంలో హారతి పడుతుందని మూర్తి చెప్తాడు. అవును బాబు ఇద్దరూ కలిసి వచ్చినా కూడా హారతి అల్లుడుకే ఇచ్చేదాన్ని అని కనకం అంటుంది. అల్లుడు కాదు మేనల్లుడు అనండి. ఇదిగో ఇతను మేనల్లుడు, నేను ఈ ఇంటి అల్లుడని రాజ్ అంటాడు. ఇప్పుడు కాదని ఎవరన్నారు బావ అని అప్పు అంటుంది. చిన్నప్పటి నుంచి మా అక్కని ఈ బావకే ఇద్దామని మా అమ్మా నాన్న కలలు కన్నారని చెప్తుంది.

అత్తింట్లోకి అడుగుపెట్టిన రాజ్: కానీ మా స్వప్న అక్క చేసిని నిర్వాకం వల్ల కావ్య అక్క మీతోటి తాళి కట్టించుకోవాల్సి వచ్చిందని అప్పు చెప్తుంది. మా బావ గుండె పగిలిపోయి ఆ గాయం మానడానికి ఇన్ని రోజలు పట్టిందని... ఇప్పుడే కోలుకుని అమెరికా నుంచి వచ్చిండని అప్పు అంటుంది. అప్పు అనగానే నాకు కాలగర్బంలో కలిసిపోయిన మాటలు చెప్పొద్దు అనగానే ఇద్దరికి సపరేట్‌గా హారతి ఇస్తుంది కనకం. తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

తర్వాతి ఎపిసోడ్ లో: శ్వేత రాజ్ కు కాల్ చేస్తుంది. ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఇప్పుడెందుకు వచ్చాడు. గతంలో కావ్యను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని చెప్పావ్. కోల్పోయిన తన ప్రేమను మళ్లీ బతికించుకోవడానికి వచ్చాడా. కావ్య నిన్ను వదిలి వెళ్లోపోకూడదు అనుకుంటే తెలుసుకో అని చెప్తుంది. మరోవైపు కావ్య, ఆమె బావ క్లోజ్ గా మాట్లాడుకుంటారు. ఇక రాజ్ సిరీయస్ గా చూస్తుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X