Brahmamudi March 7th మళ్లీ ఆ పని మొదలెట్టిన స్వప్న... ఇంట్లో వాళ్లంతా షాక్.. అనామికకు రాజ్ వార్నింగ్!

నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌లో భాస్కర్‌ నిప్పు తొక్కినందుకు నడవలేకపోతున్నట్లు యాక్టింగ్ మొదలుపెడుతాడు. బాత్రూంకు వెళ్లేందుకు కావ్యను పిలిస్తే.. నేను ఉన్నాగా తమ్ముడు అంటూ రాజ్ వస్తాడు. ఇక భాస్కర్ ను దగ్గరుండి రాజ్ బాత్రూమ్‌కు తీసుకెళ్తాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన భాస్కర్ కావాలనే రాజ్‌ను ఆటపట్టిస్తుంటాడు. సబ్బు కావాలి, ఇన్నర్ వేర్స్ కావాలి అంటూ బుజ్జీ అని పిలవడం.. రాజ్ కోపంగా నేనున్నాగా తీసుకువస్తా అంటూ తీసుకురావడం ఇవన్నీ చూసే ప్రేక్షకులను ఫన్ కలిగిస్తుంది.

మళ్లీ మోడలింగ్: ఇక రాజ్ అన్నయ్యా అంటూ భాస్కర్ పిలువడం.. ఆ నిప్పు కణికమీద నువ్ కాలు వేయడం వల్లే నా తలరాత మారిందిరా అని రాజ్ అనుకుంటాడు. వీడు అమెరికా నుంచి వచ్చాడా అనకాపల్లి నుంచి వచ్చాడా అని రాజ్ ఫైర్ అవుతాడు. మరోవైపు రుద్రాణి లేవగానే ఉదయం ఇంటి బయట స్వప్న మోడలింగ్ ఫొటో షూట్ చేస్తుంది. అది చూసి షాక్ అయిన రుద్రాణి.. ఏంటిది. ఇంట్లో వాళ్లు మోడలింగ్ చేయొద్దన్నారుగా అని అంటుంది.

March 7th 2024 Episode number 351 in Brahmamudi Telugu Serial

ఫోటోషూట్ చూసి షాక్: దాంతో స్వప్న నీ కొడుకు కోట్ల ఆస్తి కూడబెడుతుంటే టైమ్ పాస్‌కి మోడలింగ్ చేయట్లేదని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. మీరే ఇక్కడ అడుక్కు తింటున్నారు. నా సంగతి నేను చూసుకోవాలి కదా అని చెప్తుంది. దీంతో రుద్రాణి ఇంట్లోకి వెళ్లి అందరినీ పిలచుకుని వస్తుంది. వాళ్లంత బయటకు వచ్చి స్వప్న మోడలింగ్ ఫొటో షూట్ చూసి షాక్ అవుతారు. ఇప్పుడు మన ఇంటి గౌరవం దెబ్బతినదా.. దుగ్గిరాల ఇంటి అమ్మాయి ఫోటోలు బయటకు వెళ్తే... పరువు ఏమవుతుందని అంటుంది ధాన్యలక్ష్మీ.

రాజ్ కు జలసీ: ఏంటీ దరిద్రం మమ్మీ అని రాహుల్ అంటే.. తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి. ఇప్పుడు ఏంటీ అంటే ఎలా అని రుద్రాణి ఫైర్ అవుతుంది. అత్త, భర్త చేతులు ఎత్తేస్తే ఎలా... కొంచమైనా కంట్రోల్‌లో పెట్టాలి కదా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు ఏం వద్దు. ఆ ఫొటోషూట్ అయిన తర్వాత స్వప్నతో మాట్లాడుదామని సుభాష్ అంటాడు. మరోవైపు వీడిని ఎలా వదిలించుకోవాలని రాజ్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు కావయ్ భాస్కర్‌కి ఇడ్లీ తినిపించేందుకు ట్రై చేస్తుంది. అది చూసి వాట్.. అంటూ గట్టిగా ఫోన్ తీసుకుని అరుస్తాడు రాజ్. దాంతో అంతా షాక్ అవుతాడు.

