Brahmamudi March 30th పోలీస్ అవ్వనని అప్పు నిర్ణయం... కంపెనీ బాధ్యతల నుంచి రాజ్ ఔట్!

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడులో రుద్రాణి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని రాహుల్‌ అడుగుతాడు. రాజ్‌ చేసిన తప్పును మనం యూజ్ చేసుకోవడం లేదని చెప్తుంది. ఏం చేద్దాం మామ్ అని అడుగుతాడు రాహుల్. రాజ్ చేసిన తప్పును ప్రపంచానికి తీసుకెళ్లాలి. అప్పుడు రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పిస్తారు. కళ్యాణ్‌కు కవితలు రాయడం తప్ప ఎలాగో క్లయింట్స్‌ తో డీల్‌ చేయడం రాదు. చివరకు నువ్వే సీఈవో చైర్‌లో కూర్చోవచ్చు అంటుంది. ఇదంతా బయటి నుంచి విన్న స్వప్న చప్పట్లు కొడుతూ దగ్గరకు వస్తుంది.

నువ్వు కూడా రోడ్డు మీదే
నిలువెత్తు నికృష్టులను చూసి నా జన్మ తరించిపోయిందని స్వప్న అంటుంది. ఎలా వస్తాయి మీక ఇలాంటి గొప్పగొప్ప ఆలోచనలు అని నిలదీస్తుంది. ఇందాక ధాన్యలక్ష్మీ ఆంటీకి గడ్డి పెట్టేటప్పుడు.. రాజ్‌ మీకు ఇంటి ఆడపడచు హోదా ఇచ్చి గౌరవించాడని చెప్తుంది. మీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇలాగే ఉంటే ఇద్దరూ రోడ్డు మీద పడతారు అని హెచ్చరిస్తుంది. మేము రోడ్డు మీద పడితే నువ్వు అమెరికాలో వెళ్లి పడతావా? నువ్వు కూడా రోడ్డు మీదే పడతావని రాహుల్ అంటాడు.

March 30th 2024 Episode number 371 in Brahmamudi Telugu Serial

మా కావ్యకు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే
పిచ్చి నా బచ్చా నేనెందుకు రోడ్డు మీద పడతానని స్వప్న అంటుంది. తాతయ్య గారు నాకు బోలెడంత ఆస్థి రాసిచ్చారని మర్చిపోయారా? అంటుంది. మీరు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్లా మా కావ్యకు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే మిమ్మల్ని అందరి ముందు కడిగిపారేస్తానని హెచ్చరించి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు రాజ్‌, కావ్య బాబును తీసుకుని ఆఫీసుకు బయలుదేరుతారు. ఆఫీసులో స్టాఫ్‌ అందరూ వింతగా బాబును చూస్తుంటారు. ఇంతలో శృతి వచ్చి బాబు బాగున్నాడు ఎవరు అని అడుగుతుంది. ఇక రాజ్ సీరియస్ గా పని చేస్తే జీతం వస్తుంది.. ఇలాంటివి తెలుసుకుంటే ఏమ్ వస్తుందని ఫైర్ అవుతాడు.

మీ అబ్బాయితో ఆడుకోండి
ఏంటి ఆలోచిస్తున్నావని కావ్యను అడుగుతాడు రాజ్. ఇంట్లో మీరేదో చెప్పారని కావ్య అనగా... లక్ష చెప్తా.. ఇంట్లో విషయాలు ఇంట్లోనే మర్చిపోవాలని... ఆఫీసులో పని మాత్రమే చేయాలని అంటాడు. వెళ్లు వెళ్లి నువ్వేసిన డిజైన్స్‌ తీసుకురా? అప్రూవ్‌ చేసి క్లయింట్స్ కు పెట్టాలని అంటాడు. అలాగే మీరు వెళ్లి మీ అబ్బాయితో ఆడుకోండి. ఇదిగోండి బ్యాగ్ ని ఇచ్చి వెళ్తుంది. శృతి దగ్గరకు వెళ్లి డిజైన్స్ తీసుకుని రాజ్‌ దగ్గరకు వస్తారు. రాజ్‌ బాబును ఆడిస్తుంటాడు.

