Brahmamudi March 5th కావ్యపై ఇంత ప్రేముందా... ఇన్నాళ్లు ఎందుకు దాచావ్ రాజ్?

నేటి బ్రహ్మముడి సీరియల్ లో సుభాష్.. తన తమ్ముడు ప్రకాశంను తిట్టినందుకు ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు ధాన్య‌ల‌క్ష్మి అన్న మాట‌ల‌ను గుర్తుచేసుకొని సుభాష్‌ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే వచ్చిన ప్రకాశం కూడా ఎమోషనల్ అవుతాడు. అన్నయ్య ధాన్యలక్ష్మి తరఫున సారీ చెప్తున్నా అని ప్రకాశం చెప్తాడు. దీంతో నా త‌మ్ముడు అన్నింట్లో బెస్ట్ ఉండాల‌ని కోరుకునేవాడిన‌ని, ఎవ‌రు వేలేత్తి చూపించ‌కూడ‌ద‌ని త‌ప్పు చేస్తే నీకు మ‌తిమ‌రుపు ఉంద‌నే సంగతి మ‌ర్చిపోయి తిట్టేవాడిన‌ని సుభాష్‌ అంటాడు.

కలిసిపోయిన తమ్ముడు అన్నయ్య: త‌మ్ముడికి క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు సుభాష్‌. మ‌న మ‌ధ్య క్ష‌మాప‌ణ‌లు అక్క‌ర‌లేద‌ని సుభాష్‌తో ప్ర‌కాశం అంటాడు. ఇద్దరు ఎమోషనల్ అయి ఒకరినొకరు కౌగిలించుకుంటారు. మరోవైపు రాజ్‌ను ఏడిపించాల‌ని ఫిక్స‌వుతారు కావ్య‌, ఆమె బావ‌. ఇద్ద‌రు క‌లిసి క్యార‌మ్ బోర్డ్ ఆడ‌బోతున్న‌ట్లు రాజ్‌కు వినిపించేలా అప్పు అరుస్తుంది. రాజ్ కూడా బయటకు వచ్చి.. నేను కూడా గేమ్ ఆడుతాను అని చెప్తాడు. దీంతో కావ్యను, అప్పును ఓ టీమ్ చేస్తాడు.. నేను తమ్ముడు మరో టీమ్ అంటూ ఆటను మొదలుపెడతాడు.

March 5th 2024 Episode number 349 in Brahmamudi Telugu Serial

కావ్య కోసమే గేమ్: క్యార‌మ్ ఆడుతోండ‌గా కాయిన్స్ ఎలా కొట్టాలో కావ్యకు బావ ద‌గ్గ‌రుండి నేర్పిస్తుంటాడు. ఆ సీన్ చూసి రాజ్ త‌ట్టుకోలేక‌పోతాడు. కావ్య కాయిన్ ప‌డేయ‌గానే భాస్కర్ సంతోషంగా గంతులు వేస్తాడు. కావ్య మ‌న అపోజిష‌న్ టీమ్ అని రాజ్ అత‌డిపై సెటైర్ వేస్తాడు. రాజ్ కాయిన్ ప‌డేసిన‌ప్పుడు మాత్రం అత‌డు సెలైంట్‌గా ఉంటాడు. కావ్య త‌న బావ గురించి తెగ బిల్డ‌ప్‌లు ఇస్తుంది. కానీ భాస్కర్ ఒక్క కాయిన్ కూడా ప‌డ‌గొట్ట‌లేక‌పోతాడు. కావ్య ఆడుతుంటే... ప్ర‌తిసారి ఆమెకు బావ స‌ల‌హాలు ఇస్తుంటాడు. కావ్య‌ను గెలిపించ‌డానికే తాను ఈ గేమ్ ఆడుతున్న‌ట్లుగా చెప్పుకువస్తాడు.

బావను ఎలాగైనా దూరం చేయాలనే: బావ స‌ల‌హాల‌తో కావ్య వ‌రుస‌గా కాయిన్స్ వేస్తుంది. దాంతో కావ్య‌, ఆమె బావ లేసి డ్యాన్స్ చేస్తారు. ఆ సీన్ చూసి రాజ్ స‌హించ‌లేక‌పోతాడు. నేను ఈ గేమ్ ఆడ‌న‌ని వెళ్లిపోవాల‌ని అనుకుంటాడు. కావ్య చేతుల‌ను ఆమె బావ ప‌ట్టుకుంటూ బాగా క్లోజ్‌గా మూవ్ కావ‌డం చూసి రాజ్ లోలోన ర‌గిలిపోతుంటాడు. కావ్య‌ను ఆమెకు బావ‌కు ఎలాగైనా దూరం చేయాల‌ని అనుకుంటాడు. కావ్య వేసిన డిజైన్‌పై ఇంక్ పోస్తాడు రాజ్‌. ఏం తెలియ‌న‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న‌కు టీ కావాల‌ని కావ్య‌తో అంటాడు.