March 7th 2024 Episode number 351 in Brahmamudi Telugu Serial

కావ్యను లాక్కెళ్లిన రాజ్: ఫోన్‌లో ఏదో ఒకటి రాజ్ మాట్లాడుతుంటే కావ్య భాస్కర్‌కు ఇడ్లీ తినిపించేందుకు ట్రై చేస్తుంది. దాంతో కాళ్లు విరగొడతాను, మొహం చట్నీ చేస్తాను అని ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తాడు రాజ్. తర్వాత కాల్ కట్ చేసి.. నేను ఒక్కరోజు ఆఫీస్‌లో లేకపోతే ఇలా చేస్తారా. ఆఫీస్‌లో కొంపలు అంటుకుంటున్నాయి. మనం ఆఫీస్‌కు వెళ్లాలి పదా అని కావ్యతో రాజ్ అంటాడు. ఇప్పుడా.. మా బావ అని కావ్య అంటే.. చూసుకోడానికి ఇద్దరూ ఉన్నారు అని కావ్యను లాక్కెళ్తాడు రాజ్. తర్వాత ఇంటికివచ్చిన కావ్య, రాజ్ స్వప్న ఫొటోషూట్ చూసి షాక్ అవుతారు.

ధాన్యలక్ష్మి సెటైర్స్: స్వప్న ఫొటోషూట్ తర్వాత స్వప్నను రుద్రాణి నిలదీస్తుంది. ఏదైనా చేసేముందు మాకు చెబితే బాగుండేదని అపర్ణ కూడా అంటుంది. పరిస్థితుల వల్ల అలా చేయాల్సివచ్చిందని స్వప్న చెప్తుంది. ఏంటా పరిస్థితులు అని వెటాకారంగా ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ఇంట్లో మా అత్తగారు, భర్త అడుక్కు తింటున్నారట. నాకు ఏమైనా ఖర్చులు ఉంటే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలట అని స్వప్న అంటుంది. అదేంటీ రుద్రాణి. అలా ఎలా అన్నావ్. వాళ్లే ఇక్కడ దోచుకుతింటుంటే అని ధాన్యలక్ష్మీ మళ్లీ సెటైర్ వేస్తుంది. చిన్నత్తయ్యా. ఇక్కడ ఎవరు ఎవరిని దోచుకుతినట్లేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారని కావ్య అంటుంది.

అనామికకు రాజ్ వార్నింగ్: దోచుకుతినకపోతే.. అప్పుని ఎరగా వేసి మా ఆయనను దక్కించుకుందామని అనుకుంటారు అని అనామిక అంటుంది. నా కుటుంబాన్ని అనేముందు నువ్ ఓసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇంతకన్న నేను ఏం అనను అని కావ్య బదులిస్తుంది. అనామిక ఇక్కడ ఉన్న వాళ్ల గురించి మాట్లాడు. అంతేకానీ లేని వాళ్ల గురించి అనడం సభ్యత కాదని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఎవరి పుట్టింటికి ఎంత వెళ్లింది అనేది అప్రస్తుతతం అని చెప్తాడు.

March 7th 2024 Episode number 351 in Brahmamudi Telugu Serial

స్వప్న ఆవేదన: ఇక స్వప్న మాట్లాడుతూ... భర్తగా, అత్తగా వీళ్లు చేతులెత్తేశారు. రేపు నాకు పుట్టబోయే బిడ్ గురించే నా బాధంతా. వాడు కూడా దేహి అని అడగాలా అని అంటుంది. అందుకే నాకు నచ్చిన పని తెలిసిన పని చేస్తున్నానని చెప్తుంది. మమ్మల్ని అడిగితే అయిపోయేది కదా అని సుభాష్ అంటాడు. మిమ్మల్ని ఎలా అడగగలను అంకుల్ అని స్వప్న అంటుంది. తను చెప్పింది కరెక్టే కదా డాడ్. ఏరా రాహుల్ నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అని రాజ్ అంటాడు.

త్వరలో డెసిషన్: చూసుకోడానికి నా దగ్గర ఏముందు బూడిద తప్పా.. అని రాహుల్ అంటాడు. మరోవైపు నా మొగుడు నాకు కోట్ల భరణం ఏమైనా ఇచ్చాడా. నా కొడుక్కి రాజ్‌లాగా వ్యాపారం అప్పజెప్పారా అని రుద్రాణి అంటుంది. నీ కొడుకు ఇప్పటికీ గాలి తిరుగుళ్లు తిరుగుతున్నాడు. ఎలా ఇస్తారు వ్యాపారం అని సుభాష్ అంటాడు. సరే సమస్య మాదాక వచ్చింది కదా. తాతయ్య ఏదో ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడు.

ప్రేమను బయటపెట్టడా: ఇది ఇక్కడితే ఆపేసేయ్ అని స్వప్నతో ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా లోపలికి వెళ్లిపోతారు.ఇక్కడితో సీరియల్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో ఇందిరాదేవి, కావ్య, భాస్కర్ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ కిటికిలోంచి చూస్తాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి వెళ్లి నీ ప్రేమను బయటపెట్టరా అని సలహా ఇస్తాడు. రాజ్ మాత్రం నో అన్నట్లుగా చూస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X