రాజ్ గురించి బ్యాడ్ గా...
డిజైన్స్‌.. ఏంటి సార్‌ బాబు చేతిలో పెన్స్‌ స్టాండ్‌ పెట్టారు. కనీసం బొమ్మలు కూడా లేవా? అని కావ్య అడుగుతుంది. బొమ్మలు ఇంట్లో ఉంటాయి. బాబును చూసింది చాలు వీటిని క్లయింట్స్‌ కు మెయిల్‌ చెయ్‌. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు కాసేపట్లో మీటింగ్‌ ఉంది వెళ్లి ప్రిపేర్‌ అవ్వు వెళ్లు అని కావ్యను పంపిస్తాడు. మీరు మీ బాబుతో ఆడుకోండని చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక కావ్య బయటకు వెళ్తుంది. ఆఫీసులో స్టాఫ్‌ అందరూ రాజ్‌ గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటుంటే కావ్య విని తిడుతుంది.

కావ్య వార్నింగ్‌
ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే బాగుండదని కావ్య వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు మూర్తి, కనకం బయటకు వెళ్తుంటే అప్పు వస్తుంది. అప్పుడే వచ్చేసావ్ సెలక్షన్స్‌ ఏమయ్యాయి అని కనకం అడుగుతుంది. అప్పు డల్‌గా ఉంటుంది. సెలెక్ట్‌ అయ్యావా? లేదా అంటూ కనకం అడగ్గానే అయ్యాను అని చెప్తుంది అప్పు. మరి ఎందుకు ఇంత డల్ గా ఉన్నావేంటి అని అడుగుతుంది. కానీ నేను ఇంక పోలీసు అవ్వను అంటుంది అప్పు. దీంతో ఎందుకు అంటూ అప్పును నిలదీస్తుంది కనకం. అయినా చెప్పకుండా వెళ్లిపోతుంది అప్పు.

March 30th 2024 Episode number 371 in Brahmamudi Telugu Serial

శ్వేత బాబును చూసి షాక్...
మరోవైపు రాజ్‌ ఆఫీసుకు వచ్చిన శ్వేత బాబును చూసి షాక్‌ అవుతుంది. ఇంత సులువుగా ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచిపెట్టావు రాజ్‌ అని అడుగుతుంది. లేదు నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు అబద్దం చెప్తున్నావని శ్వేత అంటుంది. కావ్య కూడా ఇలాగే అంది నిజాన్ని నమ్మలేకపోతుంది. కానీ కళ్ల ముందు బాబు కనిపిస్తున్నాడని రాజ్ అంటాడు. శ్వేత,రాజ్ ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే కావ్య వస్తుంది. డోర్‌ దగ్గరే నిలబడి వింటుంది.

కావ్యను చూసి కనకం, మూర్తి బాధ
శ్వేత కోపంగా రాజ్‌ను తిడుతుంది. నీ మనసులో ఇంత కుట్ర దాగి ఉందని తెలుసుకోలేకపోయానని అంటుంది. పాపం కావ్యను ఎంత మోసం చేశావు. ఎన్నో నీతులు చెప్పే నీ సంస్కారం ఏమైందని శ్వేత నిలదీస్తుంది. నీకంటే నా మొగుడే నయం అంటూ శ్వేత వెళ్లిపోతుంది. కావ్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మార్కెట్‌ కు వెళ్లిన కనకం, మూర్తిలకు బొమ్మలు తీసుకుని వెళ్తున్న కావ్య ఎదురుపడుతుంది. దీంతో కనకం, మూర్తి బాధపడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

తర్వాతి ఎపిసోడ్ లో...
దుగ్గిరాల ఇంట్లో మరోసారి రుద్రాణి రచ్చ చేస్తుంది. నా కొడుకును అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటూ కంపెనీ బాధ్యతల నుంచి తొలగించారు. ఇప్పుడు రాజ్ చేసిన తప్పును పక్కన పెట్టి.. కంపెనీకి రాజ్ ను చేశారు అంటూ గొడవ చేస్తుంది. దీనికి నువ్వే సమాధానం చెప్పాలని అంటుంది అపర్ణ. ఏం చేయాలో చెప్పు అని అంటాడు. నువ్వు చేసిన తప్పుకు పశ్చాతపంగా కొడుకుని వదిలేసి రా లేదంటే కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకో అని చెప్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X