కావ్యకు రాజ్ క్లాస్: రాజ్ కు టీ ఇవ్వ‌డం కోసం కావ్య లేస్తుండ‌గా క‌న‌కం ఆపుతుంది. బావ‌తో నువ్వు గేమ్ ఆడు... తాను రాజ్‌కు టీ పెట్టి ఇస్తాన‌ని అంటుంది. క‌న‌కం పీక పిసికేయాల‌న్నంత కోపంగా ఉన్న పైకి మాత్రం ఏం అన‌లేక‌పోతాడు రాజ్‌. కావ్య‌ను వెంట‌నే డిజైన్స్ తీసుకుర‌మ్మ‌ని చెబుతాడు. డిజైన్స్‌పై ఇంక్ ప‌డి ఉండ‌టం చూసి కావ్య షాక‌వుతుంది. తన భర్తకు ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌క త‌డ‌బ‌డుతుంది. డిజైన్స్‌పై ఇంక్ ప‌డింది అంటూ వంక‌లు చెబితే ఊరుకోన‌ని కావ్య‌కు క్లాస్ ఇస్తాడు రాజ్‌.

March 5th 2024 Episode number 349 in Brahmamudi Telugu Serial

మొగుడితో తప్ప ఎవరితో ఆడొద్దు: బావ చేయిప‌ట్టుకొని క్యార‌మ్స్ ఆడ‌టం తెలుసుకొని వ‌ర్క్ స‌రిగ్గా చేయ‌డం తెలియ‌దా అంటూ ఫైర్ అవుతాడు. ఇప్ప‌టికిప్పుడు ఆ డిజైన్స్ మ‌ళ్లీ వేయ‌మ‌ని అంటాడు. కావ్య బావ భాస్కర్ వచ్చి... కావ్య మ‌ళ్లీ డిజైన్స్ వేయాల్సిన ప‌నిలేద‌ని అంటాడు. కావ్య వేసిన డిజైన్స్‌ను త‌న ఫోన్‌లో ఫొటో తీసి సేవ్ చేశాన‌ని అంటాడు. బావ తెలివికి కావ్య తెగ మురిసిపోతుంది. చిన్న‌నాడు ఆడుకున్న గేమ్స్ క‌లిసి ఆడ‌దామ‌ని కావ్య‌ను తీసుకెళ‌తాడు ఆమె బావ‌. దీంతో రాజ్ ఈ పెళ్లైన ఆడవాళ్లు మొగుడితో తప్ప ఎవరితో ఆడకూడదని రాజ్యంగంలో రూల్ పెట్టాలని అనకుంటాడు.

ధాన్యలక్ష్మీపై అపర్ణ కంప్లైంట్: ధాన్య‌ల‌క్ష్మి త‌న భ‌ర్త‌ను నానా మాట‌లు అన‌డం అప‌ర్ణ స‌హించ‌లేక‌పోతుంది. ఆ విష‌యాన్ని ఇందిరాదేవికి చెబుతుంది. త‌న కోపాన్ని భ‌ర్త సుభాష్‌పై చూపించింద‌ని, త‌ప్పు చేసిన ప్ర‌కాశాన్ని మంద‌లించ‌బోతే త‌ప్పుప‌ట్టింద‌ని అప‌ర్ణ అంటుంది. ధాన్య‌ల‌క్ష్మి ఒక్క‌సారిగా త‌మ‌ను ప‌రాయివాళ్ల‌ను చేసి మాట్లాడింద‌ని, ఆ విష‌యంలో సుభాష్ చాలా కుమిలిపోతున్నాడ‌ని ఆవేద‌న‌కు లోన‌వుతుంది. ధాన్య‌ల‌క్ష్మి చాలా ప్ర‌మాద‌క‌రంగా మారిపోతుంద‌ని, త‌న‌కు న‌చ్చ‌చెప్ప‌క‌పోతే త్వ‌ర‌లోనే ఇళ్లు ముక్క‌ల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తుంది.

తర్వాతి ఎపిసోడ్ లో: రాత్రి పూట మంటలు వేసుకుని కావ్య ఆమె బావ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఓ నిప్పు కణిక కావ్య కాలు కింద పడబోతుంటే.. రాజ్ దాన్ని నెట్టివేస్తాడు. అది కాస్త భాస్కర్ కాలుకు తాకుతుంది. మరోవైపు రాజ్ చేతికి కూడా మంట తాకుతుంది. అది చూసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు భాస్కర్ కూడా నొప్పితో విలవిలాడుతాడు. కావ్యకు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి మురిసిపోతాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X