Brahmamudi March 4th సుభాష్, ప్రకాష్ మధ్య 50లక్షల పంచాయితీ.. కావ్య కోసం అత్తింట్లో రాజ్ పాట్లు!
నేటి బ్రహ్మముడి సీరియల్లో రాజ్ లగేజ్ తీసుకొస్తుంటే.. అదేంటి మా మేనల్లుడి బ్యాగ్ మీరు తీసుకొస్తున్నారని కనకం అడుగుతుంది. అదేంటీ నేను వస్తున్నట్లు వీళ్లకు ఇన్ఫర్మేషనే లేదా అని రాజ్ అనుకుంటాడు. అయ్యో అమ్మా ఆయన మన ఇంట్లోనే ఉండేందుకు వస్తున్నారని కావ్య కనకంతో అంటుంది. అల్లుడు గారు మా ఇంట్లో ఉంటాననడం మా అదృష్టం అని మూర్తి అంటాడు. తర్వాత అంతా కలిసి లోపలికి వెళ్లిపోతారు.
మరోవైపు ఆఫీస్ స్టాక్ గోడౌన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని, దానికి ఇన్సూరెన్స్ చేయించలేదని... 50 లక్షలు నష్టం వచ్చిందని సుభాష్‌కు మేనెజర్ కాల్ చేసి విషయం చెప్తాడు. ఎందుకు ఇన్సూరెన్స్ చేయించలేదని కోపంగా అరుస్తాడు సుభాష్. మీ తమ్ముడు చూసుకుంటానని చెప్పారని మేనేజర్ చెప్పగానే కాల్ కట్ చేసి అపర్ణతో ప్రకాశం ఎక్కడ అని అరుస్తాడు. సుభాష్ అరుస్తుంటే.. మెట్లు దిగుతూ వస్తాడు ప్రకాశం.

ఏమైందని ప్రకాశం అడుగుతాడు. గోడౌన్‌లోకి స్టాక్ రాగానే ఇన్సూరెన్స్ చేయించమన్నాను కదా. ఎందుకు చేయించలేదు. దాని వల్ల 50 లక్షలు నష్టం వచ్చిందని సుభాష్ ఫైర్ అవుతాడు. అయ్యో మర్చిపోయాను అన్నయ్య అని ప్రకాశం చెప్తాడు. ప్రతిసారి మర్చిపోకూడదు అనుకుంటాను. కానీ, మర్చిపోతున్నానని అంటాడు. ఇలా ఎన్నిసార్లురా.. లాస్ట్ ఇయర్ ఇలాగే చేశావ్. మర్చిపోయాను అని తప్పించుకోకు. నీకు మేనెజర్స్ ను పెట్టింది ఇవి గుర్తు చేసేందుకే కదా. ఇలా చేస్తే మేము బయటకు వెళ్లినప్పుడు నీకు ఆఫీస్ ఎలా అప్పజెప్పగలను. నిన్ను నమ్మి నీకు ఆఫీస్‌ను ఒక్కరోజైనా ఎలా ఇవ్వగలను అంటూ సుభాష్ ఫైర్ అవుతాడు.
ఆపండి బావగారు అంటూ ధాన్యలక్ష్మీ అరుస్తుంది. ఆయన మీతోపాటే ఆఫీస్ చూసుకుంటారు. ఆయనేదే మీ బానిసలా తిడుతున్నారు. ఆయనేమైనా చిన్నపిల్లాడా అలా తిడుతున్నారు. ఆయనకు పెళ్లి అయి పిల్లలకు కూడా పెళ్లి అయిందని అంటుంది. ధాన్యం వారి మధ్యలోకి నేనే వెళ్లను నువ్ ఎందుకు వెళ్తున్నావ్ అని అపర్ణ అంటుంది. ఆయన మహారాజులా తిడుతుంటే నువ్ మహారాణిలా చూస్తున్నావ్. నువ్ ఎందుకు వెళ్తావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ధాన్యలక్ష్మీ అపర్ణను అనగానే సారీ అమ్మా నన్ను క్షమించు. అన్నయ్యగా నా తమ్ముడిని అంటున్నాను కానీ, మా మధ్య ఇన్ని ఉంటాయని అనుకోలేదు. రెండు చేతులతో దండం పెట్టి వెళ్లిపోతాడు సుభాష్. ప్రకాశం కోపంగా ధాన్యలక్ష్మీని లోపలికి తీసుకెళ్తాడు. నీకు పిచ్చి పట్టిందా. అన్నయ్యతో ఎందుకు అలా ప్రవర్తించావ్ అని అరుస్తాడు. ఇంకోసారి నాకు మా అన్నయ్యకు మధ్యలో నువ్ రాకు అని కోపంగా చెప్పి ప్రకాశం వెళ్లిపోతాడు.
మరోవైపు మూర్తి ఇంట్లో అరిటాకుపై అన్ని రకాల వంటకాలు చేసి పెడతారు. ఇవాళ సూపర్‌గా లాగించేయాలని అని రాజ్ అనుకుంటాడు. అయితే, ఆ అరిటాకుపై భాస్కర్‍కు వడ్డిస్తారు. పోయినసారి ఇలా అరిటాకుపై వడ్డిస్తే మీరు కోప్పడ్డారు కదా! అందుకే మీకు వడ్డించలేదని అప్పు అంటుంది. మీ మేనల్లుడికి పెళ్లి చేసి అమెరికా పంపించేయొచ్చు కదా? నన్ను చూడమంటే ఓ మంచి అమ్మాయిని చూసి పెడతాను. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు అని రాజ్ అంటాడు. కావ్య లాంటి అమ్మాయి కావాలి నాకు అని భాస్కర్ అంటాడు.
అలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదని అప్పు అంటుంది. కావ్యను చేసుకున్న భర్త ఇక్కడే ఉన్నాడు. మా బావ మా అక్కను వద్దనుకుని రెండో పెళ్లి చేసుకుంటే తప్పా నీకు ఆ ఛాన్స్ లేదని చెప్తుంది. అయినా దేవతలాంటి మా అక్కను మా బావ ఎందుకు వదులుకుంటాడు. ఏం బావ అని అప్పు అంటుంది. దీంతో రాజ్ అప్పును మనసులో తిట్టుకుంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ మాటలు గుర్తు చేసుకుని సుభాష్ బాధపడతుంటాడు. ఇంతలో ప్రకాశం వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు.
నాకు మతిమరుపు ఉందన్నయ్యా. సైట్ లేదు. నువ్ బాధపడుతుంటే ఆ మాత్రం చూడలేనా అని ప్రకాశం అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో రాజ్ కు శ్వేతకు కాల్ చేస్తుంది. కావ్య బావ కావ్య పిలిస్తే వచ్చాడా లేదా కావ్యను దక్కించుకోవడానికి వచ్చాడా అని చెప్తుంది. కావ్య నిన్ను వదిలి వెళ్లకూడదు అనుకుంటే తెలుసుకో అని చెప్తుంది.


Click it and Unblock the Notifications











